Stars Counted: చుక్కలు లెక్కించడానికి ఓ రాకెట్‌ బయలుదేరుతోంది. అదెలా పని చేస్తుందంటే?

(image credit - NASA)

విశ్వంలో చుక్కలు లెక్కించడానికి నాసాకి చెందిన ఓ రాకెట్‌ అమెరికాలోని న్యూ మెక్సికోలో త్వరలో బయలుదేరనుంది. చుక్కలు లెక్కించడానికి శాస్త్రవేత్తలు సిద్ధం చేసిన సైబర్‌ -2 అనే ఇన్‌స్ట్రుమెంట్‌ అందులోనే విశ్వంలోకి ప్రయాణించనుంది.

  • Share this:
రాత్రివేళ ఆకాశంలో చూస్తే... చందమామ, చుక్కలు కనిపిస్తాయి. చంద్రుడు సోలో కాబట్టి... పక్కనపెట్టేద్దాం కాసేపు. మరి చుక్కల సంగతేంటి. కనుచూపుమేర చూస్తే ఆకాశంలో చుక్కలు కనిపిస్తూనే ఉంటాయి. అసలు చుక్కలు ఎన్ని ఉన్నాయి? ఈ డౌట్‌ మీకు చాలాసార్లు వచ్చి ఉంటుంది. అయితే దీనికి సరైన సమాధానం ఎవరి దగ్గరా లేదు. శాస్త్రవేత్తలు గతంలో ఒకసారి ఒక్కో గెలాక్సీలో 100 మిలియన్ల చుక్కలు ఉంటాయని చెప్పారు. అయితే ఇప్పుడు మరోసారి లెక్కించడానికి సిద్ధమవుతున్నారు. దాని కోసం ఓ రాకెట్‌ను కూడా స్పేస్‌లోకి పంపిస్తున్నారు. అసలు అదేంటి... ఎలా కౌంట్‌ చేస్తుందో చూద్దాం!

విశ్వంలో చుక్కలు లెక్కించడానికి నాసాకి చెందిన ఓ రాకెట్‌ అమెరికాలోని న్యూ మెక్సికోలో త్వరలో బయలుదేరనుంది. చుక్కలు లెక్కించడానికి శాస్త్రవేత్తలు సిద్ధం చేసిన సైబర్‌ -2 అనే ఇన్‌స్ట్రుమెంట్‌ అందులోనే విశ్వంలోకి ప్రయాణించనుంది. గతంలోనూ నాసా ఇలాంటి ప్రయత్నం చేసింది. అప్పుడు లెక్కించిన దానికి అప్‌డేషన్‌ కోసం ఇప్పుడు మరోమారు ప్రయత్నం చేస్తోంది. గతంలో తీసిన లెక్కల ప్రకారం ఒక్కో గెలాక్సీలో 100 మిలియన్ల చుక్కలు ఉన్నాయి. నాసా ప్రకారం విశ్వంలో ఉన్న రెండు ట్రిలియన్‌ గెలాక్సీలు ఉన్నాయి. అంటే వంద క్వింటిలియన్ చుక్కలు ఉన్నట్లు.

గతంలో చుక్కల్ని లెక్కించినప్పుడు అవన్నీ గెలాక్సీలో ఉన్నట్లుగా భావించి ప్రక్రియ పూర్తి చేశారు. అయితే గెలాక్సీ బయట కూడా కొన్ని చుక్కలు ఉన్నాయని.. వాటి సంగతేంటి సైబర్‌ 2 ఇన్‌స్ట్రుమెంట్‌ లెక్కిస్తుందని చెబుతున్నారు. అయితే యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) మాత్రం పాలపుంతలో 100 వేల మిలియన్ల చుక్కలు ఉన్నాయని చెబుతోంది. ఆ లెక్కన గెలాక్సీలో 1011 నుండి 1012 చుక్కలు ఉన్నాయట. మొత్తంగా విశ్వంలో 1022 నుండి 1024 చుక్కలు ఉంటాయని చెబుతున్నారు.

ఇక సైబర్‌ 2 సంగతి చూస్తే... ఈ ఇన్‌స్ట్రుమెంట్‌ భూ వాతావరణం నుండి దాటగానే పని మొదలుపెడుతుంది. గెలాక్సీల క్లస్టర్లు ఉన్న ప్యాచ్‌ను సర్వే చేస్తుంది. సైబర్‌ 2 ఇన్‌స్ట్రుమెంట్‌ నేరుగా చుక్కల్ని లెక్కించదట. గెలాక్సీలోని ఎక్స్‌ట్రా గేలటిక్‌ బ్యాగ్రౌండ్‌ లైట్‌ను గుర్తిస్తుందట. అందులో చుక్కల నుండి వచ్చే కాస్మిక్‌ ఇన్‌ఫ్రారెడ్‌ బ్యాగ్రౌండ్‌పై సైబర్‌ 2 ఇన్‌స్ట్రుమెంట్ ‌ఫోకస్‌ చేస్తుందట. ఆ బ్యాగ్రౌండ్‌ లైట్‌ ఎంత బ్రైట్‌గా ఉందనేది గుర్తించి... దాని ఆధారంగా అక్కడ ఎన్ని చుక్కలు ఉన్నాయనేది గుర్తిస్తారట. గతంలో ఈఎస్‌ఏ కూడా గెలాక్సీలను ఇలానే గుర్తించిన విషయం తెలిసిందే. ఇదీ చుక్కల్ని లెక్కించే సైబర్‌ 2 కథ. చూద్దాం ఎన్ని కొత్త చుక్కలు యాడ్‌ అవుతాయో.
Published by:Krishna Adithya
First published: