AP True-up Charges: ఏపీలో కరెంటు బిల్లులు ఎందుకు పెరిగాయి..? ట్రూ అప్ ఛార్జీలు అంటే ఏమిటి..?

ప్రతీకాత్మక చిత్రం

Electricity Bills: 2014 నుంచి 2019 వరకు వాడుకున్న విద్యుత్ కి ట్రూ ఆప్ ఛార్జీల (True-up Charges) పేరిట ప్రజల మీద సుమారు రూ. 3690 కోట్ల అదనపు భారం వేస్తున్నారు. అసలు ట్రూ అప్ ఛార్జీలు అంటే ఏమిటి..? ప్రభుత్వం ప్రజలపై ఎందుకు భారం వేసింది..? ఎన్నాళ్లు ఈ అదనపు ఛార్జీలను భరించాలి..? అనే సందేహాలు చాలా మందికి వస్తున్నాయి.

  • Share this:
    Anna Raghu, Guntur, News18

    True up charges in electricity bill: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొన్ని రోజులుగా ఒకే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఎక్కడ చూసినా.. ఏ నోట విన్నా విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలపై జనం చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం ప్రజల నెత్తిన విద్యుత్ బిల్లుల (Electricity Bills) భారం వేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి అధికార పార్టీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఐతే అసలు ట్రూ అప్ ఛార్జీలు అంటే ఏమిటి..? ప్రభుత్వం ప్రజలపై ఎందుకు భారం వేసింది..? ఎన్నాళ్లు ఈ అదనపు ఛార్జీలను భరించాలి..? అనే సందేహాలు చాలా మందికి వస్తున్నాయి. గతంలో వినియోగించుకున్న విద్యుత్ కు పంపిణీకి సంబంధించి వచ్చిన ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండటంతో ఆ లోటును పూడ్చుకునేందుకు ప్రభుత్వం వినియోగదారుల నుంచి ట్రూ అప్ ఛార్జీలను వసూలు చేస్తోంది.

    2014 నుంచి 2019 వరకు వాడుకున్న విద్యుత్ కి ట్రూ ఆప్ ఛార్జీల పేరిట ప్రజల మీద సుమారు రూ.3,690 కోట్ల అదనపు భారం వేస్తున్నారు. దీనితో పాటు 2019-2020కి మళ్లీ అదనపు ఛార్జీల సర్ధుబాటు కింద మరో రూ.2800 కోట్లు కలిపి మొత్తం రూ.6,400 కోట్ల అదనపు వసూళ్లకు రంగం సిద్ధం చేశారు. అక్కడితో ఆగలేదు. 2021-2022 సంవత్సరానికి ఈ ఏడాది వాడే 45,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ కు ఒక్కో యూనిట్ కి రూ. 2 చొప్పున మరో భారం మోపడం ద్వారా రూ.9,000 కోట్లు ప్రజల మీద పడబోతోంది. మొత్తం కలపి రూ.15,300 కోట్లు.

    ఇది చదవండి: సీబీఐ కోర్టులో జగన్ కు ఊరట.. రఘురామ పిటిషన్ కొట్టివేత


    ప్రజలు కరెంటు వాడకపోయినా.. ఇంట్లో ఫ్యాన్ వేసుకోకపోయినా, ఫ్రిజ్ స్విచ్ ఆన్ చేయకపోయినా, టీవీ చూడకపోయినా రూ.15,300 కోట్లు అదనంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిస్థితి. ఇది ప్రభుత్వం చెబుతున్నట్టు ఈ నెలకో, రానున్న 8 నెలలకో కాదు. దీన్ని ఒక నిరంతర ప్రక్రియగా రాబోయే రెండేళ్లు విద్యుత్ నియంత్రణ మండలి ముసుగులో వసూలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది.

    ఇది చదవండి: ఢిల్లీలో దిశ యాప్ రక్షణ... తెలుగు యువతిని కాపాడిన ఆంధ్రా పోలీసులు...


    ఇప్పుడు వాడుతున్న విద్యుత్‌పై అదనంగా ప్రతి యూనిట్‌కు రూ.1.23 పైసలు (శ్రీకాకుళం నుండి పశ్చిమ గోదావరి జిల్లాల వరకు యూనిట్‌కు 45 పైసల చొప్పున) అదనంగా కలిపి బిల్లులు ఇస్తున్నారు. 2014 సంవత్సరం నుండి 2019 వరకు వాడుకున్న కరెంటుకు అందరూ బిల్లులు చెల్లించేశారు. కానీ విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఇప్పుడు లెక్క చూసుకుని వారికి వచ్చిన ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైందని తేల్చారు. దాన్ని ట్రూ అప్‌ ఛార్జీల పేరిట ప్రజలపై రూ.3,699 కోట్ల భారం వేసింది.

    ఇది చదవండి: మోసాల్లో ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’... వీళ్లను నమ్మితే దిమ్మతిరిగి బొమ్మ కనబడుద్ది..!


    విద్యుత్‌ సంస్థలు చేసే ఖర్చు అంటే సిబ్బంది జీతాలు, పంపిణీ నష్టాలు, బొగ్గు కొనుగోలు ఇతర అవసరాలకు చేసే ఖర్చును ఏపీఈఆర్‌సీ ఆమోదిస్తుంది. ఈ ఖర్చును అనుసరించి విద్యుత్ చార్జీలు నిర్ణయిస్తారు. ఏపీఈఆర్‌సీ ఆమోదించిన అంచనాలకు మించి విద్యుత్ సంస్థకు ఖర్చు చేయాల్సి వస్తే.. ఆ అదనపు వ్యయాన్ని ఏటా ట్రూ అప్‌ చార్జీల పేరిట వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవచ్చు. ఎంతో ఎక్కువ ఖర్చయ్యాయని చెబుతున్న విద్యుత్ సంస్థలు ట్రూ అప్‌ చార్జీల కింద 8 నెలల్లో రూ.3,660 కోట్లు వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించుకున్నాయి.

    ఇది చదవండి: పెన్షన్ దారులకు అలర్ట్... వారం రోజులే డెడ్ లైన్.. లేదంటే పెన్షన్ కట్..


    విద్యుత్‌లో మాత్రం మన ప్రభుత్వాలు ట్రూ అప్‌, సర్దుబాటు చార్జీల పేరుతో అదనంగా ప్రజల నుండి గుంజుతున్నాయి. యూనిట్‌కు రూ.1.23 పైసల అదనపు భారం ఎనిమిది నెలలపాటు మార్చి నెల వరకు ప్రతి నెల చెల్లించాల్సిందే. రూ.1.45 పైసలు స్లాబ్‌ మొదలుకుని పది రూపాయలు వరకు చెల్లించే అందరూ రూ.1.23 పైసలు అదనంగా చెల్లించాలి. దీనివలన 50 యూనిట్ల లోపు వినియోగించే పేదలపై దాదాపు వంద శాతం భారం పడుతుంది. తక్కువ కరెంటు వాడే వారికి ఎక్కువ భారం పడుతుంది. వ్యాపార సంస్థలు, పరిశ్రమలు చెల్లించే అదనపు విద్యుత్‌ ఛార్జీలను వినియోగదారుల నుండి పరోక్షంగా ఆ సంస్థలు వసూలు చేస్తాయి

    ప్రతి ఒక్క కుటుంబంమీద 8 నెలల్లో సగటున 2,500 రూపాయల వరకు భారం పడుతుంది. ఇదే కాకుండా 2019-20 సంవత్సరం జమా, ఖర్చులను లెక్క చూసి మళ్ళీ ఈ సర్దుబాటు చార్జీలు రూ.2,542 కోట్లు చెల్లించాలని నియంత్రణ మండలి ముందు విచారణ జరుగుతోంది. ఏప్రిల్‌ నుండి ఆ భారం జనం నెత్తిన పడుతుంది. త్వరలో ప్రతి 3 నెలలకు ఈ సర్దుబాటు చార్జీల భారం పడుతుంది. ఈ అదనపు భారం శాశ్వతంగా కొనసాగే అవకాశాలున్నాయి.

    ఐతే ప్రజలపై అదనపు భారం పడటానికి గత ప్రభుత్వమే కారణమని వైసీపీ ఆరోపిస్తోంది. విద్యుత్ సంస్ధలు వసూలు చేయాలని నిర్ణయించిన ట్రూఅప్ ఛార్జీల విధింపునకు మాజీ సీఎంచంద్రబాబు అవలంభించిన విధానాలే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు అస్తవ్యస్త విధానాల కారణంగా విద్యుత్ సంస్ధలు నష్టాలలో కూరుకుపోయాయని ఆరోపించారాయన. వాటిని అధగమించి ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న తమ ప్రభుత్వానిదేనని చెప్పారు.
    Published by:Purna Chandra
    First published: