ప్రస్తుతం ప్రపంచంలోనే ఎక్కువ జానాభా ఉన్న దేశం చైనా(China).చైనా అధ్యక్షుడిగా జీ జిన్ పింగ్(XI Jinping)ఉన్నారు. 2013 నుంచి చైనా అధ్యక్షుడిగా జిన్ పింగ్ కొనసాగుతున్నారు. చైనా అధ్యక్షుడిగా, దేశంలోనే అత్యంత శక్తిమంతమైన నేతగా అవతరించిన జీ జిన్‌పింగ్.. అక్టోబర్ 16న జరగనున్న 20వ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్(Chinese Communist Party Cogress) సమావేశంలో మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశముంది. మావో తర్వాత జి జిన్‌పింగ్ అత్యంత శక్తివంతమైన, సమర్థవంతమైన నాయకుడిగా చైనాలో కనిపిస్తు్న్నారని రాజకీయ పండితులు చెబుతుంటారు. 8వ కాంగ్రెస్ లో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన జిన్ పింగ్ కాలక్రమేణా పార్టీపై పట్టు బిగించారు. అతను చైనాను సమిష్టి నాయకత్వ సంప్రదాయం నుండి బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలే చేశాడు.కొన్నిసార్లు నిస్సందేహంగా, కొన్నిసార్లు సంయమనంతో, అన్ని రాజకీయ వ్యూహాల ద్వారా తన ఫ్లాన్ ను చాపకింద నీరులా అమలుచేసుకుంటూ వెళ్లాడు. అయితే, వాటిని అంతం చేయడం అంత తేలికైన పని కాదు. జి జిన్‌పింగ్ తన పేరుని దేశ శక్తిని పర్యాయపదంగా మార్చుకున్నారు.
-2013లో చైనా అధ్యక్ష బాధ్యతలు తర్వాత జిన్‌పింగ్... ద్రోహులుగా, అవినీతిపరులుగా లేదా అసమర్థంగా భావించే అధికారులను తొలగించడానికి పెద్ద క్యాంపెయిన్ ప్రారంభించారు. ఆ ఖాళీ స్థానాలను తన మిత్రపక్షాలతో భర్తీ చేయడం ద్వారా జిన్‌పింగ్ తన అధికారాన్ని నిర్మించుకున్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం, జిన్‌పింగ్ పదవీకాలంలో ఇప్పటివరకు 47 లక్షలకు పైగా అధికారులను విచారించారు.
-కీలకమైన వ్యక్తుల నియామకాలను నియంత్రించే పార్టీ మానవ వనరుల నిర్వహణకు విశ్వసనీయ సహాయకులను జిన్ పింగ్ నియమించారు. అతని మొదటి సంస్థ విభాగాధిపతి జావో లీజీ. అతని తండ్రి జిన్ పింగ్ తండ్రితో కలిసి పనిచేశారు. 2013లో చైనా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటికీ..జి జిన్‌పింగ్ 2015 తర్వాత మాత్రమే చైనా ఆర్మీ లేదా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA)పై తన పట్టును బలోపేతం చేయడానికి కృషి చేశారు. జిన్‌పింగ్..తాను చనిపోయేవరకు చైనాకు అధ్యక్షుడుగా ఉండాలని కలలు కంటున్నందున, అతని డ్రీమ్స్ కి ఆ దేశ సైన్యం ప్రతిబంధకంగా మారవచ్చు. దీన్ని ముందుగానే పసిగట్టిన జిన్‌పింగ్ అన్ని తిరుగుబాట్లను అరికట్టడానికి 2015 నుండి సైన్యంలో విస్తృతమైన సంస్కరణలు, తొలగింపులను ప్రారంభించారు. తనకు నమ్మకస్తులైన వారిని సైన్యంలో ఉన్నత స్థానాల్లో నియమించడం ప్రారంభించాడు.
-2021లో జారీ చేసిన తీర్మానంలో సైన్యంతో పాటు ఏదైనా మిషన్‌లో రిక్రూట్‌మెంట్ విషయంలో తన భాగస్వామ్యం ఉండేలా చేశాడు. దీంతో ఇప్పుడు జిన్ పింగ్ సైన్యం యొక్క ప్రతి ఒక్క కార్యాచరణ గురించి తెలుసుకుంటారు, తద్వారా అతను పెరుగుతున్న అసంతృప్తిని వెంటనే అణచివేయవచ్చు.
Viral Video : పాక్ ఇంజినీర్ల అద్భుతం..నడిరోడ్డులో కరెంట్ పోల్స్..వీడియో వైరల్
-మిలిటరీతో పాటు దేశీయ భద్రతా వ్యవస్థను(Security System)నియంత్రించడానికి జిన్‌పింగ్.. ప్రక్షాళన ప్రచారాన్ని ప్రారంభించారు. తనకు ముప్పు ఉందని భావించిన పలువురు పోలీసు ఉన్నతాధికారులు, న్యాయమూర్తులను జిన్‌పింగ్ తమ పదవుల నుండి తొలగించారు జిన్‌పింగ్. 2015 నుండి జిన్‌పింగ్... తన వార్షిక పని నివేదిక గురించి సమాచారాన్ని అందించాలని పార్లమెంటు, మంత్రివర్గం, సుప్రీంకోర్టుతో సహా ఇతర సంస్థలను ఆదేశించాడు.
-ఇక,మీడియాను తన చెప్పుచేతుల్లో ఉంచుకోవటానికి,తను చెప్పిందే మీడియాలో వేదం అని చెప్పేలా చేయడానికి..ప్రభుత్వ మీడియాని తన ఆధీనంలోకి తీసుకునేందుకు జిన్‌పింగ్ కూడా చాలా మార్పులు చేశారు. 2016లో దేశ మీడియాకు ఇచ్చిన ఉత్తర్వులో.. "పార్టీ హాయ్ ఇంటిపేరు హై' అనే సందేశాన్ని ఇచ్చిన పార్టీ లైన్‌ను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. జిన్ పింగ్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వ మీడియా యొక్క స్వతంత్రత క్రమంగా క్షీణించింది. జిన్ పింగ్ కు సంబంధించిన ప్రచారం క్రమంగా పెరిగింది.
-చైనా లక్షణాలతో కూడిన సోషలిజంపై జి జిన్‌పింగ్ అభిప్రాయాన్ని చేర్చడానికి కమ్యూనిస్ట్ పార్టీ 2017లో పార్టీ రాజ్యాంగాన్ని సవరించింది. ఇప్పటి వరకు మావో, డెంగ్ జియావోపింగ్‌లను మాత్రమే పార్టీ సిద్ధాంతాల్లో చేర్చారు. జిన్‌పింగ్ ఆలోచనను పార్టీ రాజ్యాంగంలో చేర్చడం పార్టీలో ఆయన స్థాయిని తెలియజేస్తోంది.
-దేశంలోనే అత్యున్నత వ్యక్తి అని 2017 సంవత్సరంలో ఇచ్చిన ప్రకటనలో జిన్‌పింగ్ స్పష్టం చేశారు. 2017లో ప్రకటన చేయడం ద్వారా పార్టీ అత్యున్నత పాత్రను ఆయన స్పష్టం చేశారు.
-ఒక సంవత్సరం తరువాత, జీవితకాలం పాలించే అడ్డంకిని తొలగించారు. అధ్యక్ష పదవికి పదవీ పరిమితిని ముగించారు. దేశ చరిత్రలో పెద్ద పెద్ద నాయకులు చేయలేని పనిని జిన్‌పింగ్ తన వ్యక్తులను ముఖ్యమైన స్థానాల్లో నియమించి సాధించారు.
-2021లో అన్ని రకాల మార్పులు చేసిన తర్వాత కూడా జిన్‌పింగ్ చారిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించారు. 2021లో ఆమోదించిన తీర్మానంలో, పార్టీ రెండు స్థాపనలను నిలుపుకోవాలని ప్రతిజ్ఞ చేసింది. జిన్‌పింగ్‌కు విధేయత గురించి కూడా చర్చించబడింది.
-చైనా నేడు ప్రపంచంలో అత్యంత బలంగా ఉంది. రాబోయే దశాబ్దాలలో మరింత శక్తివంతంగా మారనుంది. ప్రజలను సంతృప్తి పరచడానికి జిన్‌పింగ్ పెద్ద కలలు కనడం ప్రారంభించారు. అతని ప్రకారం, 2035 నాటికి, చైనా పూర్తిగా ఆధునిక సోషలిస్టు సమాజంగా, 2050 నాటికి సంపన్న, శక్తివంతమైన, ప్రజాస్వామ్య, సామరస్య, అందమైన సోషలిస్ట్ ఆధునిక దేశంగా ఆవిర్భవిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, Xi Jinping