Home /News /explained /

HOW DID THE MISTAKE HAPPEN IN THE CASE OF PM SECURITY IN PUNJAB HOW DO YOU DESIGN SECURITY FOR THE ACTUAL PM DETAILS HERE GH VB

Explained: పంజాబ్‌లో పీఎం సెక్యూరిటీ విషయంలో పొరపాటు ఎలా జరిగింది.. అసలు పీఎంకు సెక్యూరిటీని ఎలా రూపొందిస్తారు..?

ప్రధాన మంత్రి సెక్యూరిటీ

ప్రధాన మంత్రి సెక్యూరిటీ

ప్రధాని పర్యటనలో సెక్యూరిటీ ప్లానింగ్‌ ఎలా ఉంటుంది? ఏయే సంస్థలకు అందులో ప్రమేయం ఉంటుంది? ప్రణాళికలో మార్పు చోటుచేసుకుంటే ఏం జరుగుతుంది? వంటి విషయాలు తెలుసుకుందాం.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) పంజాబ్‌(Punjab) పర్యటనలో భారీ భద్రతా(Security) లోపం కనిపించిన విషయం తెలిసిందే. ఒక ఫ్లైఓవర్‌పై 20 నిమిషాలకు పైగా ఆయన చిక్కుకుపోయారు. బుధవారం నాటి పర్యటనలో కొంతమంది నిరసనల కారణంగా ప్రధాని వాహన శ్రేణి నిలిచిపోయింది. ప్రముఖుల భద్రతకు పెద్ద పీట వేసే యంత్రాంగం ఉన్నప్పటికీ, ఇలా జరగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని(PM) పర్యటనలో సెక్యూరిటీ ప్లానింగ్‌ (Security Planning)ఎలా ఉంటుంది? ఏయే సంస్థలకు అందులో ప్రమేయం ఉంటుంది? ప్రణాళికలో మార్పు చోటుచేసుకుంటే ఏం జరుగుతుంది? వంటి విషయాలు తెలుసుకుందాం.

ప్రధాన మంత్రి సెక్యూరిటీ(Security)ని ఎలా ప్లాన్‌ చేస్తారు?
ప్రధానమంత్రి చేపట్టే ఏ పర్యటనలోనైనా విస్తృతస్థాయి అధ్యయనం ఉంటుంది. ఇందులో కేంద్ర సంస్థలతో పాటు రాష్ట్ర పోలీసు బలగాలు కూడా పాల్గొంటాయి. దీనికి సంబంధించి విస్తృతమైన మార్గదర్శకాలు ఉన్నాయి. దీనిని SPG వాళ్లు బ్లూ బుక్‌(Blue Book) అంటారు. ప్రధానమంత్రి సెక్యూరిటీకి (Security) బాధ్యత వహించే స్పెషల్‌ ప్రొటెక్షన్ గ్రూప్‌ (SPG), ఆ రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) అధికారులు, రాష్ట్ర పోలీసు అధికారులు, సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్‌తో తప్పనిసరిగా అడ్వాన్స్‌ సెక్యూరిటీ లైజన్‌ (ASL) నిర్వహిస్తారు. పర్యటనకు సంబంధించిన ప్రతి విషయాన్ని నిశితంగా చర్చిస్తారు, అవసరమైన భద్రతా ఏర్పాట్ల గురించి అధికారులు చర్చిస్తారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ASL నివేదిక సిద్ధమవుతుంది, దీనిపై ఆ సమావేశానికి హాజరైన అధికారులందరూ సంతకం చేస్తారు. ఆ నివేదిక ప్రకారం సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తారు.

Explained: భారత్‌లో విడుదలైన కొవిడ్‌ యాంటీ వైరల్‌ డ్రగ్ మోల్నుపిరావిర్‌.. దీని గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు..


సమావేశంలో ఏం నిర్ణయిస్తారు?
సాధారణంగా ప్రధాని పర్యటనకు సంబంధించి చివరి కార్యక్రమం వరకు అంతా ముందుగానే ప్లాన్‌ చేస్తారు. దానికి అనుగుణంగా ప్రయాణ ఏర్పాట్లు చేసి దానికి కట్టుబడి ఉంటారు. ఈ ప్రణాళిక రూపొందించడంలో కేంద్ర నిఘా సంస్థలు, స్థానిక నిఘా సంస్థల సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తర్వాత కార్యక్రమ వేదిక భద్రతను పరిశీలిస్తారు. అంటే ఎలా రావడం, ఎలా వెళ్లడం, సమావేశానికి వచ్చేవారిని తనిఖీ చేయడం, డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్ల ఏర్పాటు వంటి వాటి గురించి చర్చిస్తారు. వేదిక నిర్మాణాన్ని కూడా పరిశీలిస్తారు. (నాయకులు వేదికపై ఉండగా, అవి కూలిన ఘటనలు ఉన్నాయి)

వేదికకు సంబంధించి ఫైర్‌ సేఫ్టీ ఆడిట్‌ చేస్తారు. ఆ రోజు వాతావరణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఏదైనా ప్రదేశానికి చేరుకునేందుకు ప్రధాని పడవలో వెళ్లాల్సి వస్తే ఆ పడవను పరిశీలించి, దాన్ని భద్రతపై సర్టిఫికేట్‌ జారీ చేస్తారు. ప్రధాని పర్యటించే మార్గంలో ఏవైనా పొదలు ఉంటే, వాటిని నరికివేయమని SPG చెప్పవచ్చు. ప్రయాణించే మార్గంలో ఇరుక్కుగా ఉండే దారులు ఉంటే అక్కడ రూట్‌ సెక్యూరిటీలో భాగంగా ఎక్కువ మంది సిబ్బందిని మొహరించమని సూచించవచ్చు.

ప్లాన్‌ మారితే ఏం జరుగుతుంది?
అత్యవసర ప్రణాళిక అన్నది ఎప్పుడు ముందుగానే సిద్ధంగా ఉంటుంది. వాతావరణ నివేదికను పరిగణనలోకి తీసుకునేది అందుకే. ఒకవేళ వాతావరణ సరిగ్గా లేక ప్రధాని కార్యక్రమ వేదిక దగ్గరకు వాయుమార్గంలో వెళ్లలేని పరిస్థితి తలెత్తే ఎలా అని ఊహించి ముందుగానే ప్రత్యామ్నాయంగా రోడ్డు మార్గాన్ని ప్లాన్‌ చేస్తారు. ప్రధాని ఒకవేళ వాయుమార్గంలోనే ప్రయాణించినా కూడా ఆ రోడ్డు మార్గాన్ని శానిటైజ్‌ చేసి సెక్యూరిటీని మొహరిస్తారు.

Moths: మీ దుస్తులను తినే కీటకాలను ఇలా వదిలించుకోండి... అసలు ఇవి క్లాత్స్‌ను ఎందుకు తింటాయంటే..


ప్రధానికి సన్నిహిత భద్రతను మాత్రమే ఎస్‌పీజీ సమకూర్చుతుంది. మొత్తంగా వారి సెక్యూరిటీ బాధ్యతను ఏ రాష్ట్రంలో అయితే ప్రధాని పర్యటిస్తున్నారో ఆ రాష్ట్రమే తీసుకోవాల్సి ఉంటుంది. నిఘా వివరాల సేకరణ, రూట్‌ క్లియరెన్స్‌, వేదిక శుద్ధి, క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌వన్నీ ఆ రాష్ట్రమే చూసుకోవాలని SPGలో సేవలందించిన ఉత్తరప్రదేశ్‌ మాజీ డీజీపీ O.P.సింగ్‌ తెలిపారు.

భద్రతకు సంబంధించి ముప్పు గురించి వివరాలు అందించడం కేంద్ర నిఘా సంస్థల బాధ్యత. ఏది ఏమైనా ప్రధాన మంత్రి భద్రత ఎలా ఉండాలనే దానిపై తుది నిర్ణయం తీసుకునేంది SPGయే. స్థానిక పోలీసుల నుంచి అనుమతి వచ్చేంత వరకు ప్రధాని మంత్రి వాహనశ్రేణిని SPG కదిలించదు. విధ్వంస నిరోధక తనిఖీలు చేపట్టడం, రోడ్డుపైన భద్రతా బలగాలను మొహరించడం, పైకప్పులపై స్నైపర్లు అమర్చడం అంతా కూడా రాష్ట్ర పోలీసులే చేపట్టాల్సి ఉంటుంది. ప్రధాని వాహనశ్రేణికి పైలట్‌గా రాష్ట్ర పోలీసుల వాహనం ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా ప్రధాని బస చేయాల్సి వస్తే ఆ ప్రాంతంలో భద్రతను చూసేందుకు క్యాంప్‌ కమాండెంట్‌గా సూపరింటెండెంట్‌ స్థాయి పోలీసు అధికారి ఉండాల్సి ఉంటుంది.

జనం గుంపులుగా ఉన్న చోటుకు ప్రధాని వెళ్లినప్పుడు ఏం జరుగుతుంది?
బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్డు షోల సమయంలో భద్రత కోసం పోలీసులతో పాటు సాదా దుస్తుల్లో పోలీసులను మొహరించేందుకు ఎస్‌పీ స్థాయి అధికారి కూడా ఉంటారు. సాధారణంగా ర్యాలీలు సమయంలో పోలీసులు తమ పక్కన ఉండటం నాయకులకు నచ్చదు. అలా అని నాయకులను వదిలేయడం కుదరదు. కొంత మంది పోలీసులు పార్టీ కార్యకర్తలుగా సాధారణ దుస్తుల్లో అక్కడ తిరుగుతూ ఉంటారు. రాజకీయ కార్యక్రమాల సమయంలో ప్రధానికి చెందిన రాజకీయ బృందం లేదా ప్రొటోకాల్‌ పక్కన పెట్టాలని ప్రధాని వ్యక్తిగతంగా ఒత్తిడి చేస్తారు. అలాంటి సమయంలో భద్రత విషయంలో సందేహం ఉంటే SPG దానికి నిరాకరించవచ్చని SPG మాజీ ఛీప్‌ ఒకరు తెలిపారు.

శీతాకాలంలో చాలా సందర్భాల్లో మంచు కారణంగా ప్రధాని రోడ్డు మార్గంలో ప్రయాణిస్తుంటారు. ఈ మార్గాలను ముందుగానే ప్లాన్‌ చేసి భద్రతాపరమైన చర్యలు తీసుకుంటారు. ఒకవేళ ఏదైనా కారణంతో రోడ్డు క్లియర్‌గా లేకపోతే రాష్ట్ర పోలీసులు ముందుకు సాగేందుకు అనుమతించారు. అలాంటి సందర్భాల్లో పర్యటన రద్దవుతుందని ఒక అధికారి తెలిపారు.

ఊహించని నిరసనలు చోటుచేసుకుంటే?
వీపీఐల పర్యటనలో నిరసనలు అనేవి ఎప్పుడూ ముప్పే. వాటిని దృష్టిలో ఉంచుకొని తగిన ముందుస్తు చర్యలు చేపడతారు, అలాగే వాటిని తొలగించేందుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం ప్రయత్నిస్తుంది. సాధారణంగా ఏ గ్రూప్‌ అయినా నిరసనలకు దిగుతుందా అనే విషయాన్ని స్థానిక నిఘా వర్గాల నుంచి సేకరించి, దానిపై తగిన నివారణ చర్యలు చేపడతారు. స్థానిక పోలీసుల దగ్గర అనుమానాస్పద వ్యక్తులు లేదా నిరసనలు చేపట్టే వ్యక్తుల జాబితా ఉంటుంది. వారిని ముందుగానే నిర్బంధిస్తారు. అలాంటి వాటిపై సమాచారాన్ని సేకరించేందుకు భౌతిక నిఘాతో పాటు ఎలక్ట్రానిక్‌ నిఘా కూడా పెడతారు. ఒకవేళ ఆ నిరసనను నిలిపివేయడం కుదరని పక్షంలో ఆ మార్గాన్ని విడిచిపెడతారని ఆ అధికారి వివరించారు.

జనవరి 5న ఏం జరిగింది?
ప్రధాని పర్యటనలో హఠాత్తుగా మార్పు చోటుచేసుకుందని పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ పేర్కొన్నారు. కానీ ముందుగానే ప్రధాని కార్యక్రమాల వివరాలు అందజేశామని హోమ్‌ మంత్రిత్వ శాఖ అంటోంది. తగిన భద్రతా ఏర్పాట్లు చేశామని పంజాబ్‌ డీజీపీ నుంచి అవసరమైన నిర్ధారణ అందిన తర్వాత ఆయన రోడ్డు మార్గంలో ప్రయాణించేందుకు ముందుకు సాగారాని హోమ్‌ మంత్రిత్వ శాఖ చెప్తోంది.

Online Payments: ఆన్​లైన్ పేమెంట్లు ఎలా జరుగుతాయి..? ట్రాన్సాక్షన్స్​ ప్రాసెసింగ్ ప్రక్రియ, ఛార్జీల గురించి పూర్తి వివరాలు..


ఈ పనులకు ఎవరు బాధ్యత వహిస్తారు?
పంజాబ్‌ విషయంలో వాతావరణం సరిగ్గా లేని కారణంగా రోడ్డు మార్గాన ప్రయాణించేందుకు ప్రధాని ఎంచుకున్నప్పుడు ఆ మొత్తం మార్గాన్ని శానిటైజ్‌ చేసి, పైకప్పులపై స్నైపర్లు అమర్చాల్సిన బాధ్యత స్థానిక పోలీసులది. ముందుకు వెళ్లేందుకు స్థానిక పోలీసుల నుంచి అనుమతి వచ్చేంత వరకు ప్రధాని ముందుసాగేందుకు SPG అనుమతించదు. కాని ఈ ఘటనలో ప్రధాని ఫ్లైఓవర్‌పై 15 నిమిషాల పాటు నిలిచిపోయారు. వాస్తవానికి అది రోడ్డు జంక్షన్ కూడా కాదు. ఫ్లైఓవర్‌ నుంచి వెళ్లేందుకు ఆ మార్గాన్ని సురక్షితంగా ఉంచడంలో స్థానిక పోలీసులు విఫలమయ్యారని ఓ మాజీ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్‌తో సరిహద్దు కలిగిన పంజాబ్‌ వంటి రాష్ట్రంలో ఇది ఒక తీవ్రమైన భధ్రతా లోపమని ఆయన పేర్కొన్నారు.

కానీ ప్రధాని రోడ్డు మార్గాన వెళ్తానని నిర్ణయించుకున్నప్పుడు, SPG, పంజాబ్‌ DGP మధ్య ఏ సంభాషణ జరిగిందో అది ముఖ్యమని మరో అధికారి అన్నారు. రైతుల పేరుతో కొందరు నిరసనలకు ప్లాన్‌ చేస్తున్నారని లేదా ఆ ప్రాంతంలో కొంత ఆశాంతి ఉందని SPGకి ఒకవేళ పంజాజ్‌ DGP తెలిపి ఉంటే, ఆ మార్గంలో SPG వెళ్లకుండా ఉండాల్సిందని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని SPG మాజీ చీఫ్‌ ఒకరు వ్యాఖ్యానించారు.
Published by:Veera Babu
First published:

Tags: Pm modi, Security

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు