హోమ్ /వార్తలు /Explained /

Insurance Policy: చనిపోయిన వ్యక్తి పేరిట ఉన్నఇన్సురెన్స్ పాలసీలను ఏం చేయాలి..? ఇలా బదిలీ చేసుకోండి..!

Insurance Policy: చనిపోయిన వ్యక్తి పేరిట ఉన్నఇన్సురెన్స్ పాలసీలను ఏం చేయాలి..? ఇలా బదిలీ చేసుకోండి..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఒక వ్యక్తి మరణించిన తర్వాత కుటుంబ సభ్యులు ఎంతో దు:ఖానికి లోనవుతారు. అయితే ఆ బాధను దిగమింగుతూనే మరణించిన వ్యక్తికి సంబంధించిన పేపర్ వర్క్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఒక వ్యక్తి మరణించిన తర్వాత కుటుంబ సభ్యులు ఎంతో దు:ఖానికి లోనవుతారు. అయితే ఆ బాధను దిగమింగుతూనే మరణించిన వ్యక్తికి సంబంధించిన పేపర్ వర్క్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఇన్స్యూరెన్స్ క్లెయిమ్స్ కోసం అప్లై చేయడం కూడా చాలా అవసరం. అయితే చాలామంది మరణించిన వ్యక్తి పేరిట ఉన్న జీవిత బీమా క్లెయిమ్స్ చేస్తుంటారు కానీ.. ఇల్లు, వాహనం, ఆరోగ్య బీమాలపై దృష్టి పెట్టరు. ఈ పాలసీలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ పూర్తి చేయడం ద్వారా వాటిని కుటుంబ సభ్యుల పేర్ల మీదకు మార్చుకోవచ్చు. తద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. దీని కోసంఎలాంటి డాక్యుమెంటేషన్ చేయాలో ఇప్పుడు చూద్దాం..

ఆరోగ్య బీమా

చాలామంది తమతో పాటు తమ కుటుంబ సభ్యులకు కూడా వర్తించేలా ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే అప్పుడు ఏం చేయాలి..? అన్న ప్రశ్న చాలామందికి ఎదురవుతుంటుంది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో ఒక వ్యక్తి మరణిస్తే మిగిలిన కుటుంబ సభ్యులందరికీ ఆ ప్లాన్ వర్తిస్తుంది. పాలసీ రూల్స్ ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించిన ప్రీమియంని కూడా కొన్ని సంస్థలు తిరిగి చెల్లిస్తాయి. అయితే దీనికోసం ఆ వ్యక్తి పేరిట ఎలాంటి హెల్త్ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేసి ఉండకూడదు. ఇన్స్యూర్డ్ మొత్తం అలాగే ఉంటుంది కాబట్టి అది కుటుంబంలోని మిగిలిన వ్యక్తులను ఇన్స్యూరెన్స్ కింద కవర్ చేస్తుంది. పాలసీ మరణించిన వ్యక్తి పేరు మీదే ఉంటే అతడి పేరు మీద నుంచి కుటుంబంలోని మరో వ్యక్తి పేరు మీదకు ఈ ఇన్స్యూరెన్స్ పాలసీని మార్చడం జరుగుతుంది. ఒకవేళ చనిపోయిన వ్యక్తికి ఏవైనా హాస్పిటలైజేషన్స్ బిల్స్ ఉంటే అవి క్లెయిమ్ చేస్తే నామినీలకు ఆ మొత్తం వస్తుంది. వ్యక్తిగత ఆరోగ్య బీమా అయితే వ్యక్తి మరణంతో ఆ పాలసీ ముగిసిపోతుంది.

ఇది చదవండి: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల షెడ్యూల్ విడుదల... ఏ పరీక్ష ఎప్పుడో ఇలా తెలుసుకోండి..


కారు ఇన్స్యూరెన్స్

వ్యక్తిగత బీమా ప్లాన్లలాగే వాహనాల బీమా ప్లాన్లు వ్యక్తి మరణం తర్వాత అక్కడికే పూర్తి అవ్వవు. పాలసీ పూర్తయ్యే తేదీ లేదా వ్యక్తి మరణం తర్వాత మూడు నెలల ఏది ముందైతే అంత వరకు ఆ పాలసీ వర్తిస్తుంది. ఈలోపు ఆ మరణించిన వ్యక్తి చట్టబద్ధమైన వారసులు పాలసీని తమ పేరు మీదకు ట్రాన్స్ ఫర్ చేయాల్సిందిగా దరఖాస్తు చేయవచ్చు. ఇందుకోసం పాలసీ ఉన్న వ్యక్తి డెత్ సర్టిఫికెట్, మీ పేరు మీదకు వాహనం మారినట్లుగా రికార్డులు, ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్లు సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది. నో క్లెయిమ్బోనస్ కూడా వీరి పేరు మీదకే ట్రాన్స్ ఫర్ అవుతుంది. అయితే ఆ వాహనం ఓనర్ షిప్ ముందుగా ఆ వ్యక్తి పేరు మీదకు మార్చాల్సి ఉంటుంది. ఒకవేళ అది వేరే వ్యక్తులకు అమ్మినా సరే.. ఆర్ సీ బుక్, ఇన్స్యూరెన్స్ పాలసీ వంటివి చూపాల్సి ఉంటుంది.

హోమ్ ఇన్స్యూరెన్స్

ఒక వేళ ఇంటి యజమాని.. ఆ ఇంటిపై హోమ్ ఇన్స్యూరెన్స్ తీసుకున్న తర్వాత మరణిస్తే ఆ పాలసీ ఆ ఇంటితో పాటు లీగల్ వారసుల పేరు మీదకు ట్రాన్స్ ఫర్ అవుతుంది. అయితే ఆ వ్యక్తి భాగస్వామి పాలసీని ట్రాన్స్ ఫర్ చేయాల్సిందిగా ఇన్స్యూరెన్స్ సంస్థకు లేఖ రాయాల్సి ఉంటుంది. పాలసీ ట్రాన్స్ ఫర్ అవుతుందా లేదా అన్నది బీమా సంస్థను బట్టి ఆధారపడి ఉంటుంది. పాలసీ చివరి తేదీ వరకు కొనసాగించేలా అగ్రిమెంట్ చేస్తుంది ఆ సంస్థ. ఆ తర్వాత కొత్తగా పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అంతకుముందే క్లెయిమ్ చేసి ఉంటే నామినీకి ఆ డబ్బు చెందుతుంది.

First published:

Tags: Health Insurance, Insurance

ఉత్తమ కథలు