Home /News /explained /

HOW JUPITER TROJAN ASTEROIDS WILL HELP NASA LEARN ABOUT EVOLUTION OF SOLAR SYSTEM EXPLAINED JNK GH

NASA Jupiter Trojan: కొత్త ప్రయోగానికి సిద్ధమైన నాసా.. సౌర వ్యవస్థ పరిణామం గురించి బృహస్పతి ట్రోజన్‌ గ్రహశకలాలపై ప్రయోగాలు

నాసా చేయబోతున్న సరికొత్త ప్రయోగం వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

నాసా చేయబోతున్న సరికొత్త ప్రయోగం వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

NASA Jupiter Trojan | అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో కొత్త పరిశోధనకు శ్రీకారం చుట్టింది. బృహస్పతి ట్రోజన్ (Jupiter Trojan) గ్రహశకలాలను అన్వేషించాలనే లక్ష్యంతో 'లూసీ' అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను వచ్చే వారం ప్రయోగించనుంది.

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) మరో కొత్త పరిశోధనకు శ్రీకారం చుట్టింది. బృహస్పతి ట్రోజన్ (Jupiter Trojan) గ్రహశకలాలను అన్వేషించాలనే లక్ష్యంతో 'లూసీ' అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను (Space Craft) వచ్చే వారం ప్రయోగించనుంది. ఈ గ్రహశకలాలు సౌర వ్యవస్థ (Solar System) ప్రారంభ దశకు చెందిన అవశేషాలు అని పరిశోధకులు నమ్ముతారు. వాటిని అధ్యయనం చేయడం ద్వారా సౌర వ్యవస్థ మూలాలు, పరిణామాలను అర్థం చేసుకోవచ్చని భావిస్తున్నారు. సౌరశక్తితో పనిచేసే ఈ వ్యోమనౌక  (Spaceship) 12  సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వ్యవధిలో అంతరిక్ష నౌక ఎనిమిది గ్రహశకలాలను పరిశీలిస్తుంది. ప్రస్తుత సౌర వ్యవస్థపై మరింత లోతుగా పరిశోధనలు చేయడానికి ఇది 6.3 బిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

ఈ మిషన్‌కు లూసీ అనే పేరు పెట్టారు. 3.2 మిలియన్ ఏళ్ల క్రితం నాటి మానవుల పూర్వీకుల శిలాజ అవశేషాలను ఈ పేరుతో పిలుస్తారట. ఈ అంతరిక్ష నౌక అంగారకుడు- బృహస్పతి మధ్య కనిపించే ప్రధాన బెల్ట్‌లో ఉండే గ్రహశకలాన్ని ముందు పరిశీలించనుంది. దీనికి 'డోనాల్డ్ జాన్సన్' అని పేరు పెట్టారు. 'లూసీ' శిలాజ అవశేషాలను కనుగొన్న పాలియోఆంత్రోపాలజిస్ట్ డోనాల్డ్ జాన్సన్ పేరు మీదుగా గ్రహశకలానికి ఆ పేరు పెట్టారు.

SSC Recruitment 2021: రూ.85,500 వేతనంతో 3261 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ పాస్ అయితే చాలుఈ మిషన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? 
ఈ అంతరిక్ష నౌకను ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి అక్టోబర్ 16న ప్రారంభించనున్నారు. అట్లాస్ V 401 రాకెట్‌పై ఇది నింగిలోకి వెళ్లనుంది. తదనంతరం అంతరిక్ష నౌక భూమిని రెండుసార్లు చుట్టివస్తుంది. తన ప్రయాణానికి భూమి గ్రావిటేషనల్ ఫీల్డ్‌ (భూమ్యాకర్షణ కేంద్రం)ను ఉపయోగించడానికి ఇలా చేస్తుంది.

Infosys Jobs: కాలేజీ గ్రాడ్యుయేట్లకు ఇన్ఫోసిస్‌ గుడ్‌న్యూస్.. కొత్తగా 45 వేల జాబ్స్.. పూర్తి వివరాలివే..ఈ మిషన్ లక్ష్యం ఏంటి? 
దాదాపు 4 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థ ఏర్పడినప్పుడు.. గ్రహాలు ఏర్పడటానికి దారితీసిన అదే పదార్థం నుంచి ట్రోజన్ గ్రహశకలాలు ఏర్పడ్డాయని కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించాయి. అందువల్ల ట్రోజన్ గ్రహశకల సమూహాల్లో భాగమైన విభిన్న గ్రహశకలాల కూర్పును అర్థం చేసుకోవడానికి.. పదార్థాల ద్రవ్యరాశి, సాంద్రతలను గుర్తించడానికి.. ట్రోజన్ గ్రహశకలం చుట్టూ తిరిగే ఉపగ్రహాలను పరిశీలించడానికి, అధ్యయనం చేయడానికి ఈ మిషన్‌ను ప్లాన్ చేశారు.

SBI SO Recruitment 2021: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 606 ఉద్యోగాలు... దరఖాస్తుకు 5 రోజులే గడువుట్రోజన్ గ్రహశకలాలు అంటే ఏంటి? అవి ఎక్కడ ఉన్నాయి? 
సాధారణంగా గ్రహశకలాలను మూడు వర్గాలుగా విభజిస్తారు. అంగారక గ్రహం (Mars) - బృహస్పతి (Jupiter) మధ్య ప్రధాన గ్రహశకలం బెల్ట్‌లో కనిపించేవి మొదటి వర్గానికి చెందినవి. ఈ ప్రాంతంలో దాదాపు 1.1 నుంచి 1.9 మిలియన్ గ్రహశకలాలు ఉన్నట్లు అంచనా. రెండవ సమూహం పేరు ట్రోజన్లు. ఇవి పెద్ద గ్రహంతో కక్ష్యను పంచుకునే గ్రహశకలాలు. బృహస్పతి, నెప్ట్యూన్, మార్స్ గ్రహాలకు ట్రోజన్‌లు ఉన్నట్లు నాసా గుర్తించింది. 2011లో ఎర్త్ ట్రోజన్‌ను కూడా గుర్తించారు. బృహస్పతి గ్రహశకలాలు స్వార్మ్స్ (swarms) లేదా సమూహాలుగా ఉంటాయి. 2027 ఆగస్టు నాటికి బృహస్పతికి ముందు ఉండే ఈ గ్రహశకలాల మొదటి సమూహాన్ని ‘లూసీ’ చేరుకుంటుంది.

కప్పు టీ రూ.1,000.. అది కూడా తెలంగాణలో.. ఎందుకు అంత ధర..? తెలిస్తే మీరు వదలరూ..భూమికి దగ్గరగా కక్ష్యలను కలిగి ఉన్న నియర్ ఎర్త్ ఆస్టరాయిడ్స్‌ (NEA)ను మూడో వర్గం గ్రహశకలాలుగా గుర్తించారు. వీటిలో భూమి కక్ష్యను దాటి వచ్చే వాటిని ఎర్త్-క్రాసర్స్ అంటారు. ఇప్పటి వరకు 10,000 కంటే ఎక్కువ ఎన్‌ఈఏలను పరిశోధకులు గుర్తించారు. వీటిలో 1,400 ఆస్టరాయిడ్స్‌ను ప్రమాదకరమైన గ్రహశకలాలు (PHA)గా వర్గీకరించారు.
Published by:John Naveen Kora
First published:

Tags: Asteroid, NASA, Space

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు