• HOME
  • »
  • NEWS
  • »
  • EXPLAINED
  • »
  • HOME LOAN RATE CUTS HOW WILL IT BENEFIT TO CUSTOMERS BA GH

Home loan: గృహరుణాల వడ్డీరేటుపై కోత.. హోమ్ లోన్ తీసుకున్న వారికి ఈ విధంగా లాభం

Home loan: గృహరుణాల వడ్డీరేటుపై కోత.. హోమ్ లోన్ తీసుకున్న వారికి ఈ విధంగా లాభం

HDFC Home Loan: (ప్రతీకాత్మక చిత్రం)

కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు హోంలోన్లపై కాంపిటీటివ్ రేట్లను అందిస్తున్నాయి. సాధారణంగా బ్యాంకుల కంటే తక్కువ ఆంక్షలతో కూడిన ప్రమాణాలను కలిగి ఉంటాయి.

  • Share this:
సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయితే పెరుగుతున్న ధరలు, వడ్డీరేట్లు కారణంగా చాలా మంది ఆశ అడియాశలుగానే మిగులుతున్నాయి. ముఖ్యంగా గృహరుణాలు తీసుకునేవాళ్లకు వడ్డీ రేట్లు చెంపపెట్టుగా మారుతున్నాయి. అయితే తాజాగా హోం లోన్లు తీసుకునేవాళ్లకు ప్రయోజనం కలగనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా పలు బ్యాంకులు గృహ రుణాల వడ్డీరేటుపై కోత విధించాయి. ఎస్బీఐ రూ.75 లక్షల వరకు హోంలోన్లపై 6.7 శాతానికి తగ్గించింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ 6.65 శాతానికి తగ్గించింది. మహిళా రుణ గ్రహీతలకు ఎస్బీఐ 6.65 శాతానికే లోన్ ఇవ్వనుంది. హెచ్ డీఎఫ్సీ కూడా రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లకు తగ్గించింది.

వడ్డీరేటు తగ్గడం వల్ల రుణగ్రహీతలకు లాభమేంటి..
వడ్డీ రేటు తగ్గడం వల్ల రుణం తీసుకుందామనుకునే వాళ్లకు ఖర్చు తగ్గుతుంది. ఓ వ్యక్తి 7 శాతం వడ్డీపై రూ.50 లక్షల హోం లోన్ తీసుకుంటే అతడు 15 ఏళ్లపాటు నెలవారీగా రూ.44,941 ఈఎంఐ చెల్లించాలి. రుణం కంటే 30 లక్షల ఎక్కువ వడ్డీ చెల్లించాలి. అదే వడ్డీరేటు 6.75 శాతం అయితే ఈఎంఐ రూ.44,345 ఈఎంఐ కిందకు పోగా రుణ వ్యయం 29.64 లక్షలకు తగ్గుతుంది. రేటు తగ్గింపు విషయంలో రుణ గ్రహీతలు కావాలంటే కాలపరిమితిని తగ్గించుకోవచ్చు. ఇదే ఈఎంఐని కొనసాగించుకోవచ్చు. ఈ విధంగా వడ్డీరేటు తగ్గడం వల్ల కాలపరిమితి తగ్గించుకొని ఈఎంఐలో మార్పు లేకుండా చేసుకోవడం వల్ల వినియోగదారులు ఎక్కువ ఆదా చేసుకోవచ్చు.

తక్కువ వడ్డీరేట్లు ఎవరికి ప్రయోజనాన్ని అందిస్తాయి..
వడ్డీరేట్ల కోత నూతన రుణగ్రహీతలకు ప్రయోజకరంగా ఉంటుంది. ఇప్పటికే ఉన్నవారికి అందుబాటులో ఉండదు. ప్రస్తుత రుణగ్రహీతలకు ఆర్బీఐ రెపో రేటును తగ్గించినట్లయితే లాభం ఉంటుంది. ఎందుకంటే 2019 అక్టోబరు 1 నుంచి బ్యాంకులు తమ రుణ రేట్లను ఎక్సటర్నల్ బెంచ్ మార్క్ తో అనుసంధించాలని కేంద్రబ్యాంకు ఆదేశించింది. అంతేకాకుండా చాలా బ్యాంకులు రెపో రేటు ఎక్సటర్నల్ బెంచ్ మార్కుగా ఎంచుకున్నాయి. రెపోరేటుతో అనుసంధానమైన హోంలోన్లు రెపోరేటుపై లెక్కించబడతాయి. మార్జిన్ స్థిరంగా ఉన్నందున హోంలోన్ రేట్లు ఆటోమేటిక్ గా రెపో రేటు మార్పుతో కదులుతాయి.

భారత్ లో తక్కువ వడ్డీకే హోంలోన్లు ఇచ్చే బ్యాంకులు

కోటక్ మహీంద్రా బ్యాంక్ 6.65 10 బేస్ పాయింట్లు (మార్చి 2021 నుంచి)
ఎస్బీఐ 6.70 (10 మార్చి 2021 నుంచి)
హెచ్ డీఎఫ్సీ 6.75 (5 మార్చి 2021 నుంచి)
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.80 (10 నవంబరు 2020 నుంచి)
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.80 (30 డిసెంబరు 2020 నుంచి)

ఎవరికి అర్హత ఉంటుంది?
అతి తక్కువ గృహ రుణ రేటుకు బ్యాంకులకు కొన్ని అర్హత ప్రమాణాలు ఉన్నాయి. ఉదాహరణకు యోనో యాప్ లో 30 లక్షల వరకు రుణం పొందవచ్చు. స్టేట్ బ్యాంక్ మహిళా ఉద్యోగస్తులకైతే తక్కువగా 6.6 శాతం వడ్డీనిస్తుంది. అదే పురుషులకైతే 6.65 శాతం అందిస్తుంది. యోనో యాప్ లేకపోతే 6.70 శాతం వద్ద వడ్డీ లభిస్తుంది. రుణ గ్రహీత క్రెడిట్ స్కోర్ ఆధారంగా గృహ రుణ రేట్లను నిర్ణయిస్తుంది.

ప్రస్తుత రుణగ్రహీతల ఎంపికలేంటి?
మీ రుణ దాత అధిక వడ్డీని వసూలు చేస్తుంటే బ్యాలెన్స్ ట్రాన్సఫర్ ఎంచుకోవాలి. ఇచ్చే రేటులో భేదం కనీసం 50 బేసిస్ పాయింట్ ఉండాలి. అంతేకాకుండా కనీసం 10 ఏళ్ల కాలపరిమితి లేదా అంతకంటే ఎక్కువ ఉంటే బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి. ఏదేమైన బదిలీని ఎంచుకునే ముందు స్టాంప్ డ్యూటీ, ప్రాసెసింగ్ ఫీజుతో సహా ఇతర ఛార్జీలను కూడా చూసుకోవాలి. ఇది రుణ మొత్తంలో 1 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. కొంత మంది రుణదాతలు డాక్యుమెంటేషన్, లీగల్, వ్యాల్యూయేషన్, లీగల్, ఇతర టెక్నికల్ ఫీజులను కూడా వసూలు చేస్తారు. స్టాంప్ డ్యూటీ ఛార్జీలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి.

బ్యాంకేతర సంస్థలు, బ్యాంకులు రెండింటిలో ఏది ఎంచుకోవాలి?
కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు హోంలోన్లపై కాంపిటీటివ్ రేట్లను అందిస్తున్నాయి. సాధారణంగా బ్యాంకుల కంటే తక్కువ ఆంక్షలతో కూడిన ప్రమాణాలను కలిగి ఉంటాయి. ఏదేమైనా, ఎన్బీఎఫ్సీలు ప్రైమ్ లెండింగ్ రేట్(పీఎల్ఆర్) ఆధారంగా గృహ రుణాలు అందిస్తాయి. అంతేకాకుండా వడ్డీరేట్లు ఎక్స్ టర్నల్ బెంచ్ మార్కుతో అనుసంధానించబడవు. అందువల్ల బ్యాంకులు అందించే హోంలోన్లతో పోల్చినప్పుడు ఎన్బీఎఫ్సీ విషయంలో వేగం, పారదర్శకత ఉండకపోవచ్చు. తక్కువ క్రెడిట్ స్కోరు కలిగి ఉన్నవారికి బ్యాంకేతర సంస్థలు సరిపోతాయి.
First published:

అగ్ర కథనాలు