Explained: మణిపూర్ రాష్ట్రానికి వేర్పాటువాదులతో ముప్పు ఎంత..? కేంద్ర ప్రభుత్వ చర్యలు ఏ మేరకు ఫలిస్తాయి..?
ప్రతీకాత్మక చిత్రం
మణిపూర్ శాసనసభ ఎన్నికల్లో గెలిచి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అధికార బీజేపీ చెబుతోంది. ఫిబ్రవరి 14వ తేదీన మణిపూర్(Manipur)లోని ఇంపాల్(Imphal) పడమర ప్రాంతంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేపట్టారు.
మణిపూర్(Manipur) శాసనసభ ఎన్నికల్లో గెలిచి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అధికార బీజేపీ చెబుతోంది. ఫిబ్రవరి 14వ తేదీన మణిపూర్(Manipur)లోని ఇంపాల్(Imphal) పడమర ప్రాంతంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘మణిపూర్‌లో ఉన్న వేర్పాటువాదులు హింస(Violence)ను పక్కనపెట్టాలి. కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలి. మణిపూర్‌లో శాంతిని నెలకొల్పేందుకు సహకరించాలి. మణిపూర్ అభివృద్ధికి వేర్పాటువాదుల చర్యలు, ఆశయాలు అడ్డుగా ఉండకూడదు. ఇక్కడి నిరుద్యోగ సమస్యలను, పేదరికాన్ని, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకొంటున్నాం.’ అని పిలుపునిచ్చారు.
మణిపూర్‌లో వేర్పాటువాదానికి కారణం ఏంటి?
1964లో మణిపూర్‌లో ఉగ్రసంస్థల కార్యకలాపాలు మొదలయ్యాయి. యునైటడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్(UNLF-United National Liberation Front) అనే ఉగ్రసంస్థ అప్పుడే పురుడుపోసుకొంది. ఇప్పటికే యూఎన్ఎల్ఎఫ్ మణిపూర్ రాష్ట్రంలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. 1949 అక్టోబరు 15వ తేదీన మణిపూర్ ఇండియాలో విలీనమైంది. 1972 తర్వాతనే మణిపూర్‌ను రాష్ట్రంగా ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్క మణిపూర్‌లోనే అత్యధిక ఉగ్రసంస్థలు పని చేస్తున్నాయి. చిన్న రాష్ట్రమైన మణిపూర్‌లో మెయ్‌తెయ్, ఇతర ఆదివాసీ తెగల మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు నేటికీ కొనసాగుతున్నాయి. ఆధిపత్య మెయ్‌తెయ్ తెగలో అత్యధికులు సనమహిజం, హిందూ మతాలను అనుసరిస్తారు. స్వల్ప సంఖ్యలో ముస్లింలు(పంగల్), క్రైస్తవులు ఉన్నారు.
ఇండియాలో మణిపూర్‌ను విలీనం చేయడాన్ని మెయ్‌తెయ్ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అదే వేర్పాటు వాదానికి బీజం వేసింది. సమరేంద్ర సింగ్ నేతృత్వంలో యునైటడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్(యూఎన్ఎల్ఎఫ్) ఏర్పాటైంది. మణిపూర్ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత గుర్తింపు కోల్పోతామన్న ఆందోళన మెయ్‌తెయ్ తెగలో పెరిగింది. ఆ తర్వాత కాలంలో వరుసగా చాలానే ఉగ్ర సంస్థలు పుట్టుకొచ్చాయి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA), పీపుల్స్ రెవల్యూషనరీ పార్టీ ఆఫ్ కంగ్లైపాక్(PREPAK), కంగ్లైపాక్ కమ్యూనిస్టు పార్టీ(KCP), కంగ్లై యావోల్ కన్నా లుప్(KYKL) కూడా వాటిల్లో భాగమే. ఈ సంస్థలన్నీ మణిపూర్‌కు స్వాతంత్ర్యం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి.
నాగాల్యాండ్‌లో మొదలైన నాగా మూవ్మెంట్ మణిపూర్‌లోని పర్వత ప్రాంత జిల్లాలకు వ్యాపించింది. ఆ ప్రాంతాల్లో NSCN-IM అనే ఉగ్రసంస్థ కదలికలు ఎక్కువగా ఉంటాయి. మణిపూర్ పర్వత ప్రాంతాలను కలిపి నాగాలిమ్(గ్రేటర్ నాగాల్యాండ్) ప్రకటించాలని ఆ సంస్థ కోరుతోంది. పర్వత ప్రాంతాల్లో జీవిస్తున్న ఎక్కువ మంది ప్రజలు దీన్ని మణిపూర్ సమగ్రతకు ముప్పుగా భావిస్తున్నారు.
ఇటీవల కాలంలో మణిపూర్‌లో సైనికులపై ఉగ్ర సంస్థల దాడులు తరచూ చోటుచేసుకొంటున్నాయి. తరచూ భద్రతా దళాలపై దాడులకు తెగబడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో అక్కడి వేర్పాటువాదులతో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు కొంత మేరకు ఫలిస్తున్నాయి. క్రమంగా వేర్పాటువాదుల సంఖ్య తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చర్చలకు పిలుపునిచ్చారు. మణిపూర్‌లో శాంతిని నెలకొల్పాలనే ఉద్దేశాన్ని ఆయన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బయటపెట్టారు. కేంద్రం చర్యలు ఇకపై మణిపూర్‌లో ఉగ్రసంస్థల కదలికలను, చర్యలను ఏమేరకు నియంత్రిస్తుందో చూడాలి.
మణిపూర్ రాష్ట్రంలో 89 శాతం భూభాగానికి కేవలం 20 మంది శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 11 శాతంగా ఉన్న పర్వత ప్రాంతాలకు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది ఇతర తెగల్లో అసంతృప్తికి కారణమైంది. ఇంపాల్ పర్వత లోయల్లో మెయ్‌తెయ్ ఆధిప్యతం కనిపిస్తుంది. చుట్టు పక్కల పర్వత ప్రాంతాల్లో నాగా, కూకీ, ఆదివాసీ తెగల ప్రజలు ఎక్కువగా ఉన్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.