హోమ్ /వార్తలు /Explained /

IPL: ఐపీఎల్ లో వేల కోట్లు ఎలా వస్తాయి? ఎవరి వాటా ఎంత? ఎక్కడ నుంచి జనరేట్ అవుతాయి?

IPL: ఐపీఎల్ లో వేల కోట్లు ఎలా వస్తాయి? ఎవరి వాటా ఎంత? ఎక్కడ నుంచి జనరేట్ అవుతాయి?

ఐపిఎల్ ఆదాయం ఎంత? ఎవరి వాటా ఎంత?

ఐపిఎల్ ఆదాయం ఎంత? ఎవరి వాటా ఎంత?

ఐ.పి.ఎల్ ఒక సీజన్ లో వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? అందులో ఎవరి వాటా ఎంత? బీసీసీఐ పెట్టే ఖర్చు ఎంత? వచ్చే రాబడి ఎంత? ఫ్రాంచైజీలు చేసే ఖర్చు ఎంత వాచ్చే లాభం ఎంత? ఈ లెక్కలు తెలిస్తే షాక్ తింటారు.

  భారత క్రికెట్ బోర్డు బంగారు బాతు ఐ.పి.ఎల్. ప్రతి ఏడాది కాసుల వర్షం కురిపిస్తోంది. అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా.. మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ లాంటి ఆరోపణలు వచ్చినా ఐపిఎల్ కు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతి ఏడాది లాభాల పంట పండిస్తోంది. అసలు ఈ ఐ.పి.ఎల్ కు కొన్ని వేల కోట్ల బిజినెస్ ఎలా జరుగుతోంది? ఆ ఆదాయం అంతా ఎక్కడి నుంచి జనరేట్ అవుతోంది? అలా వచ్చిన ఆదాయం ఎవరి ఖాతాలోకి వెళ్తాయో తెలుసా?

  గతేడాది.. అంటే 2020 ఐ.పి.ఎల్ సీజన్ లో బీసీసీఐకు నాలుగు వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం ఎంతపెద్ద అమౌంట్ అంటే.. ప్రపంచంలోని అన్ని దేశాల క్రికెట్ ఈవెంట్లు కలిపితే వచ్చే ఆదాయానికి 30 శాతం అధికం. అంతేకాదు ఆన్ లైన్ గేమింగ్ ల కంటే అత్యంత ఎక్కువ ఆదాయం వస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్ లాంటి సినిమా రంగాలలానే.. ఐ.పి.ఎల్ కూడా అతి పెద్ద ఆదాయాన్ని ఇస్తున్న రంగం. దీనిని నమ్ముకుని కొన్ని వేల మంది ఆధారపడి ఉన్నారు. కరోనా పూర్తిగా భయపెట్టిన సమయంలోనూ అంత ఆదాయం వచ్చింది అంటే ఐపిఎల్ కు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

  మరి ఇలా వచ్చే ఆదాయం ఎవరెవరి ఖాతాల్లోకి చేరుతుంది అంటే.. మొదటిగా బీసీసీఐకు ఎక్కువ ఆదాయం వస్తుంది. తారువాత ఫ్రాంచైజీలకు, ఆ తరువాత ఆటగాళ్లకు ఈ ఆదాయం వస్తుంది. మరి బీసీసీఐ వచ్చే ఆదాయ మార్గాలను పరిశీలిస్తే.. మొట్ట మొదట అత్యధికంగా వచ్చే ఆదాయం ఫ్రాంచైజీ ఓనర్ షిప్ ద్వారా వచ్చేదే. మొదటి సారి ముంబై ఇండియన్స్ అందరికంటే అత్యధికంగా 111.9 మిలియన్ డార్లు.. 830 కోట్లు పదేళ్లకు దక్కించుకున్నారు. అంటే ఏడాదికి 80 కోట్ల ఆదాయం ఒక్క ముంబై ఫ్రాంచైజీ నుంచే వస్తుంది. ఇక మిగిలిన ప్రాంచైజీలన్నీ కలిపితే ఆ ఆదాయం లెక్కయడానికే మనం నోళ్లు వెల్లబెట్టాల్సి వస్తుంది.

  ఇక రెండో ఆదాయం బ్రాడ్ కాస్ట్ రైట్స్ ద్వారా అత్యధికంగా వస్తోంది. బ్రాడ్ కాస్ట్ హక్కుల అమ్మకం ద్వారా 60 శాతం ఆదాయం బీసీసీఐకు వస్తోంది. మొదటి పదేళ్లకు ఐపిఎల్ మ్యాచ్ లను సోనీ సంస్థ 8200 కోట్ల రూపాయాలకు టెలీకాస్ట్ హక్కులను దక్కించుకుంది. అంటే సోనీ సంస్థ ద్వారా ఏడాదికి 820 కోట్ల రూపాయలు వచ్చేది. ఆ తరువాత ఎవ్వరూ ఊహించని స్థాయిలో స్టార్ స్పోర్ట్స్ సంస్థ ఐదేళ్లకు గానూ 16 వేల 347 కోట్ల రూపాయలకు బిడ్డింగ్ దక్కించుకుంది. అంటే ప్రతి ఏడాది స్టార్ స్పోర్ట్స్ ద్వారా బీసీసీఐకు 3270 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇక ప్రతి మ్యాచ్ కు స్టార్ స్పోర్ట్స్ 54 కోట్ల రూపాయలను బీసీసీఐ కు చెల్లిస్తుంది. ఈ రెండు మేజర్ ఆదాయ వనరులతో పాటు టైటిల్ స్పాన్సర్ షిప్ ల ద్వారా బీసీసీఐకు ఆదాయవ వస్తుంది. దీంతో పాటు ఆయా ప్రాంచైజీలకు వచ్చే లాభాల్లో 20 శాతం బీసీసీఐకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇంత ఆదాయం వస్తున్నా.. ఐ.పి.ఎల్ నిర్వహణ కోసం బీసీసీఐ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఖర్చులైన్నీ ఆయా ప్రాంఛైజీలే భరిస్తున్నాయి.

  ఇక ఫ్రాంచైజీలకు వచ్చే ఆదాయం చూస్తే.. బ్రాడ్ కాస్ట్ రైట్స్ లో బీసీసీఐతో పాటు.. ఫ్రాంచైజీలకు అధిక ఆదాయం ఉంటుంది. ఆయ వేదికలు, ఆ మ్యాచ్ లకు వచ్చే క్రేజ్ కూడా ఈ ఆదాయంపై ప్రభావం చూపిస్తాయి. అయితే తొలి పది సీజన్లకు సోనీ స్పోర్ట్స్ చాలా తక్కువ మొత్తానికి బిడ్ వేయడంతో చాలావరకు ఫ్రాంచైజీలు నష్టాల బాట పట్టాయి. కానీ స్టార్ స్పోర్ట్స్ భారీగా ఒప్పందం చేసుకున్న తరువాత అన్ని ఫ్రాంచైజీలు లాభాల బాట పట్టాయి. ఈ బ్రాడ్ కాస్ట్ హక్కుల్లో లాభాలతో పాటు.. టీం స్పాన్సర్ షిప్ ద్వారా భారీ ఆదాయం వస్తుంది. ప్రతి ఫ్రాంచైజీకీ ఒక్కో టీం టైటిల్ స్పాన్సర్ గా వ్యవహిస్తుంది. అందుకు భారీగా ఒప్పందం చేసుకుంటాయి. వీటికి తోడు ఇన్ స్టేడియం ఇన్ కమ్ కూడా ఫ్రాంచైజీల ఖాతాలోకే వెళ్తాయి. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా ఆ ఆదాయం పూర్తిగా తగ్గింది. స్టేడియంకు ప్రేక్షకులు వస్తే ఆ ఆదాయం ఫ్రాంచైజీల ఖాతాలో పడేది. సాధారణంగా అయితే ఇన్ స్టేడియం అడ్వరటైజ్ మెంట్, సేల్ ఆప్ మర్చంటైజ్ ద్వారా ఫ్రాంచైజీలకు భారీగా ఆదాయం వచ్చేది. వీటికి తోడు విజేత, రన్నరప్ లకు వచ్చే ప్రైజ్ మనీ కూడా ఫ్రాంచైజీలకే సొంతమవుతాయి.

  ఆదాయమే కాదు ఖర్చు కూడా ప్రాంచైజీలకు ఎక్కువే ఉంటుంది. ఓనర్ షిప్ కోసం బీసీసీఐకు భారీగా ఆదాయం చెల్లించాలి. అలాగే మ్యాచ్ ల నిర్వహణ బాధ్యత అంతా ఆయా ప్రాంచైజీలదే.. ఆగాళ్లు, స్టాప్, కోచ్ ల జీతాలు, వారి ట్రావెల్ అలవెన్స్, వారి ఎకామిడేషన్ అన్ని ఖర్చులూ ఫ్రాంచైజీలే భరించాలి. వీటికి తోడు స్టేడియం రెంట్, ఆపరేషనల్ ఖర్చులు.. మార్కెటింగ్ ప్రమోషన్స్ ఇలా ఖర్చులు తప్పవు. అన్నిటి కంటే ముఖ్యంగా ప్రాంచైజీలకు వచ్చే ఆదాయం బీసీసీఐ కు రౌడీ మామూలులా 20 శాతం చెల్లించాల్సి ఉంటుంది.

  మూడోది ఆదాయం సంపాదించేది ఆటగాళ్లే.. తొలి సీజన్ లో ధోనీకి 9.5 కోట్ల ఆదాయం వస్తే అందరూ షాక్ తిన్నారు. అంతర్జాతీయ మీడియాలో కూడా భారీగా కథనాలు వచ్చాయి.. రాను రాను ప్లేయర్ల ఆదాయం ఊహకందని రీతిలో పెరుగుతూ వస్తోంది. తరువాత గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ లాంటి వాళ్లు భారీ ధరకు పలికిన సంగతి తెలిసిందే. అయితే దీనికి తోడు ఇప్పుడు ఆయా ప్రాంచైజీలు ఒక ఆటగాడ్నితమతో పాటు నిలుపుకోడానికి భారీగా జీతం ఇవ్వాల్సి ఉంటుంది. అలా చూసుకుంటే ప్రస్తుతం అందరికంటే ఎక్కువగా కోహ్లీకి 17 కోట్ల రూపాయాలు వస్తోంది. భారత క్రికెటర్లలో తరువాత ధోనీ, రోహిత్ శర్మలు 15 కోట్లతో ఉన్నారు. విదేశీ ఆటగాళ్లు సైతం భారీగానే ఆదాయం దక్కించుకుంటున్నారు. దీనికి తోడు ప్రదర్శన ఆదారంగా వచ్చే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, టోర్నీ, ఎమర్జింగ్ ప్లేయర్, పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ లాంటివి చాలానే ఉన్నాయి. మరి ఇంత ఆదాయం ఇస్తున్న స్టార్ స్పోర్ట్స్ లాంటి బ్రాడ్ కాస్టర్స్ కి ఆదాయం ఎలా వస్తుంది అన్నది మన అందరికీ తెలిసిందే. అడ్వర్ టైజ్ మెంట్ ద్వారానే అత్యధిక ఆదాయం వస్తుంది. మ్యాచ్ బ్రేక్ సమయంలో సెకెను స్లాట్ కు లక్షల్లో వసూలు చేస్తారు. దీనికి తోడు డిజిటల్ రైట్స్ ద్వారా కూడా భారీగానే ఆదాయం వస్తుంది. అలాగే సబ్ స్క్రిన్స్ ద్వారా కొంత ఆదాయం వస్తుంది. అందుకే హాటస్టార్ లాంటి సంస్థుల ఆ హక్కులను దక్కించుకుంటున్నాయి. అలాగే వీటన్నింటికీ తోడు.. ఐ.పి.ఎల్ కారణంగా ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీగానే ఆదాయం వస్తూ ఉంది.. అందుకే ఇప్పుడు ఐపిఎల్ కూడా సినిమా రంగం లాంటిందే.. దీన్ని నమ్ముకుని కొన్ని వేల మంది జీవిస్తున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Bcci, Chennai Super Kings, Hotstar, IPL, IPL 2021, MS Dhoni, Mumbai Indians, Rohit sharma, Star sports, Virat kohli

  ఉత్తమ కథలు