హోమ్ /వార్తలు /Explained /

Carbon Footprint: కాలుష్య రహిత ఇంధన వినియోగంలో దూసుకుపోతున్న భారత్​.. కార్భన్​ ఫుట్​ ప్రింట్​ కట్టడిలో ముందంజ

Carbon Footprint: కాలుష్య రహిత ఇంధన వినియోగంలో దూసుకుపోతున్న భారత్​.. కార్భన్​ ఫుట్​ ప్రింట్​ కట్టడిలో ముందంజ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కాలుష్యం(Pollution) లేని ఇంధన వనరుల వినియోగంలో భారత్(India) దూసుకుపోతోంది. 2070 నాటికి 5,630 గిగావాట్ల సోలార్ ఎనర్జీ సామర్థ్యం భారత్ సాధిస్తుందని కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్ మెంట్ అండ్ వాటర్ సంస్థ వెల్లడించింది.

కాలుష్యం (Pollution) లేని ఇంధన వనరుల వినియోగంలో భారత్ (India) దూసుకుపోతోంది. 2070 నాటికి 5,630 గిగావాట్ల సోలార్ ఎనర్జీ సామర్థ్యం భారత్ సాధిస్తుందని కౌన్సిల్ ఆన్ ఎనర్జీ(Council on Energy), ఎన్విరాన్ మెంట్ అండ్ వాటర్(Environment and Water) సంస్థ వెల్లడించింది. ఈ లక్ష్యం అధిగమించేందుకు మొత్తం భూమిలో 4.6 శాతం సోలార్ ఎనర్జీ ఉత్పత్తికి అవసరం అవుతుందని ఎనర్జీ ట్రాన్సిషన్స్ అండ్ క్లైమేట్ పాలసీ నివేదికలో వెల్లడించింది.

అసలు కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే ఏమిటి?

ఏదైనా ఒక వస్తువు ఉత్పత్తి చేసేప్పుడు, దాని జీవితకాలం ముగిసే వరకు వినియోగించే సమయంలో విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువుల మొత్తాన్ని కార్బన్ ఫుట్ ప్రింట్ అంటారు. ఇందులో ముఖ్యంగా కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. మిథేన్, నైట్రోస్ ఆక్సైడ్, ఫ్లుఓరినేటెడ్ వాయువులు ఉంటాయి. ఇవన్నీ వాతావరణంలో వేడి పెంచుతాయి. దీంతో గ్లోబల్ వార్మింగ్ కు దారితీస్తోంది. రవాణా, హౌసింగ్, ఇంధన, పంటలు పండించడం ద్వారా కూడా పెద్ద ఎత్తున కార్బన్ పుట్ ప్రింట్స్ అంటే కాలుష్యం వెలువడుతోంది.

Devil Trees: ఆ చెట్లను చూస్తేనే హడలిపోతున్న జనం… అక్కడి గాలిపీలిస్తే ఆస్పత్రికి వెళ్లాల్సిందే..!

కార్బన్ ఎమిషన్లో భారత్​ర్యాంకు?

దేశంలో 20 శాతం వాయువులు ధనికుల నివాసాల నుంచి వస్తున్నాయని జపాన్ నిర్వహించిన పరిశీలనలో తేలింది.పేదలు అంటే కేవలం 1.9 అమెరికా డాలర్ల కన్నా తక్కువ ఖర్చు చేసేవారి కన్నా ఇది ఏడు శాతం అధికం. ప్రతి భారతీయుడు సంవత్సరంలో 0.56 టన్నుల కార్భన్ పుట్ ప్రింట్ విడుదల చేస్తున్నారు. ఇందులో పేదలు 0.19 కాగా ధనికుల నుంచి 1.32 టన్నులుగా ఉంది.

World Ozone Day: అదే జరిగితే ఓజోన్ పోరును రక్షించలేం.. వీటిని తగ్గించుకుంటేనే మేలు..

కార్బన్ ఫుట్ ప్రింట్ ఎలా తగ్గించాలి?

ప్రతి దేశం నెట్ జీరో వాయువులు అంటే ఎలాంటి కాలుష్యం లేని ఇంధన వాడకాన్ని ప్రోత్సహించాలి. ఇలా పూర్తిగా కాలుష్య రహిత ఇంధనం వాడినప్పుడు ఆదేశంనెట్ జీరో ఎమిషన్స్ గా ప్రకటిస్తారు. ఇలా కాలుష్యం తగ్గించడం ద్వారా వాతావరణంలోని గ్రీన్ హౌస్ వాయువులు తగ్గుతాయి.

కార్భన్ వాచ్​తో కాలుష్యంపై ఫీడ్​బ్యాక్​..

చంఢీఘర్ యూనియన్ టెరిటరీ ఎన్విరాన్ మెంట్ అండ్ ఫారెస్ట్ ఈ ఏడాది కార్బన్ వాచ్ విడుదల చేసింది. మొబైల్ యాప్ ద్వారా ప్రతి ఒక్కరూ కార్బన్ వాచ్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్కరు ఫీడ్ బ్యాక్ ఇవ్వొచ్చు. యూజర్లు పిన్ కోడ్ యాడ్ చేసుకోవడం ద్వారా వారు ఏ ప్రాంతం నుంచి ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారో గుర్తించి కార్భన్ ఫుట్ ప్రింట్ ను విశ్లేషిస్తారు. ఈ విషయంలో చంఢీఘర్ నగరం ముందుంది. సగటున మొత్తం విస్తీర్ణంలో 33 శాతం అడవులు ఉండాలి.అయితే చంఢీఘర్ లో 44 శాతం అడవులు ఉండటం విశేషం. దేశంలో 112 నగరాలతో పోల్చుకుంటే చంఢీఘర్ లోనే తక్కువ కాలుష్యం నమోదవుతోంది. దీంతోఛండీఘర్​లోగాలి ఎక్కువగా ఉంది.

First published:

Tags: Air Pollution, India, World environmental day

ఉత్తమ కథలు