Hair Loss: జుట్టు ఊడి బట్టతల వస్తోందా? అద్భుతమైన వంటింటి చిట్కా.. ఇలా చేయండి

ప్రతీకాత్మక చిత్రం

Health Tips: కాఫీలో ఉండే కెఫీన్​ అనే రసాయనం జుట్టు వేగంగా పెరగడానికి, బలంగా మారడానికి సహాయపడుతుందని, తద్వారా పొడవైన, ఒత్తైన జుట్టు వస్తుందని అధ్యయనం వెల్లడించింది.

  • Share this:
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. పాతికేళ్ల వయసులోనే జట్టు ఊడిపోయి బట్టతలతో ఇబ్బంది పడుతున్నారు. మానసిక ఒత్తిళ్లు, చెడు ఆహారపు అలవాట్లు, గంటల కొద్ది స్మార్ట్​ఫోన్ల వినియోగం వంటివి దీనికి కారణం కావచ్చు. ఏదేమైనప్పటికీ, ఈ సమస్యకు చెక్​ పెట్టేందుకు మార్కెట్​లో దొరికే ఉత్పత్తులు​ అన్నీ వాడేస్తుంటారు చాలా మంది. అయినా, ఫలితం లేక విసుగు చెందుతుంటారు. అయితే, ఇటువంటి వారికి ఇది గుడ్​ న్యూస్​ అనే చెప్పాలి. ఎందుకంటే, మనం తీసుకునే కాఫీలో ఉండే కెఫీన్​ అనే రసాయనం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది.

తలకు కాఫీని అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం సమస్య తగ్గుతుందని, తిరిగి ఒత్తైన జుట్టు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. కాఫీలో ఉండే కెఫీన్​ అనే రసాయనం జుట్టు వేగంగా పెరగడానికి, బలంగా మారడానికి సహాయపడుతుందని, తద్వారా పొడవైన, ఒత్తైన జుట్టు వస్తుందని అధ్యయనం తెలిపింది. మగవారి బట్టతల విషయంలో, సెక్స్ హార్మోన్ డైహైడ్రోటెస్టోస్టెరాన్ (డిహెచ్‌టి) జుట్టు కుదుళ్లను దెబ్బతీసినప్పుడు సాధారణంగా ఈ జుట్టు రాలడం అనే సమస్య తలెత్తుతుందనే విషయం తెలిసిందే. డీహెచ్‌టీ ఉన్న ఆడవారిలో కూడా ఈ సమస్య అధికంగా కన్పిస్తుంది. వారిలో, మొదట్లో జుట్టు కుదుళ్లు బలహీన పడి, చివరికి ఇది బట్టతలకు దారితీస్తుంది.

జుట్టు రాలే సమస్యకు చెక్​ పెట్టేందుకు జరిగిన పరిశోధన ఫలితాలపై అధ్యయనవేత్తలు మాట్లాడుతూ “జుట్టు పెరుగుదలపై టెస్టోస్టెరాన్, కెఫీన్​ల ప్రభావాన్ని పరిశీలించగా.. కెఫీన్ మాత్రమే హెయిర్ ఫోలికల్ పెరుగుదలను గణనీయంగా ప్రేరేపించిందని మా అధ్యయనంలో తేలింది. స్కిన్ ఫార్మకాలజీ అండ్ ఫిజియాలజీలో ప్రచురితమైన మరొక అధ్యయనంలో కూడా ఇదే విషయం స్పష్టమైంది." అని వారు పేర్కొన్నారు. కాగా, జుట్టు పెరుగుదలను కెఫీన్​ ఎలా ప్రేరేపించేదనే అంశంపై మాత్రం అధ్యయనం స్పష్టతనివ్వలేదు.

జుట్టు కుదుళ్లను బలంగా మార్చే కెఫీన్​:
పరిశోధకులు ఆరు నెలల పాటు కెఫీన్, మినోక్సిడిల్ ద్రావణాల​తో అధ్యయనం నిర్వహించారు. ఆరు నెలల తరువాత అనాజెన్ వెంట్రుకల నిష్పత్తిలో మార్పును గమనించారు. అనాజెన్ అనేది హెయిర్ ఫోలికల్స్​లో చురుకైన పెరుగుదల దశ. ఈ దశలో జుట్టు మూలాలు వేగంగా వృద్ధి చెందుతాయి. ఇది జుట్టును బలంగా, పొడవుగా మారుస్తుంది. అయితే, మినోక్సిడిల్ ద్రావణాన్ని జుట్టుపై ఉపయోగించగా.. 11.68 శాతం అనాజెన్ నిష్పత్తిలో మెరుగుదల కనిపించింది. కాగా, కెఫీన్ ద్రావణాన్ని ఉపయోగించగా 10.59 శాతం అనాజెన్ మెరుగుదల కన్పించింది. అయితే, ఆండ్రోజెనెటిక్ అలోపేసియా ఉన్న పురుషులలో కెఫీన్ ద్రావణం సరైన ఫలితాలను ఇవ్వలేదు.

అంతేకాక, మినోక్సిడిల్ తీసుకోవడం అనేది అందరికీ సురక్షితం కాదని, దీని ప్రభావం వ్యక్తిని బట్టి మారుతుందని అధ్యయనం పేర్కొంది. ఏదేమైనప్పటికీ, కాఫీ తాగేందుకే కాదు.. జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగించవచ్చని అధ్యయనం స్పష్టం చేసింది.
Published by:Shiva Kumar Addula
First published: