• HOME
  • »
  • NEWS
  • »
  • EXPLAINED
  • »
  • HOW HOT WILL SUMMER 2021 IN INDIA EXPLAINED HERE THE FULL DETAILS SRD GH

Explainer : ఎండలు బాబోయ్ ఎండలు.. ఈ ఏడాది వేసవి ఎంత వేడిగా ఉండబోతోందో మీకు తెలుసా?

Explainer : ఎండలు బాబోయ్ ఎండలు.. ఈ ఏడాది వేసవి ఎంత వేడిగా ఉండబోతోందో మీకు తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

Explainer : మార్చిలోకి అడుగుపెట్టామో లేదో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఇదంతా చూస్తుంటే ఇప్పుడే ఇలా ఉంటే ఇక మే నెల ఆఖరికి వచ్చేసరికి ఉష్ణోగ్రతలు ఎంతగా పెరిగిపోతాయో అనిపించడం ఖాయం.

  • Share this:
మార్చిలోకి అడుగుపెట్టామో లేదో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఇదంతా చూస్తుంటే ఇప్పుడే ఇలా ఉంటే ఇక మే నెల ఆఖరికి వచ్చేసరికి ఉష్ణోగ్రతలు ఎంతగా పెరిగిపోతాయో అనిపించడం ఖాయం. ఇండియన్ మెటియోరాలజికల్ డిపార్ట్ మెంట్ ఈ ఏడాది మార్చి నుంచి మే వరకూ ఎలా ఉండబోతోందో దానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. గతంతో పోల్చితే ఈసారి భారత దేశం మొత్తం ఎండలు ఎక్కువగానే ఉండనున్నాయట. ఉత్తర భారతదేశం మొత్తం సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలే నమోదు కానున్నాయట. ఇక తూర్పు భారత దేశంలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాగే ఉష్ణోగ్రతలు పెరుగుతాయట. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు కనిష్ట ఉష్టోగ్రతల స్థాయి కూడా పెరుగుతుందని ఇవి గతంతో పోల్చితే ఎక్కువగా ఉంటాయని తేల్చి చెప్పారు. ఇక హిమాలయ పర్వత ప్రాంతాలతో పాటు కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణాదిలోని కొన్ని ప్రదేశాల్లో ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా పెరగకపోయినా కనిష్ట ఉష్ణోగ్రతల స్థాయి అయితే పెరుగుతుందని తేల్చి చెప్పారు. మధ్య భారత దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉంటాయట. రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు కూడా గత సంవత్సరం లాగే ఉండనున్నాయని నిపుణులు వెల్లడించారు. ఫిబ్రవరిలోని ఉష్ణోగ్రతలను ఆధారంగా చేసుకొని గత సంవత్సరాల ఉష్ణోగ్రతల ఆధారంగా ఈ వాతావరణ సూచికను తయారుచేసింది ఐఎండీ. ఏప్రిల్ లో మరోసారి సీజనల్ అవుట్ లుక్ ని విడుదల చేయనుంది. అందులో ఏప్రిల్ నుంచి జూన్ నెలల వరకూ వాతావరణం ఎలా ఉంటుందన్న విషయాలను వివరించనుంది.

ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే రాష్ట్రాల్లో పంజాబ్, చంఢీఘర్, హర్యానా, దిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ బిహార్ లలో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయట. ఈ ఉష్ణోగ్రతలు గతేడాదితో పోల్చితే 0.71 నుంచి ఒక డిగ్రీ ఎక్కువగా ఉండనున్నాయట. ఇక ఒడిషా, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర ల్లో కూడా వేడి ఎక్కువగానే ఉన్నా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల మాత్రం 0.25 నుంిచ 0.86 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదు కానున్నాయట. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో పగలు ఉష్ణోగ్రతలు దాదాపు గతేడాది ఉన్నట్లే ఉన్నా.. రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం పెరుగుతాయని వెల్లడించింది ఐఎండీ. గాలిలో తేమ ఎక్కువగా ఉండడం, అప్పుడప్పుడూ వానలు పడడం వల్ల రాత్రి ఉష్ణోగ్రతల్లో మార్పు కనిపించనుందట. తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్య ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, అసోం, మేఘాలయ, మిజోరాం, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రమే పెరగనున్నాయట. ఇక పంజాబ్, హర్యానా, చంఢీఘర్, దిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రాత్రి తో పాటు పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని ఐఎండీ వెల్లడించింది.

మన దేశంలో వేడి గాలుల ప్రభావం చాలా ఎక్కువ. ఒక ప్రదేశంలో వీస్తున్న గాలుల వల్ల అక్కడి ఉష్ణోగ్రత సాధారణం కంటే నాలుగు డిగ్రీలు పెరిగితే వడ గాలులు వీస్తున్నట్లుగా నిర్ధారిస్తారు. అయితే సీజన్ లో ఏయే ప్రాంతాల్లో ఎన్ని సార్లు వేడి గాలులు వీచే అవకాశం ఉందని చెప్పడం అసాధ్యం. అయితే కోర్ హీట్ వేవ్ జోన్ (CHZ)గా పిలిచే ప్రాంతాల్లో ఎక్కువగా వడగాల్పులు వీస్తాయట. వీటిలో రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చత్తీస్ ఘడ్, దిల్లీ, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఒరిస్సా, విధర్భ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉన్నాయి. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వడగాల్పులు వీస్తాయని మాత్రం ఐఎండీ చెబుతోంది.

లా నినా అంటే ఒక పసిఫిక్ మహా సముద్రం ఉపరితలపు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ధ్రువ ప్రాంతాల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తగ్గితే దాన్ని లా నినా అంటారు. లా నినా, ఎల్ నినో ఈ రెండు ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తాయి. లా నినా ప్రభావం వల్ల సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే దీనితో పాటు భూ వాతావరణం, సముద్రపు వాతావరణ పరిస్థితులు అన్నీ కలిసి మన దేశంలో వేసవి ఉష్ణోగ్రతలు ఎంత ఉంటాయో నిర్ణయిస్తాయని ఐఎండీ వివరిస్తోంది.
Published by:Sridhar Reddy
First published: