హోమ్ /వార్తలు /Explained /

Explained: బ్లాక్ బాక్స్ అంటే ఏంటి..? హెలికాప్టర్ క్రాష్ మిస్టరీని ఛేదించే పరికరం గురించి పూర్తి వివరాలు ఇవే..

Explained: బ్లాక్ బాక్స్ అంటే ఏంటి..? హెలికాప్టర్ క్రాష్ మిస్టరీని ఛేదించే పరికరం గురించి పూర్తి వివరాలు ఇవే..

బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదస్థలి నుంచి స్వాధీనం చేసుకున్న బ్లాక్ బాక్స్

బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదస్థలి నుంచి స్వాధీనం చేసుకున్న బ్లాక్ బాక్స్

తమిళనాడులోని (Tamilnadu) కూనూర్ సమీపంలో మిలిటరీ హెలికాప్టర్ (Army Helicopter Crash) ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ (Gen Bipin Rawath) ఆకస్మిక మృతి పట్ల యావత్ భారతావని నిర్ఘాంతపోయింది. 13 మంది ఆర్మీ అధికారులను పొట్టన బెట్టుకున్న ఇంతటి ఘోర ప్రమాదం ఎలా జరిగింది..? అని ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి గురి అవుతున్నారు.

ఇంకా చదవండి ...

తమిళనాడులోని (Tamilnadu) కూనూర్ సమీపంలో మిలిటరీ హెలికాప్టర్ (Army Helicopter Crash) ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ (Gen Bipin Rawath) ఆకస్మిక మృతి పట్ల యావత్ భారతావని నిర్ఘాంతపోయింది. 13 మంది ఆర్మీ అధికారులను పొట్టన బెట్టుకున్న ఇంతటి ఘోర ప్రమాదం ఎలా జరిగింది..? అని ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి గురి అవుతున్నారు. ఈ క్రమంలో భారత వైమానిక దళానికి చెందిన అధికారులు హెలికాప్టర్ క్రాష్ అయిన స్థలానికి చేరుకున్నారు. జనరల్ రావత్‌తో సహా 12 మంది అధికారుల మరణానికి దారితీసిన ఈ ప్రమాదానికి గల కారణాన్ని నిర్ధారించడానికి అన్ని సంబంధిత డేటా, సామగ్రిని సేకరిస్తున్నారు. విమానం, హెలికాప్టర్ ప్రమాదాలు జరిగినప్పుడు అత్యంత ముఖ్యమైన వస్తువు బ్లాక్ బాక్స్.

బ్లాక్ బాక్స్ దొరికితేనే.. ప్రమాదానికి గల ప్రధాన కారణాన్ని ఐఏఎఫ్ సాంకేతిక బృందం తెలుసుకోగలుగుతుంది. ఈ నేపథ్యంలో ఫ్లైట్ డేటా రికార్డర్ గా పిలిచే బ్లాక్ బాక్స్ తాజాగా లభ్యమైంది. ప్రమాద స్థలానికి 30 అడుగుల దూరంలోనే ఈ బ్లాక్ బాక్స్ దొరికింది. ఇది విమాన వేగంతో సహా ఎత్తు, కాక్‌ పిట్ సంభాషణలు, గాలి ఒత్తిడి ఇలా 88 ముఖ్యమైన ఫ్యాక్ట్స్ రికార్డ్ చేస్తుంది. క్రాష్ జరిగినప్పుడు, అసలు క్రాష్‌కి కారణమేమిటో అర్థం చేసుకోవడానికి బ్లాక్ బాక్స్ను పరిశీలించడం చాలా ముఖ్యం. మరి ఆ ప్రక్రియ ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది చదవండి: ఆర్మీ హెలికాప్టర్ ఘటనలో తెలుగు జవాన్ మృతి.. చిత్తూరు జిల్లాలో విషాదఛాయలు


బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి..?

పేరు బ్లాక్ బాక్స్ అయినా ఇది నలుపు రంగులో ఉండదు. అలాగే ఇది బాక్స్ ఆకారంలోనూ ఉండదు. బ్లాక్ బాక్స్ నలుపు రంగులో కాకుండా ఎక్కడున్నా కంటికి కనిపించేంత బ్రైట్ ఆరెంజ్ రంగులో ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ పరికరం కంప్రెసర్ ఆకారంలో ఉంటుంది. వాణిజ్య విమానాలు, సాయుధ దళాల విమానాలు హెలికాప్టర్లలో ఉండే ఈ బ్లాక్ బాక్స్ కాక్‌పిట్ సౌండ్స్, డేటా నుంచి క్లూలను భద్రపరుస్తుంది. ఈ క్లూస్ అనేవి భవిష్యత్ ప్రమాదాలను నివారించడంలో బాగా సహాయపడతాయి. బ్లాక్ బాక్స్ లేనిపక్షంలో ప్రమాదాలు ఎలా జరుగుతాయో.. వాటిని ఎలా నివారించాలో తెలియడం చాలా కష్టం. అందుకే వీటిని అన్ని విమానాల్లో ఉంచడం తప్పనిసరి.

ఇది చదవండి: ఉదయం భార్య పిల్లలతో వీడియో కాల్.. ఇంతలో ఊహించని విషాదం.. చివరి మాటలు ఇవే


బ్లాక్ బాక్స్ లోపల ఏం ఉంటుంది..?

ఒక సాధారణ బ్లాక్ బాక్స్ బరువు 10 పౌండ్లు (4.5 కిలోలు) ఉంటుంది. ఇందులో నాలుగు ప్రధాన భాగాలు ఉంటాయి:

- బ్లాక్ బాక్స్ను ఫిక్స్ చేయడానికి.. రికార్డింగ్, ప్లేబ్యాక్‌ ను సులభతరం చేయడానికి ఇందులో ఒక చట్రం లేదా ఇంటర్‌ఫేస్ ఉంటుంది.

- అండర్ వాటర్ లొకేటర్ బెకన్. ఇది నిత్యం ఎలక్ట్రానిక్ పల్స్‌ ను విడుదల చేస్తుంది. తద్వారా నీటిలో మునిగిపోయిన విమానం ఆచూకీని తెలియజేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

- స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా టైటానియంతో తయారు చేసిన కోర్ హౌసింగ్ లేదా 'క్రాష్ సర్వైవబుల్ మెమరీ యూనిట్' ఉంటాయి.

- మెమరీ యూనిట్ లో సర్క్యూట్ బోర్డ్‌ లలో విలువైన రికార్డింగ్ చిప్స్ ఉంటాయి. ఇందులో రెండు రికార్డర్‌లు ఉంటాయి. పైలట్ వాయిస్‌లు లేదా కాక్‌ పిట్ సౌండ్‌ లను రికార్డ్ చేయడానికి కాక్‌ పిట్ వాయిస్ రికార్డర్ (CVR)తో సహా ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR) ఉంటుంది.

ఇది చదవండి: హెలికాఫ్టర్ దుర్ఘటనలో కీలక పరిణామం.. బ్లాక్ బాక్స్ దొరికింది.. వైఎస్ టైంలో ఈ బ్లాక్ బాక్స్‌లో..


రికార్డింగ్‌ ను ఎలా యాక్సెస్ చేస్తారు..?

సాంకేతిక నిపుణులు డేటా కోసం బ్లాక్ బాక్స్ లోని ప్రొటెక్టివ్ మెటీరియల్ ని అత్యంత జాగ్రత్తగా తొలగించి.. కనెక్షన్‌ లను శుభ్రం చేస్తారు. ఆడియో లేదా డేటా ఫైల్ ను డౌన్‌ లోడ్ చేసి, కాపీ చేస్తారు. ఈ డేటాలో ఎలాంటి విషయాలు తెలియవు. కాబట్టి దాన్ని గ్రాఫ్‌లుగా మార్చడానికి ముందు రా-ఫైల్‌ల నుంచి డేటాను డీకోడ్ చేస్తారు. పరిశోధకులు కొన్నిసార్లు "స్పెక్ట్రల్ అనాలిసిస్"ను ఉపయోగిస్తారు. స్పెక్ట్రల్ అనాలిసిస్ ద్వారా చాలా చిన్నగా వినిపించే అలారాలను లేదా పేలుడు జరిగినప్పుడు వినిపించే మొదటి శబ్దాన్ని పరిశీలిస్తారు.

ఇది చదవండి: మహిళలకు పోలీసుల శుభవార్త... రాత్రిళ్లు ఉచిత ప్రయాణం... ఎక్కడంటే..!


డేటా ఎలా ప్రాసెస్ చేస్తారు..?

డేటాను ప్రాసెస్ చేయడానికి రికార్డింగ్ స్టూడియో వంటి లిజనింగ్ రూమ్ ఉంటుంది. ఈ రూమ్ లో ఆడియో మిక్సింగ్, ప్లేబ్యాక్ డివైజ్‌లు అనేవి డేటాను సింక్(sync)లో చూపే ఒక స్క్రీన్‌కి లింక్ అయి ఉంటాయి. నాలుగు ఛానెల్‌లు మనుషుల స్వరాలు, పరిసర శబ్దాలను వేరు చేస్తాయి. ప్రధాన పరిశోధకులు, కొంతమంది వ్యక్తులు మాత్రమే చాలా టేపులను వింటారు. తరువాత వాటికి సీలు వేస్తారు. రికార్డింగ్ చెక్కుచెదరకుండా ఉండేలా సాంకేతిక నిపుణుడు ముందుగా దాన్ని సిద్ధం చేస్తారు. ఫ్రాన్స్‌లో, సిబ్బంది వినికిడి టేపులకు ట్రామా కౌన్సెలింగ్ అందుబాటులో ఉంది.

ఇది చదవండి: ఈ హోటల్లో వెయిటర్స్ ఉండరు.. అందరూ చిట్టీలే..


ఫలితం ఎప్పుడు వస్తుంది..?

పబ్లిక్, మీడియా ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది కావున ప్రమాదానికి కారణాలు అత్యంత త్వరగా చెప్పాల్సి ఉంటుంది. బ్లాక్ బాక్స్ కు జరిగిన నష్టం, ప్రమాద రకాన్ని బట్టి కొంతమంది పరిశోధకులు అసలేం జరిగిందో కొద్ది రోజుల్లో లేదా గంటల్లో అంచనా వేయగలరు. కానీ వారి అంచనాలు ఎల్లప్పుడూ నిజం కాకపోవచ్చు. బ్లాక్ బాక్స్ తిరిగి పొందిన ఒక నెల తర్వాత మధ్యంతర నివేదికలు బయటకు వస్తాయి. ఇవి అంత వివరంగా ఏమి ఉండవు. లోతైన పరిశోధనలు పూర్తి కావడానికి ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. 2010లో ఇథియోపియన్ ఎయిర్‌ లైన్స్ క్రాష్‌ పై లెబనీస్ దర్యాప్తు రెండేళ్లు పట్టింది.

ఇది చదవండి: అంబర్‌గ్రిస్‌ అంటే ఏంటి..? దానికి ఎందుకంత డిమాండ్.. ఫ్లోటింగ్ గోల్డ్ అని ఎందుకు పేరు..?


మోడర్న్ డే బ్లాక్ బాక్స్

పాత మోడల్స్ లో డేటాను రికార్డ్ చేయడానికి మాగ్నెటిక్ టేప్ వైర్, ఫాయిల్ లేదా రీల్స్‌ ఉపయోగించారు. మోడర్న్ వెర్షన్లలో మాత్రం డేటాను రికార్డ్ చేయడానికి 3,400 రెట్లు జి-ఫోర్స్‌లను తట్టుకోగల "క్రాష్-సర్వైవబుల్" కంటైనర్‌లలో స్టోర్ చేసే కంప్యూటర్ చిప్‌లను ఉపయోగిస్తారు.

Published by:Purna Chandra
First published:

Tags: Bipin Rawat, India news

ఉత్తమ కథలు