Home /News /explained /

HORSE SHOE CRAB BLOOD COSTS RS 12 LAKHS FOR JUST ONE LITRES WHERE IT S USING AND WHAT IS ITS SPECIALTY SK

Crab blood: ఒక్క లీటర్‌కు రూ.12 లక్షలు..ఆ పీత రక్తానికి ఎందుకింత రేటు? దానితో ఏం చేస్తారు..?

హార్స్ షూ పీత

హార్స్ షూ పీత

Horseshoe crab blood: మన శరీరంలోకి పంపించే టీకా , నరాల ద్వారా ఎక్కించే మందులు, శరీరంలో‌కి అమర్చే ఇంప్లాంటెడ్ పరికరాల తయారీ సమయంలో ఏదైనా కల్తీ జరిగిందా? వాటిలో బ్యాక్టీరియా ఉందా? అనేది ఈ పీత రక్తం ద్వారానే తెలుస్తుంది.

  మనలో పీతలంటే (Crabs) చాలా మందికి ఇష్టం. పీతల ఇగురును లొట్టలేసుకొని మరీ లాగిస్తారు. మరి ఈ పీతల ధర ఎంత ఉంటుంది? రూ.400 నుంచి 600 మధ్య ఉంటుంది. మహా అయితే రూ.1000..! అంతకు మించి ఉండదు. కానీ ఇక్కడున్న పీతలు మాత్రం చాలా ఖరీదైనవి. లక్షల్లో ధర పలుకుతాయి. అవే హార్స్ షూ పీతలు (Horseshoe crabs)..! పీతల్లో చాలా రకాలున్నాయి. అందులో ఇది కూడా ఒకటి. ఈ పీతలను మాంసం కోసం వినియోగించరు. అందులో ఉండే రక్తాన్ని సేకరిస్తారు. ఈ రక్తం లీటర్ ధర ఎంత ఉంటుందో తెలుసా..? 16వేల డాలర్ల కంటే ఎక్కువ. అంటే మన కరెన్సీలో ఇంచు మించు రూ.12 లక్షలు (crab blood cost). ఏంటి లీటర్ పీత రక్తానికి అన్ని లక్షలా? అని ఆశ్చర్యపోవద్దు. అసలు ఆ పీత రక్తం ప్రత్యేకత ఏంటి? దానిని ఎక్కడ వాడుతారో తెలుసుకుందాం.

  Allie Rae: కరోనా టైమ్‌లో నర్సు జాబ్ పోయింది.. ఇప్పుడు నెలకు కోటికి పైగా ఆదాయం..

  హార్స్ షూ పీతలు (Horseshoe crab) సాధారణ పీతలతో పోల్చితే విచిత్రంగా ఉంటాయి. తాబేలుకు ఉన్నట్లుగా డొప్పలాంటి తలభాగం, దానిపై కళ్లు, పదునైన ముళ్లు, డొప్ప మధ్యలో వేలాడుతున్నట్లుగా శరీరం.. అందులో నుంచి బయటకు వచ్చిన ఓ తోక.. ఇదీ హార్స్ షూ పీతల రూపం. ఇవి ప్రపంచంలోనే మనుగడలో ఉన్న అతి పురాతన జీవులు. దాదాపు 45 కోట్ల సంవత్సరాల నుంచి భూమిపై ఉన్నట్లు అంచనా. ఈ హార్స్ షూ పీతలు ఇండియన్, అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాల్లో కనిపిస్తాయి. వైద్య సేవల్లో ఈ పీత రక్తాన్ని వినియోగిస్తారు. మన శరీరంలోకి పంపించే టీకా , నరాల ద్వారా ఎక్కించే మందులు, శరీరంలో‌కి అమర్చే ఇంప్లాంటెడ్ పరికరాల తయారీ సమయంలో ఏదైనా కల్తీ జరిగిందా? వాటిలో బ్యాక్టీరియా ఉందా? అనేది దీని ద్వారానే తెలుస్తుంది. 1960వ దశకంలో శాస్త్రవేత్తలు దీని ప్రత్యేకతను గుర్తించారు. అప్పటి నుంచీ వ్యాక్సిన్లు, ఇతర ఇంజెక్షన్లు, సర్జికల్‌ ఇంప్లాంట్లు వంటివి బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులతో కలుషితం కాలేదని నిర్ధారించుకునేందుకు పీతల రక్తాన్ని వాడడం మొదలుపెట్టారు.

  ఫుట్‌బాల్ టీమ్‌ నుంచి గెంటేశారు.. కానీ ఇప్పుడు నగ్న వీడియోలతో కోట్లల్లో ఆదాయం

  సముద్రం, తీర ప్రాంతాల నుంచి హార్స్‌షూ పీతలను సేకరించి.. ల్యాబ్‌కు తీసుకొస్తారు. వాటి బరువును తూచి..రక్తం సరిపడా ఉన్నవాటిని మాత్రమే తీసుకుంటారు.ఆ పీతలను శుభ్రం చేసి.. గుండెకు సమీపంలోని రక్తనాళానికి సూదులుగుచ్చి రక్తం సేకరిస్తారు. సగానికి పైగా రక్తాన్ని తీసిన తర్వాత వాటిని మళ్లీ సముద్రంలోనే వదిలిపెడతారు. ఐతే ఇలా రక్తం తీసిన పీతల్లో మూడో వంతు మరణిస్తుంటాయి.

  పీతల రక్తం నీలం రంగులో ఉంటుంది. రక్తంలో ఉండే రాగి ఖనిజం వల్ల అది నీలం రంగుని కలిగి ఉంటుంది. మానవ రక్తంలో ఇనుము ఉండడం వల్ల అది ఎర్రగా కనిపిస్తుంది. పీతల రక్తంలో రాగితో పాటు బాక్టీరియాని గడ్డ కట్టించగలిగే ఒక ప్రత్యేక రసాయనం ఉంటుంది. ఇది ఎలాంటి బ్యాక్టీరియాను అయినా క్షణాల్లో పసిగట్టుతుంది. అమెరికన్ జీవ జాతుల్లో లిములుస్ ఎమ్బో కైట్ లైసెట్ (LAS), ఆసియన్ జీవ జాతులతో ఎమ్బో కైట్ లైసెట్ ఉంటుంది. వైద్యపరికరాలు, వ్యాక్సిన్లు, మందుల్లో బ్యాక్టీరియా ఉందో లేదో ఇవి గుర్తిస్తాయి.

  (Image: greenqueen.com)


  సాధారణంగా వ్యాక్సిన్లు, ఇంజెక్షన్లు, ఇతర మందుల్లో బ్యాక్టీరియా ఉంటే.. అలాంటి వాటిని మనుషులకు ఎక్కిస్తే.. చాలా ప్రమాదం. అలాగే బ్యాక్టీరియా ఉన్న వైద్య పరికరాలను వాడినా ఆ రోగి ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే వాటిలో బ్యాక్టీరియా ఉందో లేదో తెలుసుకునేందుకు పీత రక్తం ఉపయోగపడుతుంది. పీత రక్తకణాలను వేరుచేసి ‘LAL (లిమ్యులస్‌ అమిబోసైట్‌ లైసేట్‌)ను ఉత్పత్తి చేస్తారు. వ్యాక్సిన్లు, యాంటీ బయాటిక్స్, ఇతర ఇంజెక్షన్లు, ఔషధాలలో ప్రతి బ్యాచ్‌ను దీనితో పరీక్షిస్తారు. వాటిలో ప్రమాదకర బ్యాక్టీరియా ఏ మాత్రం ఉన్నా ఎల్ఏఎల్ గుర్తిస్తుంది. బ్యాక్టీరియా ఉన్న ఆ టీకా లేదా ఔషధాన్ని పడేస్తారు. లేదంటే శుద్ధిచేసి తిరిగి ఉపయోగిస్తారు. అంతేకాదు శరీరం లోపల అమర్చే స్టెంట్లు, పేస్‌మేకర్లు, ఇతర ఇంప్లాంట్లు, సర్జికల్‌ పరికరాలను కూడా ఎల్‌ఏఎల్‌తో పరీక్షిస్తారు. వాటిపై బ్యాక్టీరియా లేదని నిర్ధారించుకున్న తర్వాతే అమర్చుతారు.

  మసాజ్ కోసం వెళ్లి బట్టలు విప్పాడు..అమ్మాయి చేయి తగలగానే చనిపోయాడు.. ఏం జరిగింది?

  ప్రపంచంలో ప్రస్తుతం 4 రకాల హార్స్ షూ పీతల జాతులు మనుగడలో ఉన్నాయి. LAL పరీక్షల కోసం హార్స్ షూ పీతలను ఎక్కువ వాడుతుండడంతో.. వాటి జాతి అంతరించిపోతోంది. బయో- మెడికల్ అవసరాల కోసం వీటిని అత్యధికంగా వేటాడటంతో పాటు పెద్ద చేపల తాకిడి, ఆవాసాల కొరత, నీటి కాలుష్యం కారణంగా హార్స్ షూ పీతల సంతతికి ముప్పుపొంచి ఉంది. గత 40 ఏళ్లలో ఈ పీతల సంతతి ఏకంగా 80 శాతం మేర అంతరించి పోయిందని అంచనా. ఒక్క అమెరికా తూర్పు తీరప్రాంతంలోనే ఏటా 5 లక్షలకుపైగా హార్స్‌షూ పీతలను సేకరిస్తున్నారు. మెక్సికో, చైనా, మరికొన్ని దేశాల్లోనూ భారీ ఎత్తున వేటాడుతున్నారు. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్లతో ఈ పీతల సేకరణ మరింతగా పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా భారీగా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తుండటంతో.. వాటిని పరీక్షించేందుకు హార్స్ షూ పీతల రక్తాన్ని వాడుతున్నారు. ఇందుకోసం సముద్రాల్లో వీటిని పెద్ద ఎత్తున వేటాడుతున్నారు.

  కిమ్ మూత్రంలో అంత సీక్రెట్ ఏముంది? టాయిలెట్ కుండీకి భారీగా సెక్యూరిటీ ఎందుకు?

  వీటిని చంపకుండా ప్రత్నామ్నాయాల వైపు అడుగులు వేయాలని ఈ పీతల సంరక్షులు కోరుతున్నారు. వైద్య పరికరాల పై హానికారక పదార్ధాలని గుర్తించేందుకు సింథటిక్ పద్ధతులని అవలంబించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ సింథటిక్ పద్ధతులు కేవలం పైకి కనిపించే హానికారకాలను మాత్రమే గుర్తించగలవని.. పీతల రక్తంతోనే మెరుగైన ఫలితాలు వస్తున్నాయని చెబుతున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Corona Vaccine, Covid vaccine

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు