Mamata Banerjee: ఓడిపోయినా మమతా బెనర్జీ సీఎం ఎలా అయ్యారు.. భవానీపూర్ స్థానం నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు..?

మమతా బెనర్జీ (File)

తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ  పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ(West Bengal Assembly) ఎలక్షన్లలో విజయకేతనం ఎగురవేయడంతో.. ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సీఎంగా మూడోసారి ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే.

  • Share this:
తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ  పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ(West Bengal Assembly) ఎలక్షన్లలో విజయకేతనం ఎగురవేయడంతో.. ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సీఎంగా మూడోసారి ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. అయితే తన వెన్నంటే ఉన్న సువేంధు అధికారి చివరికి మోసం చేసి బీజేపీలో చేరడంతో మమతా బెనర్జీ(Mamata Banerjee) ఎన్నికలకు ముందు ఒక శపథం చేశారు. అదేంటంటే సువేంధుకు కంచుకోటగా ఉన్న నందిగ్రామ్‌లోనే పోటీ చేసి అతన్ని చిత్తుచిత్తుగా ఓడిస్తానన్నారు. కానీ ఆమె అనూహ్యంగా పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ సీఎం పదవిని అధిరోహించారు. కానీ, ఆరు నెలల్లోపు రాష్ట్రంలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, ఆమె పోటీ చేయాలనుకుంటున్న భవానీపూర్తో సహా పశ్చిమ బెంగాల్‌లోని మూడు స్థానాలకు ఉప ఎన్నికలు(By-Poll) నిర్వహించనున్నామని తాజాగా భారత ఎన్నికల సంఘం(Election Commission of India) ప్రకటించింది. ఈ మూడు స్థానాలకు సెప్టెంబర్ 30న ఉప ఎన్నికలు జరగనున్నాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఫలితాలు అక్టోబర్ 3న వెల్లడిస్తామని పేర్కొంది. ఈ క్రమంలో ఓడిపోయినప్పటికీ మమతా ఎలా సీఎం పదవిని అధిష్టించారు? గతంలో ఇలాంటి రాజకీయ పరిణామాలు ఎప్పుడైనా చోటుచేసుకున్నాయా? లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మమతా సీఎం పదవిని ఎలా చేపట్టారు?
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన స్థానం నుంచి ఓడిపోయినా.. మమతా సీఎం కావడమనేది నిజంగా విశేషం. భారతదేశ చరిత్రలో ఇలా జరగడం చాలా అరుదు అని చెప్పుకోవచ్చు. భారత రాజ్యాంగం ప్రకారం, ఎన్నికల్లో ఓడిపోయినా.. మమతా బెనర్జీ 6 నెలల పాటు సీఎంగా కొనసాగవచ్చు. ఎమ్మెల్యే లేదా ఎంపీ కాకపోయినా ముఖ్యమంత్రిగా.. మంత్రిగా లేదా ప్రధానమంత్రిగా(Prime Minister) కూడా పదవి చేపట్టవచ్చు. కానీ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలంటే ఆరు నెలల వ్యవధిలో మళ్ళీ ఎన్నికల్లో గెలవాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 (4) ప్రకారం.. ఒక మంత్రి ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కాని పక్షంలో తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీన్నిబట్టి దీదీ భవానీపుర్‌ నియోజకవర్గంలో గెలవడం అనివార్యమైంది.

EC on Huzurabad by election : పార్టీలకు ఈసీ బిగ్ షాక్... హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఇప్పట్లో లేవ్.. ?

గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా?
ఎమ్మెల్యే హోదాలో లేని వ్యక్తులు ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి అయిన సందర్భాలు కోకొల్లలు. కొద్ది నెలల క్రితం తీరాత్ సింగ్ రావత్ ఎమ్మెల్యే హోదాలో లేనప్పటికీ ఉత్తరాఖండ్ సీఎం అయ్యారు. 2011లో తొలిసారిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా గెలవలేదు. అయితే త్వరలోనే జరగనున్న భవానీపూర్(Bhabanipur) ఉప ఎన్నికల్లో ఓడిపోతే.. మమతా సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.

ఉప ఎన్నికలు త్వరగా పెట్టాలని టీఎంసీ డిమాండ్
పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికలు నిర్వహించాలని తృణమూల్‌ కాంగ్రెస్‌(Trinamool Congress) పార్టీ చాలాకాలంగా ఎన్నికల సంఘాన్ని కోరుతోంది. అంతేకాకుండా టీఎంసీ ప్రతినిధి బృందం ఈసీని అనేకసార్లు కలిసి.. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. జులైలో మమతా బెనర్జీ సైతం మోదీని కలిసి ఎన్నికలు సకాలంలో నిర్వహించాలని కోరినట్టు నివేదికలు పేర్కొన్నాయి.

Bengal by-election: భవానీపురం నుంచి మమతా బెనర్జీ పోటీ..

ఉపఎన్నికల నిర్వహణను ఆలస్యం చేసిన బీజేపీ
ఎన్నికలు వాయిదా వేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే సువేంధు అధికారితో సహా ఇతర బీజేపీ నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. కరోనా మహమ్మారి కారణంగా ఉప ఎన్నికలను వాయిదా వేయాలంటూ రాష్ట్ర బీజేపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసు ఇంకా విచారణలో ఉన్నందున ఎన్నికలు వాయిదా వేయాలంటూ బీజేపీ కూడా పట్టుబట్టింది.
Published by:Sumanth Kanukula
First published: