Home /News /explained /

HOW COVID IMPACT ON LEARNING OF STUDENTS EXPLAINED HERE JNK GH

Explained: భారత విద్యావిధానంపై కరోనా ప్రభావం.. పిల్లల అభ్యాసన సామర్థ్యాలను తీవ్రంగా దెబ్బతీసిన మహమ్మారి

విద్యాభ్యాసంపై కరోనా ప్రభావం ఎలా ఉన్నది? (ప్రతీకాత్మక చిత్రం)

విద్యాభ్యాసంపై కరోనా ప్రభావం ఎలా ఉన్నది? (ప్రతీకాత్మక చిత్రం)

కరోనా మహమ్మారి చిన్న పిల్లల విద్యపై ఎక్కువ ప్రభావం చూపింది. ప్రీ-ప్రైమరీ క్లాస్ అనుభవలేమి, డిజిటల్ డివైజెస్ కు యాక్సెస్ లేకపోవడం లాంటి కారణాల వల్ల 3 నుంచి 5 ఏళ్ల పిల్లల విద్యావసరాలను తీర్చలేకపోవడం తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుందని సర్వే పేర్కొంది.

ఇంకా చదవండి ...
కోవిడ్ మహమ్మారి (Covid Pandemic) ప్రభావం వల్ల భారత్ లో పాఠశాలలు (Schools) చాలా కాలం పాటు మూసివేశారు. ఇటీవలే స్కూళ్లను తిరిగి ప్రారంభించారు. అక్కడక్కడా కేసులు నమోదవుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతున్నారు. అయితే కరోనా అనంతరం పరిణామాలు తీవ్రంగా మారాయి. స్కూళ్లను పునః ప్రారంభించిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని భారత జాతీయ విద్యా సర్వే పేర్కొంది. ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 10 సంవత్సరాల కనిష్ఠ స్థాయికి చేరుకుందని, ప్రైవేటు ట్యూషన్ తరగతులపై ఆధారపడేవారి సంఖ్య పెరిగిందని నివేదించింది. అంతేకాకుండా డిజిటల్ డివైడ్, ప్రైమరీ గ్రేడ్ విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలపై తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశముంటుందని స్పష్టం చేసింది.

ప్రథమ్ ఫౌండేషన్ (Pratham Education Foundation) తాజాగా వార్షిక విద్యా స్థితి నివేదిక (Annual Status of Education Report -ASER) సర్వేను నిర్వహించింది. ప్రాథమిక స్థాయిలో ఫౌండేషన్ లెర్నింగ్ స్థాయిలపై నివేదికను బుధవారం విడుదల చేసింది. ఈ రిపోర్టుకు సంబంధించిన 16వ ఎడిషన్ ను 25 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 581 జిల్లాల్లో ఉంటున్న 75,234 మంది పిల్లలపై ఫోన్ సర్వే చేసింది. సెప్టెంబరు, అక్టోబరు మధ్య కాలంలో చేసిన ఈ సర్వే ఆధారంగా రిపోర్ట్ రూపొందించింది. ఇందులో భాగంగా 7,299 ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు లేదా ప్రధాన ఉపాధ్యాయులను సంప్రదించారు.

Explained: కోవిడ్ టీకా రెండో డోసుపై ప్రజల నిర్లక్ష్యం.. వేసుకోకుంటే ఏమవుతుందో తెలుసా?




* గణాంకాలు ఎలా ఉన్నాయి?
ఈ రిపోర్ట్ స్పష్టమైన మార్పును సూచించింది. ప్రభుత్వ పాఠశాలలో నమోదు 2018లో 64.3 శాతం ఉండగా.. 2020 నాటికి 65.8 శాతానికి పెరిగింది. ఈ సంవత్సరం ఈ శాతం 70.3 శాతానికి చేరింది. ప్రైవేటు పాఠశాలలో నమోదు 2020లో 28.8 శాతం ఉండగా.. 2021 నాటికి 24.4 శాతానికి పడిపోయింది. "2006 నుండి 2018 వరకు దాదాపు 65% వరకు ప్రభుత్వ పాఠశాలలో నమోదు తగ్గుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో చూస్తే గత సంవత్సరం కంటే 5 శాతం పాయింట్ల పెరుగుదల కనిపించింది" అని ASER సెంటర్ డైరెక్టర్ విలిమా వాధ్వా, ప్రథమ్ సీఈఓ రుక్మిణి బెనర్జీ అన్నారు.

* ట్యూషన్ పై ఆధారపడటం..
గతంలో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రైవేటు ట్యూషన్ పై ఎక్కువగా ఆధారపడేవారని సర్వే తెలిపింది. ప్రస్తుతం మొత్తం మీద 39.2 శాతం మంది పిల్లలు ట్యూషన్లు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఉన్నత విద్యానేపథ్యం కలిగి ఉన్న పిల్లలు కూడా ట్యూషన్లను ఆశ్రయిస్తున్నారు. ఈ సంఖ్య 2018 నుంచి 2021 మధ్య 7.2 నుంచి 12.6 శాతానికి పెరిగింది. 5వ తరగతి వరకు లేదా అంతకంటే తక్కువ చదువుకున్న తల్లిదండ్రులు ఉన్న కుటుంబాలను తక్కువ విద్యా విభాగంలో, 9వ తరగతి పాసైన తల్లిదండ్రుల కుటుంబాలను ఉన్నత విద్యావిభాగంలో ఉన్నారు.

* డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రభావం
కరోనా మహమ్మారి చిన్న పిల్లల విద్యపై ఎక్కువ ప్రభావం చూపింది. ప్రీ-ప్రైమరీ క్లాస్ అనుభవలేమి, డిజిటల్ డివైజెస్ కు యాక్సెస్ లేకపోవడం లాంటి కారణాల వల్ల 3 నుంచి 5 ఏళ్ల పిల్లల విద్యావసరాలను తీర్చలేకపోవడం తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుందని సర్వే పేర్కొంది. 1, 2 తరగతుల్లో మూడింట రెండు వంతుల మంది వ్యక్తిగతంగా హాజరు కాలేదని నివేదిక స్పష్టం చేసింది.
ఇంట్లో కనీసం ఓ స్మార్ట్ ఫోన్ ఉన్న కుటుంబాల శాతం 2018-2021 మధ్య కాలంలో 36.5 నుంచి 67.6 శాతానికి పెరిగిందని.. అయితే 1, 2 తరగతులకు చెందిన పిల్లల్లో 19.9 శాతం మంది మాత్రమే తమకు అవసరమైనప్పుడు డిజిటల్ యాక్సెస్ చేయగలుగుతున్నారని తెలిపింది. స్మార్ట్ ఫోన్ల యాక్సెస్ పిల్లల వయస్సుతో పాటు పెరుగుతుందని.. 9 లేదా అంతకంటే ఎక్కువ తరగతుల్లో 35.4 శాతం డిజిటల్ యాక్సెస్ కలిగి ఉన్నారని నివేదిక పేర్కొంది.

MS Dhoni Crazy Fan: ధోనీ కోసం 1436 కిలోమీటర్లు నడుకుచుంటూ వచ్చిన క్రేజీ ఫ్యాన్.. ఇదే మొదటి సారి కాదు..! తర్వాత ఏం జరిగింది?




* విద్యలో వెనుకంజలోనే..
65.4 శాతం మంది ఉపాధ్యాయులు పిల్లల సమస్యను కనుగొనలేకపోవడం అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా నివేదిక పరిగణించింది. ఇది అత్యవసరంగా పరిష్కరించకపోతే లెర్నింగ్ రిజల్ట్స్ ప్రభావితమవుతుందని హెచ్చరించింది. ఏఎస్ఈఆర్ సర్వే అభ్యసన ఫలితాలను ప్రభావితం చేయనప్పటికీ మార్చి 2021 నాటికి కర్ణాటకలో 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సున్న 20 వేల మంది పిల్లల్లో ప్రాథమిక నైపుణ్యాలు తగ్గడం గుర్తించింది. ముఖ్యంగా దిగువ ప్రైమరీ గ్రేడ్ ల్లో ఈ తగ్గుదలను గుర్తించింది.

2010లో 15-16 సంవత్సరాల వయస్సు కలిగిన వారిలో బడి మానేసిన వారి సంఖ్య 16.1 శాతంగా ఉంది. మాధ్యమిక విద్యను సార్వత్రికీకరించడానికి ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడి కారణంగా, ఈ సంఖ్య క్రమంగా తగ్గుతూ 2018లో 12.1 శాతానికి చేరింది. ఈ క్షీణత 2020లో 9.9 శాతానికి, 2021నాటికి 6.6 శాతానికి కొనసాగింది
Published by:John Kora
First published:

Tags: Corona, Online Education, Students

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు