Home /News /explained /

HOME LOAN DOCUMENTS REQUIRED FOR EMPLOYEES AND SELF EMPLOYED AND PROFESSIONALS HERE IS A CHECK LIST BA

Home Loan Documents : హోమ్‌ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

How Many documents required for Home Loan | హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారు చాలా డాక్యుమెంట్లను బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలకు సమర్పించాల్సి ఉంటుంది. సుమారు 15 పత్రాలు అవసరం ఉంటుంది. అవేంటో తెలుసుకోండి.

    గృహ రుణం (Home Loan) కోసం దరఖాస్తు చేసేవారు కొన్ని పత్రాలను (Documents) రుణదాతకు సమర్పించాల్సి ఉంటుంది. వివిధ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (HFC), ఇతర రుణ సంస్థలు అడిగే డాక్యుమెంట్లు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. అయితే రుణదాతను బట్టి కొన్ని ప్రత్యేక డాక్యుమెంట్ల అవసరాలు మారవచ్చు. మీ లోన్ స్కీమ్, లోన్ ఉద్దేశం, వ్యక్తిగత క్రెడిట్ ప్రొఫైల్ వంటి వాటి ఆధారంగా కూడా హోమ్ లోన్ డాక్యుమెంట్‌ల (Home Loand Documents) విషయంలో తేడాలు ఉండవచ్చు. KYC పత్రాలు, దరఖాస్తుదారులు కొనుగోలు చేయాలనుకుంటున్న ఆస్తి పూర్వపరాలు, వారి ఆదాయ నేపథ్యం వంటి వాటిని నిర్ధారించే వివిధ డాక్యుమెంట్లను రుణగ్రహీతలు తప్పనిసరిగా సమర్పించాలి. భారతదేశంలో హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన కొన్ని సాధారణ డాక్యుమెంట్ల గురించి తెలుసుకుందాం.



















































    హోమ్ లోన్ కోసం అవసరమైన 15 పత్రాలు
    రుణ దరఖాస్తు ఫారం
    3 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
    ఐడీ ప్రూఫ్
    నివాస రుజువు (Residence proof)
    గత 6 నెలల బ్యాంక్ అకౌంట్/పాస్‌బుక్ స్టేట్‌మెంట్
    దరఖాస్తుదారుల బ్యాంకర్ ధ్రువీకరించిన సంతకం (Signature verification)
    చెల్లించాల్సిన అప్పులు (Liabilities), వ్యక్తిగత ఆస్తుల జాబితా
    ఆస్తులకు సంబంధించిన అన్ని పత్రాలు
    యజమాని అందించే ఒరిజినల్ జీతం సర్టిఫికేట్ (జీతం పొందే వ్యక్తులు)
    గత 2 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఫారమ్ 16/IT రిటర్న్స్ (జీతం పొందే వ్యక్తులు)
    గత 3 సంవత్సరాల IT రిటర్న్స్/అసెస్‌మెంట్ ఆర్డర్‌ల కాపీలు (స్వయం ఉపాధి నిపుణులు)
    ముందస్తు ఆదాయపు పన్ను చెల్లింపులకు రుజువుగా చలాన్లు (స్వయం ఉపాధి నిపుణులు)
    జీతం లేని (non-salaried) వ్యక్తుల వ్యాపార చిరునామా (business address) రుజువు (స్వయం ఉపాధి నిపుణులు)
    గత 3 సంవత్సరాల ఐటీ రిటర్న్స్/అసెస్‌మెంట్ ఆర్డర్‌ల కాపీలు (స్వయం ఉపాధి వ్యాపారులు)
    ముందస్తు ఆదాయపు పన్ను చెల్లింపు రుజువుగా చలాన్లు (స్వయం ఉపాధి వ్యాపారులు)

    NRI దరఖాస్తుదారులకు అవసరమైన పత్రాల జాబితా

    •  KYC పత్రాలు

    • జీతానికి సంబంధించిన పత్రాలు. శాలరీ సర్టిఫికెట్‌లో దరఖాస్తుదారుల పేరు (పాస్‌పోర్ట్ ప్రకారం), హోదా, పాస్‌పోర్ట్ నంబర్, ఉద్యోగంలో చేరిన తేదీ, తాజా జీతం.. వంటి వివరాలను ఎంప్లాయర్ ఇంగ్లీష్‌లో పేర్కొంటూ జారీ చేయాలి.

    • గత 3 నుంచి 6 నెలల శాలరీ స్లిప్‌లు

    • తాజా IT రిటర్న్‌లు (దేశంలో IT రిటర్న్‌లు దాఖలు చేసే దరఖాస్తుదారుల కోసం)

    • స్వయం ఉపాధి ఆదాయ మార్గంగా ఉండే NRIలు ట్రేడ్ లైసెన్స్, స్పాన్సర్ అగ్రిమెంట్, పవర్ ఆఫ్ అటార్నీ వంటి బిజినెస్ డాక్యుమెంట్లు అందించాల్సి ఉంటుంది.

    • పాస్‌పోర్ట్ రెసిడెన్స్ వీసా పేజీ కాపీ

    • ప్రస్తుతం నివాసం ఉంటున్న దేశంలో వర్క్ పర్మిట్, లేబర్ కాంట్రాక్ట్ వంటి ఉద్యోగానికి సంబంధించిన రుజువు (Proof of employment)

    • ఇండియన్ ఆర్కిటెక్ట్ లేదా ఇంజనీర్ ధ్రువీకరించిన ధర అంచనాలతో ఆస్తికి సంబంధించిన పత్రాలు.

    • గత 6 నెలల ఓవర్సీస్ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ కాపీలు

    • గత 6 నెలల NRO/NRE బ్యాంక్ స్టేట్‌మెంట్ప

    • త్రాలపై సంతకం చేసే సమయంలో దరఖాస్తుదారులు దేశంలో అందుబాటులో లేకుంటే, వారి తరఫున పనిచేసే వ్యక్తి పవర్ ఆఫ్ అటార్నీని సమర్పించాలి.


    హోమ్ లోన్ అప్లికేషన్‌ కోసం సమర్పించాల్సిన KYC పత్రాల జాబితా

    ఫోటో ఐడీ ప్రూఫ్:
    దరఖాస్తుదారులు పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డు.. వంటి గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదాన్ని ఫోటో ఐడీ ప్రూఫ్‌గా సమర్పించాల్సి ఉంటుంది.

    నివాస రుజువు (Residence Proof):
    విద్యుత్ బిల్లు, రేషన్ కార్డు, టెలిఫోన్ బిల్లు, ఎంప్లాయ్‌మెంట్ లెటర్, చిరునామా ఉండే పాస్‌బుక్ లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్.. వంటి వాటిలో ఏదో ఒకటి అవసరం.

    Navi Home Loan: నావి ఫిన్‌సర్వ్ సంచలనం... బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకే హోమ్ లోన్



    వయసు రుజువు (Age Proof):
    దరఖాస్తుదారులు తమ వయసును ధ్రువీకరించడానికి పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, బర్త్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ పాస్ బుక్, 10వ తరగతి మార్క్‌షీట్‌.. వంటి వాటిలో ఏదైన ఒక డాక్యుమెంట్‌ అవసరం.

    లోన్ గ్యారెంటర్ సమర్పించాల్సిన డాక్యుమెంట్లు

    1. చెల్లించాల్సిన అప్పులు (Liabilities Statement), వ్యక్తిగత ఆస్తుల జాబితా

    2. 2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

    3. ఐడీ ప్రూఫ్

    4. నివాస ధ్రువీకరణ పత్రాలు (రెసిడెంట్ ప్రూఫ్)

    5. బిజినెస్ అడ్రస్ రుజువు

    6. ప్రస్తుత బ్యాంకర్ ధ్రువీకరించిన సంతకం


    హోమ్ లోన్ కోసం అవసరమైన ఆస్తి పత్రాల (Property Documents) జాబితా

    కోఆపరేటివ్ సొసైటీ విషయంలో డీడ్ ఆఫ్ సేల్ లేదా సేల్ అగ్రిమెంట్ లేదా షేర్ సర్టిఫికేట్

    భవనం, భూమికి చెల్లించిన పన్నులకు సంబంధించిన రసీదులు, స్వాధీన ధ్రువీకరణ పత్రం (possession certificate), రెవెన్యూ అధికారులు అందించే ఆస్తి లొకేషన్ స్కెచ్ వివరాలు

    సొసైటీ/హౌసింగ్ బోర్డ్/ప్రైవేట్ బిల్డర్ నుంచి పొందిన అలాట్‌మెంట్ లెటర్

    ఫ్లాట్ కొనుగోలు కోసం ముందస్తు చెల్లింపుల రసీదులు

    గత 12 సంవత్సరాలు/30 సంవత్సరాల నాన్‌ ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ (Non encumbrance Certificate)

    రెవెన్యూ అధికారులు జారీ చేసిన భూమి పన్ను చెల్లింపు రసీదులు

    బిల్డింగ్ ప్లాన్ (ఫ్లాట్ కొనుగోలు కోసం ఫ్లోర్ ప్లాన్‌)

    ULC చట్టం- 1976 ప్రకారం జారీ చేసిన ఒరిజినల్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్

    వ్యవసాయ భూమిని కన్వర్ట్ చేస్తే, సంబంధిత ఆర్డర్ కాపీ

    బిల్డర్/హౌసింగ్ సొసైటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC)

    నిర్మాణ వ్యయం అంచనాకు సంబంధించిన పత్రాలు

    వాయిదా చెల్లింపుల కోసం సొసైటీ/బిల్డర్/హౌసింగ్ బోర్డ్ బ్యాంక్ అకౌంట్‌ వివరాలను పేర్కొంటూ లేఖ

    ల్యాండ్ ప్లాట్ కొనుగోలు విషయంలో రుణగ్రహీత ఇంటిని నిర్మించే తేదీని నిర్దేశించే డిక్లరేషన్

    ప్రామాణిక ఫార్మాట్ ప్రకారం సిద్ధం చేసిన లాయర్ రిపోర్ట్

    ఆస్తి విలువకు సంబంధించిన అధికారిక వాల్యుయేషన్ రిపోర్ట్

    వీటితో పాటు కొన్ని సంస్థలు అదనంగా ఆస్తికి సంబంధించిన నిర్ణీత డాక్యుమెంట్లు సమర్పించాలని కోరవచ్చు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Home loan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు