Home /News /explained /

HERE ARE THE SPECIALITIES AND HISTORY OF VAIKINTHAEKADASHI ACCORDING TO HINDU MYTHOLOGY PRN TPT

Explainer: వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం ఏంటి..? ఉత్తరద్వార దర్శనంతో మోక్షం సిద్ధిస్తుందా..?

తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్)

తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్)

వైకుంఠ ఏకాద‌శి రోజు భ‌క్తులు శ్రీ‌మ‌హావిష్ణువును ద‌ర్శించుకోవ‌డానికి దేశ‌ వ్యాప్తంగా ఉన్న 108 వైష్ణ‌వ దివ్య‌దేశాల్లోని ప్ర‌ముఖ ఆల‌యాల్లో గ‌ర్భ‌గుడి ప్రాంగ‌ణానికి ఉత్త‌రం వైపుగా వైకుంఠ ద్వారం ఉంటుంది.. దీనినే ఉత్త‌ర ద్వారం అని కూడా పలుస్తారు.

ఇంకా చదవండి ...
    GT Hemanth Kumar, Tirupathi, News18

    కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరిపై (Tirumala Temple) గోవిందునిగా అవతారమెత్తాడు శ్రీమహా విష్ణువు. కలియిగంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం ఇలవైకుంఠంలో వెలసిన స్వామి వారిని చూసేందుకు రెండు కళ్ళు చాలవు. ఒక్కసారి గర్భాలయంలో అర్చావతారా మూర్తిగా వెలసిన స్వామి వారిని చూసినంత సేపే.. మళ్లీ స్వామి వారి రూపం మన కలలో గుర్తుకు రాదు. అందుకే వెంకన్న దర్శనానికి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఎన్ని సార్లు తనివితీరా చుసిన మళ్లీ ఓ సారి చూడాలనే భావనలో ప్రతి ఒక్క భక్తుడు ఉంటాడు. మోక్ష ప్రదాత. వైకుంఠ వ్యాసునికి ఎంతో ప్రీతికరమైన రోజు వైకుంఠ ఏకాదశి (Vaikuntaekadashi).. స్వామి వారి ఉత్తర ద్వారా దర్శనం సకల పాప హరణం., వైకుంఠ ద్వారా ప్రవేశం ముక్తికి మార్గం.

    శ్రీ మహా విష్ణువుకు ఎంతో పాశస్త్యం ఉన్న రోజు వైకుంఠ ఏకాదశి ఘడియల గురించి మ‌నం ముందుగా తెలుసుకోవాలి. తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాద‌శి చ‌రిత్ర విష‌యానికి వ‌స్తే మ‌ధు, కైత‌భ అనే ఇద్ద‌రు రాక్ష‌సులు వేదాల‌ను దొంగలిస్తారు. వీరిని శ్రీ‌మ‌హావిష్ణువు సంహ‌రించి వేదాల‌ను పునఃసృష్టిస్తాడు..ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రు రాక్ష‌సుల‌కు సౌర‌మ‌ణ శుక్ల‌ప‌క్ష ఏకాద‌శి రోజు ఉత్త‌ర‌ద్వార ప్ర‌వేశం ద్వారా శ్రీ‌మ‌హ‌విష్ణువు ద‌ర్శ‌న‌ మిచ్చి మోక్షం ప్ర‌సాదిస్తాడు. ఆరోజునే వైకుంఠ ఏకాద‌శిగా ప్ర‌సిద్ధి గాంచింది. మోక్షం పొందిన రాక్ష‌సులు వైకుంఠ ఏకాద‌శి రోజు ఉత్త‌ర ద్వార ప్ర‌వేశం ద్వారా ద‌ర్శ‌నం చేసుకున్న భ‌‌క్తులంద‌రికీ మోక్షం ప్ర‌సాదించాల‌ని కోర‌డంతో వారి కోరిక‌ను మ‌న్నించి శ్రీ‌మ‌హావిష్ణువు వైకుంఠ ఏకాద‌శి రోజు ఉత్త‌ర ద్వారం ద్వార త‌న ద‌ర్శ‌నం చేసుకున్న భ‌క్తుల‌కు మోక్ష‌ప్ర‌దానం చేస్తాన‌ని మాటిస్తాడు. అందుకే వైకుంఠ ఏకాద‌శి హిందువుల‌కు అంత ముఖ్య‌మైన‌దిగా పురాణాలు చెబుతున్నాయి.

    ఇది చదవండి: వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి


    వైకుంఠ ఏకాద‌శి రోజు భ‌క్తులు శ్రీ‌మ‌హావిష్ణువును ద‌ర్శించుకోవ‌డానికి దేశ‌ వ్యాప్తంగా ఉన్న 108 వైష్ణ‌వ దివ్య‌దేశాల్లోని ప్ర‌ముఖ ఆల‌యాల్లో గ‌ర్భ‌గుడి ప్రాంగ‌ణానికి ఉత్త‌రం వైపుగా వైకుంఠ ద్వారం ఉంటుంది. దీనినే ఉత్త‌ర ద్వారం అని కూడా పలుస్తారు. సాధార‌ణ రోజుల్లో భ‌క్తులు ద‌క్షిణ దిక్కు గుండా వెళ్లి స్వామి వారిని ప్ర‌ద‌క్షిణ చేస్తారు.. కానీ వైకుంఠ ఏకాద‌శి రోజూ ఆల‌యాల్లో ఉన్న ఉత్త‌రం ద్వారం గుండా ప్రదక్షణగా వెళ్లి స్వామి వారిని ద‌ర్శించుకుంటారు.

    ఇది చదవండి: ధనుర్మాసంలో శ్రీవారికి జరిగే ప్రత్యేక సేవలివే..! ఈ మాసంలో సుప్రభాతసేవ ఎందుకు ఉండదో తెలుసా...?


    దేశంలోని 108 దివ్య‌దేశాల్లోని ప్ర‌ముఖ వైష్ణ‌వాల‌యాలైన‌ శ్రీ‌రంగం, పార్థ‌న్‌ప‌ల్లి, తిరుచెరై, నాచియార్ కోయిళ్‌, తిరున‌గై, కేశ‌వ‌పెరుమాళ్ కోయిల్‌, తిరునీర్‌మ‌లై, సారంగ‌పాణి దేవాల‌యం వంటి 28 దేవాల‌యాల్లో ఉత్త‌ర ద్వారం ఉంది. ఈ దేవాల‌యాల్లో వైకుంఠ ఏకాద‌శి నుండి వ‌రుస‌గా 10 రోజులు ఉత్త‌ర ద్వారాన్ని తెరుస్తారు. ఆ ప‌ది రోజుల పాటు భ‌క్తులు ఉత్త‌ర‌ద్వార గుండా వైకుంఠ నాధుడైన శ్రీ మహావిష్ణువును ద‌ర్శనం చేసుకుని మోక్షం పొందుతున్నారు.

    ఇది చదవండి: శ్రీవారి ఆలయం గురించి ఈ విశేషాలు తెలుసా..? అడుగడుగునా గోవిందుడి ప్రతిరూపాలే..!


    ట్ర‌ప్లికేన్‌, అన్న‌న్ కోయిల్‌, పురుషోత్తం కోయిల్‌, సెంఫోన్ అరంగ‌ర్‌, సిరిపులియూర్‌, తిరున‌గ‌రి వంటి వైష్ణ‌వ దేవాల‌యాల్లో వైకుంఠ ద్వారాలు ఉత్త‌ర వైపున కాకుండా మ‌హాద్వారం ప‌క్క‌గా లేదా వేరే ప్ర‌దేశాల్లో ఉంటాయి కానీ ఉత్త‌రం వైపున ఉండ‌వు. కానీ ఈ ద్వారాల వైపునే భ‌క్తుల‌కు 10 రోజుల పాటూ వైకుంఠ ద్వారం గుండా స్వామి వారి ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్నారు.

    ఇది చదవండి: తిరుమల శ్రీవారి సుప్రభాత సేవకు ఎందుకంతటి ప్రాముఖ్యత..? ఈ పూజలో ఎన్ని ఘట్టాలుంటాయో తెలుసా..?


    తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో కూడా ప్ర‌త్యేకంగా ఉత్త‌ర ద్వారం లేదు. వైకుంఠ ఏకాద‌శి రోజు భ‌క్తులు ద‌క్షిణం వైపుగా వైకుంఠ ద్వార ప్ర‌వేశం చేసి ఉత్త‌రం వైపుగా బ‌య‌ట‌కు వ‌స్తారు. దీనిని వైకుంఠ ప్ర‌ద‌క్షిణ‌గా పిలుస్తున్నారు. 12 శ‌తాబ్దం నుండి 13వ శ‌తాబ్దం మ‌ధ్య‌లో శ్రీ‌వారి ఆల‌యంలో విమాన‌ప్రాకారం బ‌రువును మోయ‌డానికి రెండో గోడ‌ను నిర్మించారు. బ‌రువును మోయ‌డానికి మూడో గోడ‌ను కూడా నిర్మించ‌డంతో రెండు, మూడో గోడ‌ల మ‌ధ్య స్థ‌లం ఏర్ప‌డింది.. వైకుంఠ ఏకాద‌శి రోజు భ‌క్తులు ఈ వైకుంఠ ద్వారాల గుండా వైకుంఠ‌ ప్ర‌దక్షిణ చేస్తారు. దీనినే వైకుంఠ ద్వారంగా ప‌రిగ‌ణిస్తారు. ద‌క్షిణ‌వైపుగా వైకుంఠ ప్ర‌దిక్ష‌ణం ప్రారంభించి ఉత్త‌రం వైపుగా బ‌య‌ట‌కు వ‌స్తారు.ఎల్ల‌ప్ప పిళ్లై అనే భ‌క్తుడు 1541లో మూడు రోజుల పాటు ముక్కోటి ఏకాదశి వేడుక‌ల‌ను ప్రారంభించిన‌ట్లు సాదు సుబ్ర‌మ‌ణ్య‌శాస్త్రి త‌ను ర‌చించిన తిరుప‌తి శ్రీ‌వేంక‌టేశ్వ‌ర పుస్త‌కంలో పేర్కొన్నారు. 1843 నుండి 1864 మ‌ధ్య‌లో మ‌హంతు సేవ‌దాస్ హాయంలో ముక్కోటి ప్ర‌ద‌క్షిణ ప్రారంభ‌మైన‌ట్లు ఆధారాలు ఉన్నాయి.

    ఇది చదవండి: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఎందుకంత ప్రాముఖ్యత... వందల ఏళ్ల చరిత్ర ఏం చెబుతోదంటే..!


    ధ‌నుర్మాసంలో వైష్ణ‌వాల‌యాల్లో నిర్వ‌హించే ముఖ్య‌మైన ఉత్స‌వాలు అధ్య‌య‌నోత్స‌వాలు. ఈ ఉత్స‌వాల‌ను 21 నుండి 25 రోజుల పాటు నిర్వ‌హిస్తారు. ఎన్ని రోజులు అధ్య‌య‌నోత్స‌వాలు చేయాల‌నే అంశం ప్ర‌తి దేవాల‌యానికి వేరుగా ఉంటుంది. ఈ అధ్య‌య‌నోత్స‌వాల‌ను రెండు భాగాలుగా విభ‌జించారు. అధ్య‌య‌నోత్స‌వాల్లో మొద‌టి భాగం 11 రోజులు ఉంటుంది. రెండో భాగం ప‌ది రోజులు నిర్వ‌హిస్తారు.

    ఇది చదవండి: శ్రీవారి ఆలయం గురించి ఈ విశేషాలు తెలుసా..? అడుగడుగునా గోవిందుడి ప్రతిరూపాలే..!


    మొద‌టి భాగంలో వైకుంఠ ఏకాద‌శికి ముందు వ‌చ్చే 11 రోజుల‌ను ప‌గ‌ల్ ప‌ట్టు అని, వైకుంఠ ఏకాద‌శి రోజూ నుండి వ‌చ్చే ప‌ది రోజుల‌ను రా ప‌ట్టుగా పిలుస్తారు. అధ్య‌య‌నోత్స‌వాల స‌మ‌యంలో అళ్వార్లు రూపొందించిన దివ్య ప్ర‌భందంలోని 4వేల శ్లోకాల‌ను పండితులైన అధ్యాప‌కులు పారాయ‌ణం చేస్తారు. ఇందులో న‌మ్మ‌ళ్వార్ రూపొందించిన 1296 శ్లోకాలు విశేష ప్రాముఖ్య‌త క‌లిగిన‌వి. ఈ శ్లోకాల‌నే భ‌క్తామ్రితం, ద్ర‌విడోప‌నిష‌త్తు అని పిలుస్తారు.

    ఇది చదవండి: శ్రీవారిని మలయప్ప అని ఎందుకు పిలుస్తారు... పంచబేర ఆరాధన అంటే ఏంటి..?


    వైకుంఠ ఏకాద‌శి నుండి మొద‌ల‌య్యే అధ్య‌య‌నోత్స‌వాల్లో రెండో భాగ‌మైన రా ప‌ట్టు స‌మ‌యంలో ఈ శ్లోకాల‌ను అధ్యాప‌కులు పారాయ‌ణం చేస్తారు.. అందుకే వైకుంఠ ఏకాద‌శికి అంత‌టి ప్రాముఖ్య‌త ఏర్ప‌డింది. ఈ సమ‌యంలో వైకుంఠ ద్వారా ప్ర‌ద‌క్షిణ చేస్తే పాపాలు అన్నీ తొల‌గి మోక్షం ల‌భిస్తుంద‌ని భ‌క్తులు ప్ర‌గాఢంగా న‌మ్ముతారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Tirumala Temple, Tirumala tirupati devasthanam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు