Jamun fruit: నేరేడు పండ్లతో ఇన్ని ఉపయోగాలున్నాయా..! డాక్టర్లు ఏమంటున్నారంటే..!

నేరేడు పండ్లు

మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారపదార్థాలు ఎంచుకుంటే చాలు. అలాంటి పండ్లలో నేరేడు ఒకటి

 • Share this:
  Anna Raghu, Guntur Correspondent, News18

  మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రకృతి సిద్ధంగా లభించే ఆహార పదార్థాలు ఎంచుకుంటే చాలు. అలాగే ఏ సీజన్లో దొరికే పండ్లను.. ఆ సీజన్లో తినాలి. దీంతో సంపూర్ణం ఆర్యోగం సొంతమవుతోంది. కొన్ని పండ్లతో రోగాలను తగ్గించే గుణాలు కూడా ఉంటాయి. అలాంటి పండ్లలో నేరేడు ఒకటి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని.. అనారోగ్యాల నివారణి. నేరేడు శక్తి నందించి.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క పండే కాదు.. ఆకులు.. బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్య ఫల ప్రధాయిని నేరేడు పండు తినడం వలన కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.

  చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు పోవటానికి నేరేడు పండ్లను తినటం మంచిది. పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలకు కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉంది. నేరేడు పండ్లు శరీరానికి చలవ చేస్తాయి. నేరేడు పండ్లను తినటం వలన రోగ నిరోదకశక్తి పెరుగుతుంది. మూత్ర సంబంధ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. నీరసం, నిస్సత్తువ ఉన్న వారు నేరేడు పండును తింటే తక్షణ శక్తి వస్తుంది. అంతేకాదు వెన్నునొప్పి, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, నయం అవుతాయి. జిగట విరేచనాలతో బాధపడే వారికి నేరేడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు చెంచాల చొప్పున ఇవ్వాలి. రోగికి శక్తితోపాటు పేగుల కదలికలు నియంత్రణలో ఉంటాయి.

  ఇది చదవండి: ఏపీలో రేపు వ్యాక్సినేషన్ డ్రైవ్.. ఒక్కరోజులో లక్ష్యం ఇదే..!


  ఇక కాలేయం పనితీరు క్రమబద్ధీకరించడానికి లేదా శుభ్రపరచడానికి నేరేడు దివ్యౌషధంలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. జ్వరంగా ఉన్నపుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర తాపం తగ్గుతుంది. మూత్రం మంట తగ్గడానికి నిమ్మరసం, నేరేడు రసం రెండు చెంచాల చొప్పున నీళ్లలో కలిపి తీసుకోవాలి. పిండి పదార్థాలు, కొవ్వు భయం ఉండదు కనుక నేరేడు పండ్లను అధిక బరువు ఉన్నవారు. మధుమేహం రోగులు సైతం వీటిని రోజుకు ఆరు నుంచి ఎనిమిది దాకా తినవచ్చు. నేరేడు పండును రోజుకొకటి చొప్పున తింటే వైద్యుల నుంచి దూరంగా ఉండవచ్చునని చెబుతున్నారు.

  ఇది చదవండి: ఏపీ ఎంసెట్ షెడ్యూల్ విడుదల.. ఈసారి సరికొత్తగా..


  ఎంతో ఉపయోగకరమైన నేరేడు పండ్లను గర్భిణీలు ఎటువంటి పరిస్థితులలో తినకూడదని డాక్టర్లు చెప్తున్నారు. నేరేడు అరగడానికి ఎక్కువసమయం పడుతుంది కాబట్టి.. ఉప్పు వేసి అప్పుడప్పుడు తీసుకోవాలని ప్రభుత్వ ఆయుష్ వైద్యులు డాక్టర్ ఆర్.శ్రీనివాస్ తెలిపారు. భోజనమైన గంట తరువాత ఈ పండ్లు తీసుకుంటే.. ఆహారం జీర్ణమవుతుందని వివరించారు. వీటిని అధికంగా తీసుకుంటే.. మలబద్ధకం సమస్యతో పాటు, నోరు వెగటుగా ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు.
  Published by:Purna Chandra
  First published: