ఉక్రెయిన్‌పై రష్యా (Ukraine Russia war) దాడులు పదో రోజుకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు నగరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేసిన రష్యా దళాలు తాజాగా జఫ్రొజియాలోని అణు విద్యుత్ కేంద్రంపై మిసైల్స్ (Missiles)తో దాడి చేసింది. దీంతో ఒక్కసారిగా యూరప్‌తో పాటు యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. ఏదైనా జరగరానిది జరిగితే ఆ నష్టాన్ని ఊహించడం కష్టం. మొత్తం యూరప్ (Europe)కు అది వినాశకారిగా మారుతుందన్నడంలో సందేహం లేదు. జప్రొజియా అణు విద్యుత్ కేంద్రం (Zaporizhzhia Nuclear Plant) చెర్నోబిల్ కంటే భిన్నమైన డిజైన్‌తో ఏర్పాటు చేశారు. ఎదైనా అగ్ని ప్రమాదం జరిగినా ఎటువంటి నష్టం కలగకుండా రియాక్టర్లను ఫైర్ ప్రూఫ్‌తో డిజైన్ చేశారు. ఉక్రెయిన్‌లో అతి పెద్ద న్యూక్లియర్ ప్లాంట్ అయిన జప్రోజియా(Zaporizhzhia)పై పలుమార్లు రష్యా దాడులు (Attacks) చేసినట్లు తెలుస్తోంది. అక్కడ జరిగిన నష్టంపై తాజాగా ఉక్రెయిన్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. మార్చి 4 తెల్లవారుజామున రష్యా వైమానిక దళాలు జప్రోజియా అణు విద్యుత్ ప్లాంట్ (Zaporizhzhia Nuclear Plant) పై బాంబులతో దాడి చేయడంతో ప్లాంట్‌లో మంటలు చెలరేగాయని వెల్లడించారు. హుటాహుటినా ఉక్రెయిన్ ఎమర్జె్న్సీ టీమ్ ఉదయం 6.20 గంటలకు మంటలను అదుపులోకి తెచ్చింది. అయితే రష్యా దాడి (Russia attack) కారణంగా జరిగిన నష్టంపై నివేదికలో పేర్కొనలేదు.
అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం..
జప్రోజియా అణు విద్యుత్ కేంద్రం (Zaporizhzhia Nuclear Plant) సిబ్బంది అప్రమత్తతో తీవ్ర ప్రమాదం తప్పింది. కానీ, మొదటి అణు రియాక్టర్ యూనిట్‌కు సంబంధించిన పరిపాలన భవనం దాడిలో స్వల్పంగా దెబ్బతింది.భవనం స్వల్పంగా కాలిపోయినా యూనిట్ భద్రతను ప్రభావితం కాలేదు. దీంతో అక్కడి అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ప్లాంట్‌లోని రియాక్టర్లు మందపాటి కాంక్రీట్ కంటైన్మెంట్ డోమ్లతో నిర్మించారు. దీంతో యుద్ధ ట్యాంకులు, మోటార్షెల్స్లతో కాల్పులు జరిపినా అవి సురక్షితంగా ఉంటాయి.
ప్రస్తుతం రేడియేషన్ (radiation) స్థితిలో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. SNRIU, SSTC NRS నిపుణులు జప్రోజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నారు. రష్యా దాడి (Russia Attack) కారణంగా మొదటి యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. రెండు, మూడు యూనిట్లను కూడా గ్రిడ్ నుండి డిస్ కనెక్ట్ చేశారు. కేవలం నాలుగో యూనిట్ మాత్రమే 690 మెగావాట్ల విద్యుత్‌తో పని చేస్తోందని ఉక్రెయిన్ ప్రకటనలో పేర్కొంది.
రష్యా సైన్యం ఆధీనంలోనే జప్రోజియా అణువిద్యుత్ కేంద్రం..
జప్రొజియా అణు విద్యుత్ కేంద్రం (Zaporizhzhia Nuclear center) లో కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగిస్తే రియాక్టర్లను చల్లబర్చడానికి అవసరమైన శక్తిని అందించడానికి డీజిల్ జనరేటర్లను వినియోగించాల్సి వస్తుంది. దీంతో రియాక్టర్లు మెల్ట్ డౌన్ అయ్యే ప్రమాదం ఉందని ఉక్రెయిన్ స్టేట్ న్యూక్లియర్ రెగ్యులేటర్ (State Nuclear Regulator of Ukraine) ఆందోళన వ్యక్తం చేసింది.
2011లో భారీ భూకంపం, సునామీ కారణంగా జపాన్‌లోని ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రంలోని శీతలీకరణ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. మూడు రియాక్టర్లలో మెల్ట్డౌన్లను ప్రేరేపించినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం జప్రొజియా అణువిద్యుత్ కేంద్రంలో కూడా ఇలాంటి విపత్తు చోటుచేసుకునే అవకాశం ఉందని ఉక్రెయిన్ స్టేట్ న్యూక్లియర్ రెగ్యులేటర్ ఆందోళన చెందుతుంది. ప్రస్తుతం, జప్రోజియా అణు విద్యుత్ ప్లాంట్ రష్యా సైన్యం నియంత్రణలో ఉంది.
దాడిని ఖండించిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
జప్రొజియా అణు విద్యుత్ కేంద్రం దాడి ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ (President of Ukraine Volodymyr Zhelensky) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా న్యూక్లియర్ రియాక్టర్లపై దాడి చేయడం ప్రపంచ చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు. అణువిద్యుత్ కేంద్రం ధ్వంసమైతే యావత్ యూరప్‌కు పెనుప్రమాదం ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. ఉక్రెయిన్ (Ukraine)లో మొత్తంగా 15 అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయని, వాటి రక్షణకు పశ్చిమ దేశాలు మరింత సాయం చేయాలని లేకపోతే యూరప్‌లోని మిగిలిన దేశాలపై కూడా రష్యా దాడి చేసే అవకాశం ఉందని జెలెన్స్కీ హెచ్చరించారు. రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు నో ఫ్లయింగ్ జోన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అణు విద్యుత్ కేంద్రంపై రష్యా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించింది యూకే. ప్రధాని బోరిస్ జాన్సన్ రష్యాపై విరుచుకుపడ్డారు. యూరప్ (Europe) వినాశనానికి పుతిన్ కంకణం కట్టుకున్నాడని విమర్శించారు. వెంటనే యూఎన్ (UN) భద్రతా మండలి అత్యవసరంగా భేటీ కావాలని విజ్ఞప్తి చేశారు. యూరప్, ప్రపంచ భద్రత దృష్ట్యా ఉక్రెయిన్‌పై దాడులు ఆపాలని రష్యాను కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bomb attack, Missile, Russia, Russia-Ukraine War