Heart Attack: ఆ రోజు జాగ్రత్తగా ఉండండి.. గుండెపోటు వచ్చే ముప్పు.. ఎందుకంటే..

ప్రతీకాత్మక చిత్రం

Heart Attack: 1,56,000 మందిపై సర్వే నిర్వహించిన స్వీడిష్ రిజిస్ట్రీ అధ్యయనం ప్రకారం చాలా మందికి గుండె పోటు సోమవారం వచ్చే అవకాశముందని తేలింది.

  • Share this:
గుండె పోటు ఈ రోజుల్లో ఎక్కువ మందికి వస్తున్న జబ్బు. ఇది ఎప్పుడు వస్తుందో పసిగట్టడం చాలా కష్టం. హార్ట్ ఎటాక్ వచ్చేందుకు అనియంత్రింత ఆహార నియమాలు, మానసిక ఒత్తిడి, అధిక కొవ్వు ఇలా చాలా కారణాలు ఉన్నాయి. ఒక్కసారి గుండె పోటు వచ్చిందంటే వెంటనే ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్యసేవలను అందించాల్సి ఉంటుంది. అయితే గుండెపోటు రావడానికి చాలా ముందుగానే దాని లక్షణాలు పసిగట్టవచ్చు. కాకపోతే వాటిని చాలా మంది పెద్దగా పరిగణనలోకి తీసుకోరు. అయితే ఇటీవల శాస్త్రవేత్తలు హార్ట్ ఎటాక్ వచ్చేందుకు ఎక్కువ అవకాశముండే ఒక రోజును విజయవంతంగా గుర్తించారు. గుండె పోటు ఎక్కువగా సోమవారం వస్తుందని తేల్చారు.

సోమవారమే ఎందుకు వస్తుంది?
వారానికి ప్రారంభమైన సోమవారాన్ని అత్యంత ఒత్తిడితో కూడిన రోజుల్లో ఒకటిగా పరిగణిస్తారు. పని ఒత్తిడి, ఆందోళన, సమావేశాలు.. ఇలా ఒకటేమిటి దాదాపు అన్ని ముఖ్యమైన విషయాలు సోమవారంతోనే ప్రారంభమయ్యే అవకాశమెక్కువ. కాబట్టి ఈ ఆందోళన వల్లే గుండె పోటు వచ్చే అవకాశముంది. అంతేకాకుండా వారంతాల్లో ఉల్లాసంగా గడపడం వల్ల సోమవారం చాలా బద్దకంగా ఉంటుంది. ఈ విధంగా ఒత్తిడికి కారణమవుతుంది. అయితే శాస్త్రవేత్తలు సోమవారం భయానికి మరో కారణం కూడా ఉందని తెలిపారు.

పరిశోధకుల అధ్యయనం:
1,56,000 మందిపై సర్వే నిర్వహించిన స్వీడిష్ రిజిస్ట్రీ అధ్యయనం ప్రకారం చాలా మందికి గుండె పోటు సోమవారం వచ్చే అవకాశముందని తేలింది. 2006 నుంచి 2013 వరకు జాతీయ నాణ్యత రిజిస్ట్రీ SWEEDHEARTలో నమోదు చేసిన మయో కార్డియల్ ఇన్ఫార్క్షన్స్(హార్ట్ ఎటాక్స్)పై స్వీడన్ ఆసుపత్రుల నుంచి సేకరించిన డేటాను స్విడీష్ వర్సిటీ పరిశోధకులు పరిశీలించారు. అమెరికన్ హార్ట్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయన ఫలితాల ప్రకారం ఓ వ్యక్తి అధిక ఒత్తిడికి గురైనప్పుడు గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయని తేలింది. అంతేకాకుండా మిగతా రోజుల కన్నా సోమవారాల్లో హార్ట్ ఎటాక్ రేటు ఎక్కువగా ఉందని స్పష్టంగా సూచించింది. వారాంతాల్లో, శీతాకాలం, వేసవి కాలం సెలవుల్లో గుండె పోటు వచ్చే అవకాశం తక్కువని స్పష్టం చేసింది.

వారాంతాల్లో రక్తపోటు అదుపులో రక్తపోటు:
దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల భావోద్వేగాలతో అనుసంధానమైన ఉన్న మెదడులోని ఓ ప్రదేశంలో కార్యకలాపాలను పెంచుతుంది. ఫలితంగా గుండె, ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధుల అభివృద్ధికి దారితీస్తుంది.అదే వారాంతాల విషయాలనికొస్తే మనం ఉల్లాసంగా, ప్రశాంతంగా ఉంటాం. ఫలితంగా మన రక్తపోటు అదుపులో ఉంటుంది. హృదయ స్పందన రేటు సాధారణంగా ఉంటుంది. మయోకార్డియల్ ఇన్ఫార్షన్స్ రేట్ల వ్యత్యాసాలకు కారణమయ్యే అంశాల్లో ఒత్తిడి ముఖ్యమైంది. ఉష్ణోగ్రత లాంటి ఇతర అంశాలు కూడా హృదయ స్పందన రేటును మారుస్తాయి. మానసిక స్థితులు కూడా జీవ వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. ఇవి గుండెపోటుకు దారితీస్తాయి.

హార్ట్ ఎటాక్స్ పై మునుపటి అధ్యయనాలు పలు విధాలుగా చెప్పాయి. భూకంపాలు, ఫుట్ బాల్ ప్రపంచ కప్ లాంటి అధిక ఒత్తిడికి గురయ్యే సంఘటనలు జరుగుతున్నప్పుడు గుండెపోటు వచ్చే అవకాశముందని సూచించాయి. అంతేకాకుండా వీటితో సమానంగా ఒత్తిడితో కూడిన రోజుగా పరిగణించే సోమవారం కూడా గుండెపై ఇదే విధమైన ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు.

ఒత్తిడి నియంత్రిస్తే చాలు:
గుండెపోటు రావడానికి వివిధ కారణాలు ఉన్నాయి. ఒత్తిడి వీటిలో ప్రధానమైంది. అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, ఊబకాయం, డయాబెటిస్ లాంటి జబ్బులు గుండెపోటుకు దారితీసే ఇతర కారకాలు. వారం ప్రారంభానికి ముందే ప్రణాళిక వేసుకుని వ్యాయామం, భ్రీథింగ్ ఎక్సర్సైజులు చేస్తే ఒత్తిడిని నియంత్రించవచ్చు. ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Published by:Shiva Kumar Addula
First published: