Bitcoin: బిట్ కాయిన్‌లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా..జస్ట్ రూ.500 ఉంటే చాలా..?

(ప్రతీకాత్మక చిత్రం)

డిజిటల్ కరెన్సీలను సాధారణంగా కేంద్రం జారీ చేసి వాటిని తమ దేశం, ప్రాంతాల్లో కొన్ని సంస్థలకే అందుబాటులో ఉండేలా సరఫరా చేస్తుంది. అయితే, వీటికి భిన్నంగా క్రిప్టోకరెన్సీ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో ఈ మధ్య క్రిప్టోకరెన్సీ హాట్ టాపిక్ గా నిలిచిపోయింది.

 • Share this:
  ఒకప్పుడు ఏ ఇద్దరు కలిసినా స్థిరాస్తి, షేర్లు, బంగారం వంటి పెట్టుబడులపై చర్చ జరిగేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఇద్దరు కలిసినా క్రిప్టోకరెన్సీ(Cryptocurrencies) లపైనే చర్చిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే బిట్కాయిన్ల(Bitcoin) గురించి ఎక్కువగా చర్చించుకున్నారు. ఎందుకంటే, బంగారాన్ని సైతం వెనక్కు నెట్టి బిట్కాయిన్ శరవేగంగా దూసుకుపోతూ వార్తల్లోకి ఎక్కింది. 2007లో ప్రారంభమైన బిట్‌కాయిన్ ప్రస్థానం అనేక హెచ్చుతగ్గులకు లోనై అంతిమంగా దీని విలువ పెంచుకుంటూ వస్తోంది. కాగా, 2017 డిసెంబర్లో మొదటిసారి రికార్డు స్థాయి 19,850 డాలర్లను తాకిన బిట్ కాయిన్ విలువ, 2018లో 4,000 డాలర్లకు పడిపోయింది. ఆ తర్వాత మళ్లీ పుంజుకొని మునుపటి స్థానానికి చేరుకుంది. ప్రస్తుత, కరోనా ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా పెట్టుబడిదారుల ఆలోచనలు మారడంతో బిట్కాయిన్లో పెట్టుబడి(investment) పెట్టే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో 2020లో దీని విలువ 170% మేర పెరిగింది. ప్రస్తుతం బిట్ కాయిన్ విలువ 2021 ఏప్రిలో 56,267 డాలర్ల వద్ద ఉంది. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు 43 లక్షల రూపాయలు, ఈ నేపథ్యంలో అసలు, బిట్ కాయిన్ అంటే ఏమిటి? దీని చట్టబద్దత ఉందా? దీన్ని ఎలా కొనాలి వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకోండి.

  బిట్‌కాయిన్‌ కొనుగోలుకు ముందు తెలుసుకోవలసిన 5 అంశాలు

  1. చట్టబద్ధత ఉందా?

  డిజిటల్ కరెన్సీలో క్రిప్టొకరెన్సీ ఒక భాగమని చెప్పవచ్చు. డిజిటల్ కరెన్సీలను సాధారణంగా కేంద్రం జారీ చేసి వాటిని తమ దేశం, ప్రాంతాల్లో కొన్ని సంస్థలకే అందుబాటులో ఉండేలా సరఫరా చేస్తుంది. అయితే, వీటికి భిన్నంగా క్రిప్టోకరెన్సీ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో ఈ మధ్య క్రిప్టోకరెన్సీ హాట్ టాపిక్ గా నిలిచిపోయింది. భారతదేశంలో బిట్‌కాయిన్లు, ఇతర క్రిప్టోకరెన్సీలను కొనుగోలు చేయడం చట్టబద్దమే(Legality) అయినప్పటికీ, ఇటీవల సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పు మేరకు క్రిప్టోకరెన్సీల వ్యవహారాలపై ఆర్‌బిఐ(RBI) నిషేధించింది. దీంతో దేశంలో క్రిప్టోకరెన్సీల వాడకాన్ని నిషేధించే చట్టాన్ని ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది.

  2. ఎలా కొనాలి?

  భారతదేశంలో బిట్‌కాయిన్లు, ఇతర క్రిప్టోకరెన్సీలను కొనడానికి అనేక మార్గాలు ఉన్నాయి. దీనికి యాప్స్, వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. జెబ్‌పే(Zebpay), యునోకాయిన్(UnoCoin), కాయిన్‌సెక్యూర్(CoinSecure) వంటి అనేక యాప్ల ద్వారా బిట్‌కాయిన్‌లను కొనుగోలు చేయవచ్చు. NEFT, RTGS, డెబిట్/ క్రెడిట్ కార్డ్ల ద్వారా చెల్లింపులు చేసి బిట్కాయిన్లను కొనుగోలు చేయవచ్చు. ఈ కంపెనీలు క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలుగా పనిచేస్తాయి. పైన పేర్కొన్న యాప్ల ద్వారా కొనుగోలు చేయడమే కాకుండా, బిట్కాయిన్లను అమ్మవచ్చు. ఇటీవల ప్రముఖ పేమెంట్ ఇంటర్ఫేస్ ‘పేపాల్’ కూడా బిట్కాయిన్లతో చెల్లింపులకు అనుమతిచ్చింది. ఇదే ధోరణిలో మిగతా ఆన్లైన్ వాలెట్లు కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో బిట్కాయిన్ విలువ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  3. రూ.500లతో పెట్టుబడి ప్రారంభించవచ్చు

  ఒకే వ్యక్తి లక్షలు వెచ్చించి బిట్కాయిన్ను కొనడం(purchase) సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే సగటు వ్యక్తికి ఇది చాలా ఖరీదైన వ్యవహారం. అందువల్ల, భారతదేశంలో క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలు బిట్‌కాయిన్‌లో కొంత భాగాన్ని కొనుగోలు చేయడానికి అనుమతిస్తున్నాయి. కేవలం రూ. 500లతో బిట్కాయిన్లో పెట్టుబడి ప్రారంభించవచ్చు.

  4. ఏఏ డాక్యుమెంట్స్ కావాలి

  ఎక్స్ఛేంజీలు / యాప్లను ఉపయోగించి బిట్కాయిన్ కొనుగోలు చేయడమే కాకుండా, వీటిని నిల్వ చేయవచ్చు. అయితే, దీని కొనుగోలు సమయంలో KYC (నో యువర్ కస్టమర్) ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ అకౌంట్ ధృవీకరణ కోసం మీ అడ్రస్ ప్రూఫ్, పాన్(PAN), బ్యాంక్ ఖాతా వివరాలను పొందుపర్చాలి.

  5. పన్ను వర్తిస్తుంది

  బిట్‌కాయిన్ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంపై స్వల్పకాలిక పెట్టుబడులకు 30%, దీర్ఘకాలిక (కనీసం 3 సంవత్సరాలు) పెట్టుబడిదారులకు 20% పన్ను (Tax) విధించబడుతుంది.
  Published by:Krishna Adithya
  First published: