హోమ్ /వార్తలు /Explained /

Russia New Plan: మరో మాస్టర్ ప్లాన్ లో రష్యా.. ఉక్రెయిన్‌ ప్రజలకు ఆ కష్టాలు తప్పవా..?

Russia New Plan: మరో మాస్టర్ ప్లాన్ లో రష్యా.. ఉక్రెయిన్‌ ప్రజలకు ఆ కష్టాలు తప్పవా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యుద్ధం ప్రారంభ దశలలో ఉక్రెయిన్‌లో ఎదురుదెబ్బలతో యుద్దభూమి వ్యూహాలను మార్చాల్సిన స్థితికి రష్యా చేరింది. ఉక్రెయిన్‌ నగరాలపై దాడులు సిరియా యుద్ధంలో రష్యా "ప్లేబుక్"ను గుర్తుకు తెస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

యుద్ధం ప్రారంభ దశలలో ఉక్రెయిన్‌లో(Ukraine) ఎదురుదెబ్బలతో యుద్దభూమి వ్యూహాలను మార్చాల్సిన స్థితికి రష్యా చేరింది. ఉక్రెయిన్‌ నగరాలపై దాడులు సిరియా(Serai) యుద్ధంలో రష్యా(Russia) "ప్లేబుక్"ను గుర్తుకు తెస్తున్నాయని నిపుణులు అంటున్నారు. పశ్చిమ దేశాలు సపోర్ట్‌ చేస్తున్న తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా అధ్యక్షుడు అసద్ పాలనకు సహాయం చేయడానికి 2015లో సిరియాకు తన సైన్యాన్ని రష్యా పంపింది. తిరుగుబాటుదారుల నుంచి నగరాలను స్వాధీనం చేసుకునేందుకు, అసద్‌కు సహాయం చేయడానికి నగరాలను ముట్టడించిందని, పౌరుల నివాసాలపై దాడులు చేసిందని మాస్కోపై ఆరోపణలు వచ్చాయి. 2016 డిసెంబర్ లో రష్యా మందుగుండు సామగ్రి సహాయంతో అలెప్పోను అసద్ బలగాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతాలలో పౌరులు, ఫైటర్స్‌ కోసం "సేఫ్ కారిడార్లు" అవసరం అయ్యాయి.

Ukraine-Russia: ఉక్రెయిన్‌ యుద్ధంలో పుతిన్ తన లక్ష్యాలను సాధిస్తున్నారా..?యుద్ధం ముగినట్లేనా..?


మరియూపోల్, చెర్నిహివ్, ఖార్కివ్ వంటి ఉక్రెయిన్‌ నగరాల ముట్టడిలో ఆ వ్యూహాలు కనిపించాయని నిపుణులు అంటున్నారు. తూర్పు ఉక్రెయిన్‌ నగరంపై వారాల తరబడి బాంబులు కురిపించిన తర్వాత సెవెరోడోనెట్స్క్‌ను కూడా రష్యన్ దళాలు మూసివేస్తున్నాయి. నగరం 90 శాతం ధ్వంసమైందని, సెవెరోడోనెట్స్క్ నుంచి వెళ్ళే అవకాశం లేదని లుహాన్స్క్ గవర్నర్ చెప్పాడు. రష్యా బాంబు దాడి కారణంగా నగరంలోని ఒక పారిశ్రామిక కేంద్రం నుంచి విషపూరిత నైట్రిక్ యాసిడ్ లీక్ అయింది. ఉక్రెయిన్‌లో సిరియా యుద్ధంలో రష్యా పరీక్షించిన ఆయుధాలను వినియోగించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో వినియోగానికి సిరియా నుంచి బారెల్ బాంబుల నిపుణులను కూడా రష్యా తరలించింది.

పౌరులపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారా.. ?

ఉక్రెయిన్, సిరియా యుద్ధాలలో రష్యా చర్యల మధ్య సారూప్యతలు ఉన్నాయని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి హక్కుల సంఘాలు అన్నాయి. ఉక్రెయిన్‌లో సిరియా ఘటనలు పునరావృతమవుతున్నాయని, పౌర మౌలిక సదుపాయాలపై ఉద్దేశపూర్వక దాడుల మధ్యలో ఉన్నామని అమ్నెస్టీ సెక్రటరీ జనరల్ ఆగ్నెస్ కల్లామర్డ్ చెప్పారు. సిరియా, చెచ్న్యాలో రష్యా ఒకే తరహా వ్యూహాలను ఉపయోగించినట్లు ఉక్రెయిన్‌లోని పరిశోధకులు డాక్యుమెంట్ చేశారని అమ్నెస్టీ పేర్కొంది. వీటిలో పౌరులపై దాడులు, అంతర్జాతీయ చట్టం ప్రకారం నిషేధించిన ఆయుధాల వినియోగం కూడా భాగం. సిరియా దాడులపై స్పందనను గుర్తు చేస్తూ ఉక్రెయిన్‌లో "యుద్ధ నేరాల" ఆరోపణలను పాశ్చాత్య ప్రచారంగా రష్యా తోసిపుచ్చింది. బదులుగా ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లలో తమ చర్యలను "ఆత్మపరిశీలన" చేసుకోమని యూఎస్‌, దాని మిత్రదేశాలను క్రెమ్లిన్ అధికారులు కోరారు.

Explained: ప్రభుత్వానికి RBI ట్రాన్స్‌ఫర్ చేసే డివిడెండ్‌లో భారీ తగ్గుదల.. ఈ డివిడెండ్ ఎందుకు తగ్గుతోంది..?


పుతిన్ ప్రణాళికలో శరణార్థుల సంక్షోభం భాగమా.. ?

అసద్ బలగాలకు అనుకూలంగా సిరియాలో యుద్ధ నిర్వహణ వ్యూహంగా రష్యా "డి-ఎస్కలేషన్ జోన్‌లను" మధ్యవర్తిత్వం చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. అప్పటి నుంచి సిరియన్ సైన్యం, రష్యన్ మద్దతుదారులు ఏకకాలంలో అనేక లక్ష్యాలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు, క్రమంగా డి-ఎస్కలేషన్ జోన్‌లను ఎత్తివేసి, వాటిని ఒక్కొక్కటిగా తొలగించారని జియోపొలిటికల్ మానిటర్ రెనే టెబెల్ పర్కొంది. డాన్‌బాస్‌ను రష్యా పూర్తిగా చుట్టుముట్టడానికి ముందు ఉక్రెయిన్‌ కోటలను లక్ష్యం చేసుకుందని విశ్లేషకలు చెబుతున్నారు.

ఉక్రెయిన్‌ దళాలు సాధ్యమైనంత ఎక్కువ కాలం పాటు అడ్డుకోవడంతో రష్యాకు అదనపు దళాలు అవసరం. ఇప్పుడు యుద్ధంలో ఉక్రెయిన్ శరణార్థుల సంక్షోభాన్ని రష్యా సృష్టించడం సిరియా వ్యూహమని కొందరు నిపుణులు చెబుతున్నారు. సిరియా యుద్ధానికి ముందు ఉన్న జనాభాలో సగానికి పైగా సివిల్‌ వార్‌ కారణంగా స్థానభ్రంశం చెందారని, అసద్ దళాలు భూభాగాన్ని తిరిగి పొందేందుకు వీలు కల్పించిందని నిపుణులు చెబుతున్నారు.

First published:

Tags: Explained, Russia-Ukraine War, Ukraine

ఉత్తమ కథలు