Home /News /explained /

HOW IS MONEY TRANSFERRED ONLINE WHAT ARE THE DETAILS OF THEIR PROCESS CHARGES GH VB

Online Payments: ఆన్​లైన్ పేమెంట్లు ఎలా జరుగుతాయి..? ట్రాన్సాక్షన్స్​ ప్రాసెసింగ్ ప్రక్రియ, ఛార్జీల గురించి పూర్తి వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Online Payments: ఏదైనా ఓ లావాదేవీ ప్రధానంగా రెండు బ్యాంకుల మధ్యే జరుగుతుంది. అది ఏ కార్డ్ అయినప్పటికీ(డెబిట్, క్రెడిట్) ఈ లావాదేవీలను సులభతరం చేసే సంస్థలు ఉంటాయి. ఈ ఆన్ లైన్ లావాదేవీల్లో జరిగే ప్రాసెస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...
మీ ఏటీఎం కార్డ్​(ATM Cards)ని స్వైప్ (Swipe) చేసినప్పుడు లేదంటే ఆన్​లైన్ లావాదేవీలు (Online transactions) జరిపినప్పుడు అదనపు ఛార్జీలు ఏమైనా ఉంటాయా.? వీటి నుంచి బ్యాంకులు, కార్డు కంపెనీలు లేదంటే పేమెంట్ గేట్​వేలు ఏమైనా సంపాదిస్తాయా? అసలింతకీ ఈ చెల్లింపులన్నీ (Payments) ఎలా జరుగుతుంటాయి? ఈ లావాదేవీలన్నీ ఏ విధంగా ప్రాసెస్ అవుతాయి? తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే..

చెల్లింపులు ఎలా జరుగుతాయి..?
ఏదైనా ఓ లావాదేవీ ప్రధానంగా రెండు బ్యాంకుల మధ్యే జరుగుతుంది. అది ఏ కార్డ్ అయినప్పటికీ(డెబిట్, క్రెడిట్) ఈ లావాదేవీలను సులభతరం చేసే సంస్థలు ఉంటాయి. కస్టమర్ నుంచి అమౌంట్​ను సేకరించే బ్యాంక్​ను ఇష్యూయర్ బ్యాంక్ అని.. మరోవైపు మర్చంట్ బ్యాంక్ ఉంటుంది. స్థానిక దుకాణాలు, మాల్స్ సహా.. అమెజాన్, ఫ్లిప్​కార్ట్, జొమాటో వంటి ఈ-కామర్స్ వెబ్​సైట్​లు వీటికిందికి వస్తాయి. బ్యాంకులతో పాటు.. వీసా, మాస్టర్ కార్డ్, రూపే వంటి నెట్​వర్క్​లు సైతం లావాదేవీలు సాఫీగా సాగేందుకు సహాయపడుతుంటాయి. ఈ సంస్థలు ఇష్యూ చేసే డెబిట్, క్రెడిట్ కార్డ్​ల ద్వారా ట్రాన్సాక్షన్స్​ జరిపిస్తుంటాయి. ఓ విధంగా ఇవి కస్టమర్-వ్యాపారి మధ్య వారధిగా పనిచేస్తాయనుకోవచ్చు. ఇక ఆన్​లైన్ లావాదేవీల కోసం, పేయూ(PayU), రాజోర్​ పే(Razorpay), బిల్​డెస్క్(BillDesk) వంటి గేట్​వేలు థర్డ్ పార్టీలుగా పనిచేస్తాయి.

BSNL Offer: జియోకు పోటీగా బీఎస్​ఎన్​ఎల్ బంపరాఫర్.. ఈ యాన్యువల్ ప్లాన్​పై 90 రోజుల అదనపు వ్యాలిడిటీ..


మన లావాదేవీలన్నీ వేగంగా, సులభంగా ప్రాసెస్ అయ్యేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నేతృత్వంలోని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్​ఫేస్ (UPI) కీలకపాత్ర పోషిస్తుంది. మీ డబ్బు ప్రయాణం ఎలాగంటే.. ఎవరైనా ఓ వ్యాపారికి (మర్చెంట్‌) చెల్లించేందుకు కస్టమర్ అంగీకరించడమే ఆ లావాదేవీలో మొదటి ఫేజ్. కార్డ్ వివరాలు, ఓటీపీ, పిన్ నెంబర్ ద్వారా సెటిల్ చేయడం పేమెంట్ గేట్​వే పని. ఖాతాలోని బ్యాలెన్స్​ తనిఖీ, తప్పు కార్డు వివరాలు ఉన్నట్లయితే తిరస్కరణ వంటివి క్షణాల్లో జరిగిపోతుంటాయి.

యూపీఐ(UPI) లావాదేవీల విషయానికొస్తే ఫోన్​పే(PhonePe), పేటీఎం(Paytm), గూగుల్​పే(Google Pay) వంటి యాప్​లు క్యూఆర్ కోడ్​ల ద్వారా చెల్లింపులను సులభతరం చేస్తాయి. వీటికి రూటింగ్, ప్రాసెసింగ్, సెటిల్​మెంట్ సేవలను ఎన్​పీసీఐ(NPCI) అందిస్తుంది.

How to Become Rich: ధనవంతులు కావాలనుకుంటున్నారా..? అయితే ఈ 5 సూత్రాలు పాటించండి..


క్రెడిట్ కార్డ్ ఛార్జీలు ఎలా ఉంటాయి?
క్రెడిట్ కార్డ్​ ఛార్జీలను వ్యాపారే భరిస్తాడు. వీటిని బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య విభజిస్తారు. దీనినే మర్చంట్ డిస్కౌంట్ రేట్ అంటారు. ఇది 2-3 శాతం మధ్య ఉంటుంది. ఉదాహరణకు.. రూ.100 విలువైన క్రెడిట్ కార్డ్ లావాదేవీలో, వ్యాపారి రెండు-మూడు రూపాయలను వదులుకుంటాడు. పేటీఎం(Paytm), గూగుల్​పే(Google Pay), ఫోన్​పే(PhonePe) వంటి పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు 0.25 శాతం ఛార్జ్ చేస్తాయి.

డెబిట్ కార్డ్ పేమెంట్స్ ఏ విధంగా ఉంటాయి?
రూపే డెబిట్ కార్డ్​ల వినియోగంలో ఎటువంటి ఛార్జీలు ఉండవు. అయితే వీసా, మాస్టర్ కార్డ్ కార్డ్​లకు 0.4 నుంచి 0.9 శాతం చెల్లించాల్సి ఉంటుంది.

యూపీఐ లావాదేవీలు..
రూపే(RuPay), డెబిట్ కార్డ్​ల మాదిరే, యూపీఐ(UPI) పేమెంట్లు సైతం తమ యాప్​లపై జరిగే లావాదేవీల నుంచి ఎటువంటి ఆదాయాన్ని ఆర్జించవు.

Cashless Car Insurance: క్యాష్‌లెస్‌ కార్‌ ఇన్సూరెన్స్‌ అంటే ఏంటి..? దీనితో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి..?


భారత్​లో ఆన్​లైన్ పేమెంట్ల ఫ్యూచరేంటి?
యూపీఐ(UPI) చెల్లింపుల్లో 2021లో అసాధారణ వృద్ధి నమోదైంది. దీనితో భారతీయ రిటైల్ చెల్లింపుల్లో 50 శాతానికి పైగా మెజారిటీ వాటా సొంతం అవుతుందని మార్కెట్ రంగ నిపుణులు భావిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్న పలు నిర్ణయాలు, అమలు చేస్తున్న సంస్కరణలతో డిజిటల్ చెల్లింపుల్లో కొత్త శకానికి నాంది పలుకుతుందంటున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Free transaction, Online service

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు