HOME LOAN RATE OF INTEREST ELIGIBILITY CALCULATOR FEE AND CHARGES ALL YOU NEED TO KNOW BA
Home Loan: హోమ్ లోన్ కావాలంటే ఇన్ని రకాల ఫీజులు, చార్జీలు కట్టాలి.. అవేంటో చూడండి
ప్రతీకాత్మక చిత్రం
Home Loan fee and charges | హోమ్ లోన్ తీసుకునేటప్పుడు రకరకాల చార్జీలు ఉంటాయి. అవి చాలా మందికి తెలియవు. అవేంటో మీరు తెలుసుకోండి. హోమ్ లోన్ అప్లై చేసే ముందే అవగాహన పెంచుకుంటే లోన్ దరఖాస్తు చేసేటప్పుడు సమస్య ఉండదు.
సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి చాలా మంది గృహ రుణం (Home Loan) తీసుకుంటారు. ఇలా తీసుకున్న లోన్‌ను EMIల (Home Loan EMI Calculator) రూపంలో తిరిగి చెల్లిస్తారు. అయితే వడ్డీ రేటు (Home Loan Interest Rate), లోన్ మొత్తానికి అదనంగా రుణ గ్రహీతలు అనేక రుసుములు, ఛార్జీలను (Home Loan Charges and Fee) కూడా చెల్లించాల్సి ఉంటుంది. గృహ రుణాలపై వసూలు చేసే అతి ముఖ్యమైన, స్పష్టమైన రుసుము ప్రాసెసింగ్ ఫీజు (Home Loan Processing Fee) . హోమ్ లోన్ దరఖాస్తుతో పాటు బ్యాంకులు లేదా NBFCలకు ఈ ఫీజు చెల్లించాలి. లోన్ పొందడానికి ముందే ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అంటే లోన్ మొత్తం నుంచి తీసివేయడానికి బదులుగా సొంతంగా దరఖాస్తుదారులు బ్యాంక్/NBFCలకు చెల్లించాలి. కొన్ని బ్యాంకులు దీనిని అడ్మినిస్ట్రేటివ్ ఫీజుగా వసూలు చేస్తాయి. సాధారణంగా దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తారు.
చాలా బ్యాంకులు తమ హోమ్ లోన్ స్కీమ్స్‌పై ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తాయి. అయితే కొన్ని ఆర్థిక సంస్థలు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేయవు. కొన్ని బ్యాంకులు వేతనాలు పొందే వ్యక్తులు, స్వయం ఉపాధి నిపుణులు (SEP), స్వయం ఉపాధి పొందే నాన్-ప్రొఫెషనల్ (SENP) వ్యక్తుల కోసం ప్రత్యేక ఛార్జీలను సైతం వసూలు చేయవచ్చు.
గృహ రుణాలపై విధించే వివిధ రకాల ఫీజులు, ఛార్జీలు
ప్రాసెసింగ్ ఫీజులతో పాటు రుణ గ్రహీతలు అనేక ఇతర ఫీజులు/ఛార్జీలు/పెనాల్టీలు చెల్లించాల్సి ఉంటుంది. హోమ్ లోన్ కోసం అప్లై చేసే ముందే వీటి గురించి తెలుసుకోవాలి. హోమ్ లోన్ కోసం చెల్లించే ఫీజులను ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.
గృహ రుణాలపై విధించే వివిధ రకాల ఫీజులు, ఛార్జీలు
1. రుణ సంబంధిత రుసుములు (Loan-related Fees)
2. పత్రాలకు సంబంధించిన రుసుములు (Document-related Fees)
3. చట్టపరమైన, ప్రభుత్వ రుసుములు (Legal and Government Fees)
ఈ మూడు విభాగాల్లో ఎలాంటి ఫీజులు ఉంటాయో తెలుసుకుందాం. దాదాపు అన్ని ఛార్జీలపై GST అదనంగా చెల్లించాల్సి రావచ్చు.
రుణ సంబంధిత రుసుములు
లాగిన్ ఫీజు:
దీన్ని అడ్మినిస్ట్రేటివ్ ఫీజు లేదా దరఖాస్తు రుసుము అని కూడా పిలుస్తారు. లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, లోన్ ఆమోదం పొందడానికి ముందే నిర్దిష్ట బ్యాంకులు ఈ నాన్-రిఫండబుల్ ఫీజు వసూలు చేస్తాయి. ఇది రూ.2,500 నుంచి రూ.6,500 వరకు ఉంటుంది. మీ లోన్ ఆమోదం పొందితే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. అయితే ప్రాసెసింగ్ ఫీజు నుంచి ముందుగా వసూలు చేసిన లాగిన్ ఫీజును మినహాయిస్తారు.
ప్రీపేమెంట్ ఛార్జీ:
దీన్ని ఫోర్క్లోజర్ ఛార్జీ, ప్రీక్లోజర్ ఛార్జీ అని కూడా పిలుస్తారు. గడువుకు ముందే హోమ్ లోన్‌ను పూర్తిగా తిరిగి చెల్లించినప్పుడు ఈ రుసుము వర్తిస్తుంది. చాలా బ్యాంకులు ఫ్లోటింగ్ రేట్ లోన్లకు, వ్యక్తిగత రుణగ్రహీతలకు ఈ ఛార్జీలు వసూలు చేయవు. సాధారణంగా ఈ రుసుము బకాయి మొత్తంలో 2% నుంచి 6% వరకు ఉంటుంది.
పాక్షిక ముందస్తు చెల్లింపు రుసుము (Partial Prepayment Charge):
దీన్ని పార్ట్-పేమెంట్ ఛార్జీ లేదా పార్ట్ ప్రీపేమెంట్ ఫీజు అని కూడా పిలుస్తారు. లోన్ బ్యాలెన్స్ మొత్తంలో కొంత భాగాన్ని పూర్తిగా చెల్లించని సందర్భంలో ఈ ఫీజు వర్తిస్తుంది. ఈ రుసుము బ్యాలెన్స్ లోన్ మొత్తంలో 0.5% నుంచి 2% వరకు ఉంటుంది. ఈ ఫీజు వసూలు చేసే బ్యాంకులకు ఎక్కువ సార్లు పాక్షిక చెల్లింపులు చేస్తే, చాలా ఎక్కువ మొత్తం అదనపు రుసుముగా చెల్లించే అవకాశం ఉంటుంది.
ఆలస్య చెల్లింపు రుసుము (Late Payment Fee):
దీన్ని పీనల్ వడ్డీ రేటు అని కూడా పిలుస్తారు. లోన్ EMIల చెల్లింపులను ఆలస్యం చేస్తే, ఈ రుసుమును బ్యాంకులు వసూలు చేస్తాయి. సాధారణంగా ఈ రుసుము.. చెల్లింపు జరిగే వరకు ప్రతి నెలా ఆలస్యం/డిఫాల్ట్ చేసిన మొత్తంలో 2% నుంచి 3% వరకు ఉంటుంది.
కన్వర్షన్ ఛార్జీ: (Home Loan Conversion Charges)
దీన్ని స్విచింగ్ ఫీజు అని కూడా పిలుస్తారు. మీ ఫ్లోటింగ్-రేట్ ప్యాకేజీని ఫిక్స్డ్-రేటుకు మార్చాలనుకున్నా.. లేదా ఫిక్స్డ్ రేటు నుంచి ఫ్లోటింగ్ రేటుకు మారాలనుకున్నా.. లేదా ఇప్పటికే ఉన్న ఫ్లోటింగ్ రేట్ నుంచి సవరించిన ధరకు మార్చాలనుకున్నా.. ఈ రుసుము వర్తిస్తుంది. ఈ రుసుము బ్యాలెన్స్ మొత్తంలో 0.25% నుంచి 3% వరకు ఉండవచ్చు.
రీపేమెంట్ మోడ్ స్వాప్ ఛార్జీ: (repayment mode swap charges)
మీరు రీపేమెంట్ పద్ధతి లేదా తేదీలను మార్చాలనుకుంటే ఈ రుసుము చెల్లించాలి. సాధారణంగా ఈ ఫీజు ఒక్కో రిక్వెస్ట్‌కు రూ.500 వరకు ఉంటుంది.
రికవరీ ఛార్జీ: (Recovery Charges)
EMIలను చెల్లించకుంటే, మీ అకౌంట్ డిఫాల్ట్‌గా మారితే, బ్యాంక్/రుణదాత మీపై ఏదైనా చర్య తీసుకుంటే.. ఈ రుసుము వర్తిస్తుంది.
ఇన్సూరెన్స్ ప్రీమియం: (Home Loan Insurance Premium)
హౌసింగ్ లోన్‌తో పాటు గృహ లేదా జీవిత బీమా పాలసీని కొనుగోలు చేయడం తప్పనిసరి కాదు. అయినా కూడా చాలా బ్యాంకులు ఆస్తి నష్టానికి భరోసా కోసం బీమా తీసుకోవాలని పట్టుబడుతున్నాయి.
2. డాక్యుమెంట్ సంబంధిత ఛార్జీలు
స్టాంప్ డ్యూటీ: (Stamp Duty)
స్టాంప్ పేపర్ వంటి లీగల్ డాక్యుమెంట్లను సిద్ధం చేయడానికి ఈ రుసుము చెల్లించాలి.
క్రెడిట్ రిపోర్ట్ ఫీజు: (Credit Report Fee)
హోమ్ లోన్ కోసం అప్లై చేసే ముందు మీ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేయడం, మీ క్రెడిట్ రిపోర్ట్‌ను పరిశీలించడం కీలకం. క్రెడిట్ బ్యూరో నుంచి మీ క్రెడిట్ రిపోర్టును పొందడానికి ఈ రుసుమును చెల్లించాలి.
ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ఛార్జీ: (Income Tax Certificate Charges)
హోమ్ లోన్ కోసం మీ ఆదాయ పన్ను ధ్రువీకరణ పత్రాన్ని రుణదాతకు చూపించాల్సి ఉంటుంది. దీన్ని కొనుగోలు చేయడానికి ఈ రుసుము చెల్లించాలి.
రుణ విమోచన (Amortisation) షెడ్యూల్ జారీ రుసుము:
లోన్ గడువుకు సంబంధించిన వివరణాత్మక రుణ విమోచన షెడ్యూల్ కావాలనుకుంటే, ప్రతి అభ్యర్థనకు రూ.250 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
డాక్యుమెంట్ రిట్రైవల్ ఛార్జీలు:
లోన్ మొత్తాన్ని విజయవంతంగా తిరిగి చెల్లించిన తర్వాత, రుణదాత వద్ద తనఖా పెట్టిన ఆస్తి పత్రాలు పొందడానికి ఈ రుసుము చెల్లించాలి.
NOC లేదా NDC ఛార్జీ:
అకౌంట్ మూసివేసే సమయంలో ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఇందుకు మీకు NOC (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్), NDC (నో డ్యూ సర్టిఫికేట్) అవసరం.
వీటితో పాటు మీ అగ్రిమెంట్ కాపీ, టైటిల్ డాక్యుమెంట్, డూప్లికేట్ స్టేట్మెంట్ వంటి వాటితో సహా ఇతర డాక్యుమెంట్లు సేకరించడానికి కొద్దిపాటి ఫీజులు, ఛార్జీలు చెల్లించాలి.
3. చట్టపరమైన (లీగల్) ఛార్జీలు
గృహ తనిఖీ ఛార్జీలు (Home Inspection Charges):
ఆస్తి విలువను నిర్ణయించడానికి, లోన్ మొత్తాన్ని ఆమోదించడానికి రుణదాతలు తనిఖీ చేయాల్సి ఉంటుంది. సంబంధిత ఖర్చులను తీర్చడానికి ఈ ఛార్జీలను చెల్లించాలి.
MOD ఛార్జీ:
ఇది మెమోరాండం ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్ (MoD) ఛార్జీ. మీ ఆస్తి టైటిల్ డీడ్స్/ఓనర్షిప్ పేపర్లను రుణం కోసం తాకట్టుగా బ్యాంక్‌కు అందించినట్లు నిర్ధారించే పత్రాలు ఇవి. వీటి కోసం కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇది నిర్దిష్ట ఆస్తి యాజమాన్యాన్ని నిర్ధారిస్తుంది. మీ ఆస్తి చట్టపరమైన సమస్యలో చిక్కుకున్న సందర్భంలో ఈ డాక్యుమెంట్ ఉపయోగపడుతుంది.
CERSAI ఛార్జీ:
హోమ్ లోన్ కోసం మీ ఆస్తిని ఆర్థిక సంస్థ వద్ద తాకట్టు పెట్టినప్పుడు, ఆ కొలేటరల్ ఆస్తిని CERSAI (సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా) వద్ద రిజిస్టర్ చేయాలి. ఇందుకు CERSAI ఛార్జీని చెల్లించాలి.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.