Home /News /explained /

Explained: ఐపీఎల్​ 2022 ఫ్రీ పికప్ రూల్స్​పై సందిగ్ధత.. ఆ రెండు కొత్త జట్లు ఆటగాళ్లను ఎలా జట్టులోకి తీసుకోబోతున్నాయి?

Explained: ఐపీఎల్​ 2022 ఫ్రీ పికప్ రూల్స్​పై సందిగ్ధత.. ఆ రెండు కొత్త జట్లు ఆటగాళ్లను ఎలా జట్టులోకి తీసుకోబోతున్నాయి?

కొత్త జట్లు ఆటగాళ్లను ఎలా ఫ్రీ పికప్ చేసుకోబోతున్నాయి? (PC: IPL)

కొత్త జట్లు ఆటగాళ్లను ఎలా ఫ్రీ పికప్ చేసుకోబోతున్నాయి? (PC: IPL)

IPL 2022: మెగా వేలంపాటకు ముందే పాత జట్లకు రిటెన్షన్ పాలసీ, కొత్త జట్లకు ఫ్రీ పికప్ నిబంధన అమలులో ఉంటుంది. ఇపపటికే పాత ఎనిమిది ఫ్రాంచైజీల్లో ఒక్కోటి నలుగురు చొప్పున కలిగి గరిష్టంగా 32 మంది ఆటగాళ్లను రిటైన్​ చేసుకునే అవకాశం ఉండగా.. 27 మందిని మాత్రమే ఆయా ఫ్రాంచైజీలు రిటైన్​ చేసుకున్నాయి. ఇక కొత్తగా వచ్చిన రెండు జట్లకు ఫ్రీ పికప్ ఆప్షన్ అమలులోకి రానున్నది.

ఇంకా చదవండి ...
క్రికెట్ ఫ్యాన్స్ (Cricket Fans) ఎంతగానో ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 2022 (IPL 2022)​ సంగ్రామం త్వరలోనే ప్రారంభం కానుంది. ఐపీఎల్​ 2021లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనగా.. ఈ సారి మొత్తం పది జట్లు పాల్గొనబోతున్నాయి. కాబట్టి పోటీ రసవత్తరంగా మారనుంది. కొత్తగా లక్నో (Lucknow Team), అహ్మదాబాద్​ ఫ్రాంజైజీ జట్లు బరిలోకి రావడంతో ఆటగాళ్ల మెగా వేలం జనవరిలో షూరూ కానుంది. అయితే మెగా వేలంపాటకు (Mega Auction) ముందే పాత జట్లకు రిటెన్షన్, కొత్త జట్లకు ఫ్రీ పిక్ అవకాశం ఉన్నది. ఎనిమిది ఫ్రాంచైజీల్లో ఒక్కోటి నలుగురు చొప్పున కలిగి గరిష్టంగా 32 మంది ఆటగాళ్లను రిటైన్​ (Player Retention)  చేసుకునే అవకాశం ఉండగా.. 27 మందిని మాత్రమే ఆయా ఫ్రాంచైజీలు రిటైన్​ చేసుకున్నాయి. ఈ 27 మంది క్రికెటర్లే పాత ఫ్రాంచైజీలతో కొనసాగనున్నారు. అయితే ఈసారి కొత్తగా బరిలోకి దిగిన లక్నో, అహ్మదాబాద్​ ఫ్రాంచైజీల విషయంలో ఫ్రీ పికప్​ నియమాలు ఎలా ఉంటాయనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

* కొత్త జట్లకు ఫ్రీపికప్ నిబంధనలు ఎలా ఉంటాయి?

ఐపీఎల్​ ఫ్రీ పికప్​ నియమ నిబంధనలు స్పష్టంగా ఉంటాయి. బీసీసీఐ నుంచి రిటెన్షన్​ జాబితా వెలువడే వరకు ఆటగాళ్ళు ఇతర ఫ్రాంచైజీలతో చర్చలు జరపడానికి అనుమతి ఉండదు. కొత్తగా వచ్చిన రెండు ఫ్రాంచైజీలు మెగా వేలానికి ముందు ఒక్కొక్కరు ముగ్గురు ఆటగాళ్ల చొప్పున ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. గత టర్మ్ పంజాబ్ జట్టు కెప్టెన్​గా వ్యవహరించిన కేఎల్​ రాహుల్‌ని ఈసారి లక్నో ఫ్రాంచైజీ పికప్ చేసుకోనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేఎల్​ రాహుల్​ తాను పంజాబ్​ జట్టులో కొనసాగనని చెప్పడం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూర్చింది.

IND vs NZ: కోహ్లీ ఫేట్ మారుతుందా? సెంచరీ చేయక 741 రోజులు.. వాంఖడేలో కోహ్లీకి అద్భుత రికార్డు



 కాగా, రెండు కొత్త జట్ల రాకతో ఈ సారి ఐపీఎల్​ వేలం గమ్మత్తుగా ఉండనుందని ఒక ఫ్రాంఛైజీ సీఈవో చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ “ఎనిమిది ఫ్రాంచైజీలతో, రిటైన్ చేయని ఆటగాళ్లు నేరుగా వేలం పూల్‌కి వెళ్తారు. కానీ ఈసారి రెండు కొత్త జట్లు ఉన్నందున, 8 జట్లలో తాము రిటైన్ కాలేదని తెలిసిన ఆటగాళ్లు తెరవెనుక చర్చలు ప్రారంభించే అవకాశం ఉంది. దాన్ని నిరోధించడం చాలా కష్టం. కొంతమంది ఆటగాళ్లు లక్నో, అహ్మదాబాద్​ ఫ్రాంచైజీలతో అనధికారికంగా ఒప్పందం చేసుకున్నారని నివేదికలు సూచిస్తున్నాయి.” అని చెప్పారు. నిబంధనల ప్రకారం, అనధికారికంగా ఒప్పందం చేసుకున్న ఆటగాళ్లపై మాతృ ఫ్రాంచైజీ ఫిర్యాదు చేస్తే వారిపై బీసీసీఐ చర్యలు తీసుకుంటుంది. అయితే ఇప్పటివరకు ఫ్రాంచైజీల నుంచి ఎటువంటి ఫిర్యాదు రాలేదని క్రికెట్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు.


* ముగ్గురు ఆటగాళ్లను ఫ్రీ పికప్​ చేయడానికి కొత్త ఫ్రాంచైజీలు ఎంత ఖర్చు పెట్టాలి?
వేలానికి ముందు ముగ్గురు ఆటగాళ్లను ఫ్రీ పిక్​ చేసుకునేందుకు కొత్త ఫ్రాంచైజీలు ఒక్కొక్కటి రూ.33 కోట్లు వెచ్చించవచ్చు. మొదటి, ద్వితీయ, తృతీయ ఆటగాళ్లను వరుసగా రూ.15 కోట్లు, రూ.11 కోట్లు, రూ.7 కోట్లతో పికప్​ చేసుకోవచ్చు. ఎవరైనా కొత్త జట్టుకు కెప్టెన్‌గా మారడానికి లైన్‌లో ఉంటే, అతన్ని రూ. 15 కోట్లకు పికప్​ చేసుకోవచ్చని ఫ్రాంచైజీ సీఈఓ చెప్పారు.

ఒక ఫ్రాంచైజీ ముగ్గురు ఆటగాళ్లను ఫ్రీపిక్ చేసుకోవడానికి గరిష్టంగా రూ. 33 కోట్లు మాత్రమే వెచ్చించాలి. ముగ్గురు ఆటగాళ్లకు వరుసగా రూ. 15 కోట్లు, రూ. 11 కోట్లు, రూ. 7 కోట్లు ఖర్చు చేయవచ్చు. ఒక జట్టు రూ. 24 కోట్లతో ఇద్దరు ఆటగాళ్లను పికప్ చేసుకోవచ్చు. ఇద్దరు ఆటగాళ్లకు వరుసగా రూ. 14 కోట్లు, రూ. 10 కోట్లు ఖర్చు చేయవచ్చు. కేవలం ఒక ప్లేయర్ పికప్ కోసం రూ. 14 కోట్లు వెచ్చించాలి.

PKL Season 8 Schedule: ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 8 ఫుల్ షెడ్యూల్.. ఏ మ్యాచ్ ఎప్పుడు? ఎక్కడ ప్రసారం? పూర్తి వివరాలు తెలుసుకోండి.




* రైట్ టు మ్యాచ్ కార్డ్ అంటే?
మునుపటి సీజన్‌లో తమ కోసం ఆడినప్పటికీ.. ఇప్పుడు రిటైన్ కాని ఆటగాడిని తిరిగి కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీకి అనుమతిచ్చేదే రైట్ టు మ్యాచ్ (RTM) కార్డ్. ఫ్రాంచైజీలు రిటెన్షన్, ఆర్​టీఎం ద్వారా గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లను రిటైన్​ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ సారి వేలంలో రైట్ టు మ్యాచ్ కార్డును రద్దు చేశారు.

* ఈ సీజన్​ తర్వాత ధోని రిటైన్ అవుతారా?
ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్​గా కొనసాగుతోన్న మహేంద్ర సింగ్​ ధోనీ.. ఈ సీజన్​ తర్వాత ఐపీఎల్​కు రిటైర్​మెంట్​ ప్రకటిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చెన్నై సూపర్​ కింగ్స్​ ఫ్రాంచైజీ రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీతో పాటు ఎంఎస్​ ధోనీని రిటైన్​ చేసుకుంది. అయితే, సీఎస్​కే జడేజాను ఫస్ రిటైన్​ కింద 16 కోట్లు పెట్టి దక్కించుకుంది. కానీ, కెప్టెన్​ ధోనీని మాత్రం 12 కోట్లకే రిటైన్​ చేసుకుంది. దీన్ని బట్టి ధోనీ కంటే జడేజాకే సీఎస్​కే ఫ్రాంచైజీ ప్రాధాన్యత ఇచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ధోనీ రిటైర్​మెంట్​ ప్రకటిస్తే.. సీఎస్​కే కెప్టెన్సీ పగ్గాలు జడేజాకు దక్కనున్నాయని స్ఫష్టమవుతోంది.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:

Tags: Bcci, Explained, IPL 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు