Joint Bank FD: జాయింట్ ఎఫ్.డీని ఒకే వ్యక్తి విత్ డ్రా చేసుకోవచ్చా..? తాజా నిబంధనలు తెలుసుకోండి

ప్రతీకాత్మకచిత్రం

రిస్క్ లేని పెట్టుబడి మార్గం ఏదైనా ఉందంటే అది ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed Deposite) మాత్రమే. ఎఫ్.డీలో పెట్టుబడి ద్వారా అధిక వడ్డీతో పాటు టాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు.

  • Share this:
రిస్క్ లేని పెట్టుబడి మార్గం ఏదైనా ఉందంటే అది ఫిక్స్డ్ డిపాజిట్ మాత్రమే. ఎఫ్.డీలో పెట్టుబడి ద్వారా అధిక వడ్డీతో పాటు టాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. అందుకే సీనియర్ సిటిజన్లు ఎఫ్.డీల్లో పెట్టుబడికి ఆసక్తి చూపిస్తుంటారు. ఎఫ్.డీల్లో సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ ద్వారా రెండు మార్గాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. సింగిల్ అకౌంట్ అయితే గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు, జాయింట్ అకౌంట్ అయితే రూ.9 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. జాయింట్ అకౌంట్లోని మొత్తం అమౌంట్ను ఒకే వ్యక్తి ముందస్తుగా విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఉండదు. అయితే తాజాగా కొన్ని బ్యాంకులు జాయింట్ అకౌంట్ల ఎఫ్డీ విత్ డ్రాకు సంబంధించిన నిబంధనలను సడలించాయి. జాయింట్ ఎఫ్.డీలో రెండో వ్యక్తి అందుబాటులో లేనప్పటికీ మొదటి వ్యక్తి విత్డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. ఈ విషయంపై ఏ బ్యాంకు ఎలా వ్యవహరిస్తుందో చూద్దాం.

ఐసిఐసిఐ బ్యాంక్
ఐసిఐసిఐ బ్యాంక్ జాయింట్ అకౌంట్ ఎఫ్డీ విషయంలో సింగిల్ హోల్డర్‌ని ముందస్తు విత్డ్రాకు అనుమతిస్తుంది. అయితే దీని కోసం ఖాతా తెరిచే సమయంలోనే ఇద్దరు హోల్డర్లు సంతకం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బ్యాంక్లో ఈ ఫారాన్ని సమర్పించాలి.

యాక్సిస్ బ్యాంక్
జాయింట్ ఎఫ్.డీ హోల్డర్లు ఇద్దరూ ముందస్తు విత్డ్రాకు సమ్మతిస్తున్నట్లు బ్యాంకుకు లిఖిత పూర్వకంగా తెలియజేస్తే.. సింగిల్ హోల్డర్ కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. ఎఫ్.డీ ఆపరేటింగ్ సూచనల ప్రకారం, ఈ కొత్త సడలింపు ఇస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్ పేర్కొంది. ఈ లిఖిత పూర్వక సమ్మతిని జాయింట్ ఎఫ్.డీ అకౌంట్ తెరిచే సమయంలో లేదా అమౌంట్ విత్ డ్రా చేసుకునే సమయంలో ఎప్పుడైనా బ్యాంకులో ఇవ్వవచ్చు.

ఇండస్‌ ఇండ్ బ్యాంక్
జాయింట్ ఎఫ్‌.డీలోని అమౌంట్ ను సింగిల్ అకౌంట్ హోల్డర్‌ ముందుగానే విత్ డ్రా చేసుకునేందుకు ఇండస్ ఇండ్ బ్యాంక్ అనుమతిస్తుంది. ఎఫ్.డీ అకౌంట్ ఓపెనింగ్ అప్లికేషన్ ఫారమ్లోనే ఈ విషయాన్ని పేర్కొంది.

హెచ్‌.డీ.ఎఫ్‌.సీ బ్యాంక్
హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంక్ కూడా జాయింట్ అకౌంట్ విత్డ్రా నిబంధనలను మార్చింది. ఇకపై జాయింట్ అకౌంట్లోని ఎఫ్‌డి అమౌంట్ ను సింగిల్ హోల్డర్ కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెనింగ్ ఫారమ్‌ లోనే ఈ విషయాన్ని పేర్కొంది. అయితే హెచ్‌డీఎఫ్‌సీ అధికారిక వెబ్ సైట్లో మాత్రం దీన్ని పొందుపర్చలేదు.

అన్ని బ్యాంకుల్లో లేని ఫీచర్..
అనేక ప్రముఖ బ్యాంకులు ఈ ముందస్తు విత్ డ్రా ఫీచర్‌ను అందిస్తున్నప్పటికీ.. కొన్ని బ్యాంకుల్లో మాత్రం ఈ సదుపాయం లేదు. ఉదాహరణకు, ఫెడరల్ బ్యాంక్ జాయింట్ ఎఫ్డీ హోల్డర్లకు ఈ అవకాశం ఉండదు. ఈ బ్యాంకు సింగిల్ హోల్డర్ను జాయింట్ ఎఫ్.డీలోని అమౌంట్ను ముందస్తు విత్డ్రా చేసుకునేందుకు అనుమతించదు. ఇద్దరిలో ఎవరైనా మరణించి ఉంటే అటువంటి సందర్భంలో అనుమతిస్తామని, లేదంటే కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలని ఫెడరల్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ & సర్వీస్ క్వాలిటీ హెడ్ ఎం. శోభ పేర్కొన్నారు.
Published by:Purna Chandra
First published: