Home /News /explained /

GYANVAPI MASJID CASE SC DIRECTS VARANASI DM TO ENSURE PROTECTION OF AREA AROUND SHIVLING THESE ACT MAY PLAY KEY ROLE SK

Gyanvapi Masjid Case: జ్ఞానవాపి మసీదులో శివలింగం.. ఆ చట్టమే ఇప్పుడు ఎంతో కీలకం? నెక్ట్స్ ఏం జరగబోతోంది?

జ్ఞానవాపి మసీదు

జ్ఞానవాపి మసీదు

Gyanvapi Masjid case: సుప్రీంకోర్టులో మసీదు కమిటీ పదే పదే 'ప్రార్థనా స్థలాల చట్టం 1990'ని ప్రస్తావించింది. ట్రయల్ కోర్టు తీర్పు ఈ చట్టాన్ని ఉల్లంఘించిందని వాదించింది. అందువల్ల ఈ కేసులో ప్రార్థనా స్థలాల చట్టం 1990 కీలక కానుంది.

    వారణాసిలోని జ్ఞానవాపి మసీదు (Gyanvapi Masjid) ప్రాంగణంలో శివలింగం లభ్యమైన వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హిందూ సంఘాల పిటిషన్లతో శివలింగం లభించిన ప్రాంతాన్ని సీల్ చేయాలని వారణాసి సిటీ సివిల్ కోర్టు ఆదేశించడం.. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టుకెక్కడంతో.. మరింత హాట్ టాపిక్‌గా మారింది. జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు (Supreme Court).. కీలక ఆదేశాలు జారీచేసింది. వారణాసి ట్రయల్ కోర్టు (Varanasi Trial court_లో విచారణ ముగిసే వరకు వేచి చూద్దామని స్పష్టం చేసింది. శివలింగం లభించిన ప్రాంతానికి రక్షణ కల్పించాలని వారణాసి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్‌ను ఆదేశించింది. అదే సమయంలో జ్ఞానవాపి మసీదులో ముస్లింలు నమాజు చేసుకునేందుకు అనుమతించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 19కి వాయిదా వేసింది.

    జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందూ ఆలయాలు ఉన్నట్లు హిందూ సంఘాలు వేసిన పిటిషన్‌పై విచారించిన వారణాసి సిటీ సివిల్ కోర్టు.. అక్కడ వీడియోగ్రఫీ సర్వే (Jyanavapi masjid videography survey)చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు సర్వే బృందం మూడు రోజుల పాటు సర్వే చేసింది. అక్కడ శివలింగం దొరికిందని వార్తలు రావడంతో..ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని ఆదేశించింది. ఇక ఆ సర్వే రిపోర్టును మే 17న కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఐతే ఆ లోపే సర్వే రిపోర్టు మీడియాకు లీకైందన్న ఆరోపణలతో అడ్వకేట్ కమిషనర్ అజయ్ మిశ్రా (Ajay Mishra)ను తొలగించింది. ఈ నేపథ్యంలో సర్వే రిపోర్టును ఇద్దరు సర్వేయర్లు కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఐతే రిపోర్టుకు సమర్పించేందుకు మరో రెండు రోజు సమయం ఇవ్వాలని వారు కోరారు. పూర్తి రిపోర్టు అందిన తర్వాత . . విచారణ అనంతరం తదుపరి తీర్పును వెలువరించనుంది.

    Talent: శభాష్ ఆత్రేయ.. ఐదేళ్లకే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్.. బాలిక ట్యాలెంట్ ఏంటో తెలుసా..?

    ఐతే ఆలోపే అంజుమాన్ ఇంతెజామియా మసీదు మేనేజ్‌మెంట్ కమిటీ (Anjuman intezamia masjid committee) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వారణాసి సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేసింది. ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే విధించాలని.. మసీదులో యథాతధ స్థితిని కొనసాగించాలని మసీదు కమిటీ తరపున సీనియర్ అడ్వకేట్ అహ్మదీ వాదనలు వినిపించారు. ఆ పిటిషన్‌పై విచారించినసుప్రీంకోర్టు.. సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులను నిలిపివేసింది. ముస్లింలు అక్కడ నమోదు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది. అదే సమయంలో శివలింగం దొరికిన ప్రాంతానికి రక్షణ కల్పించాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో మసీదు కమిటీ పదే పదే 'ప్రార్థనా స్థలాల చట్టం 1990'ని ప్రస్తావించింది. ట్రయల్ కోర్టు తీర్పు ఈ చట్టాన్ని ఉల్లంఘించిందని వాదించింది. అందువల్ల ఈ కేసులో ప్రార్థనా స్థలాల చట్టం 1990 కీలక కానుంది.

    అసలేంటీ ప్రార్థనా స్థలాల చట్టం-1990 (Places of Worship Act 1991) ?
    1990లో అయోధ్య రామమందిర ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం అప్పట్లోనే ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. అదే ప్రార్థనా స్థలాల చట్టం ( Places of Worship Act 1991). అయోధ్య వివాదం నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా అనేక మత స్థలాల వివాదం పెరిగే అవకాశం ఉందని.. దీంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని భావించని అప్పటి ప్రభుత్వం... దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం 1991 జూలై 11న ప్రార్థనా స్థలాల చట్టం 1991ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం.. 1947 ఆగస్టు 15న ఏదైనా ప్రార్థనా స్థలం, దాన్ని అనుబంధం సంఘం ఎక్కడ ఎలాంటి స్థితిలో ఉందో.. భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది. ఐతే అప్పట్లో అయోధ్య వ్యవహారం హైకోర్టులో ఉన్నందున.. అయోధ్య వివాదాన్ని మాత్రం ఈ చట్టానికి దూరంగా ఉంచారు..

    Chitrakoot: శ్రీవారి విగ్రహాలు దొంగిలించాక భయానక పీడకలలు.. ఔరంగజేబు కట్టించిన ఏకైక ఆలయం!!

    కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చిన తర్వాత పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ చివరకు పార్లమెంట్ ఆమోదం పొంది అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత 2019 నవంబర్‌లో రామ మందిర వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఆ తీర్పులో ప్రార్థనా స్థలాల చట్టాన్ని కూడా ప్రస్తావించారు. ఆ సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అయోధ్య వివాదంపై తీర్పును వెలువరిస్తూ.. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టంలో ప్రకారం.. ఆగస్టు 15, 1947 న ఏ ప్రార్థనా స్థలాలు ఎక్కడైతో ఉన్నాయో.. భవిష్యత్‌లో కూడా యధాతథంగా కొనసాగుతాయని చెప్పారు. అందులో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కాశీ, మధురలకు సంబంధించి యథాతథ స్థితి కొనసాగుతుందని గొగోయ్ తన నిర్ణయంలో స్పష్టంగా చెప్పారు.

    దేశంలో ఇకపై ఏ ప్రార్థనా స్థలంపైనా వివాదాలకు దేశం సిద్ధంగా లేదని.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘ్‌ డైరెక్టర్‌ మోహన్‌ భగవత్‌ కూడా స్పష్టం చేశారు. ఇప్పుడు దేశంలో విభేదాలు, విద్వేషాలకు తావులేదని.. నవ భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధాని తన ప్రకటనలో పేర్కొన్నారు. కానీ అయోధ్య వివాదంపై తీర్పు (Ayodhya Verdict) వెలువడిన తర్వాత.. దేశవ్యాప్తంగా దాదాపు 100 దేవాలయాల భూమిపై వివాదం తలెత్తింది. ప్రార్థనా స్థలాల చట్టాన్ని.. బీజేపీ నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ చట్టం హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులకు రాజ్యాంగ హక్కులను దూరం చేస్తుందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. హిందూ ప్రార్థనాల స్థలాలు, పుణ్యక్షేత్రాలు విదేశీ ఆక్రమణదారుల చేతిలో ధ్వంసమయ్యాయని.. వాటిని పునరుద్ధరించేందుకు ఉన్న మార్గాలను ఈ చట్టం మూసివేస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు.

    Book Launch: ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌పై సరికొత్త పుస్తకం.. ఆవిష్కరించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి..

    ముఖ్యంగా 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టంలో ఉన్న 2, 3, 4 సెక్షన్‌లను అశ్విని ఉపాధ్యాయ్ మరోసారి సవాల్ చేశారు. సెక్షన్ 4లోని సబ్ సెక్షన్ 3 ప్రకారం.. ఈ చట్టం పురాతన, చారిత్రక ప్రదేశాలకు వర్తించదని ఆయన వాదించారు. ఈ చట్టంలో పురాతన స్థలాల నిర్వచనం కూడా ఇచ్చారని.. ఏదైనా నిర్మాణం 100 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లయితే, అది పురాతనమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నియమం ప్రకారం .. కొంతమంది నిపుణులు మధుర, కాశీ ఆలయాలు ఈ చట్టం పరిధిలోకి రావని అంటున్నారు. ఇప్పుడు బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ దీనినే హైలైట్ చేస్తున్నారు. పురాతన స్థలాలకు సంబంధించిన ఈ నిర్వచనాన్ని 'ప్రార్థనా స్థలాల చట్టం 1991' ప్రకారం సుప్రీం కోర్టులో రుజువు చేస్తే... కాశీ, మధురలు ఈ చట్ట పరిధిలోకి రావని అంటున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటివి 100కు పైగా మతపరమైన ప్రదేశాలు ఉన్నాయని.. వాటన్నింటినీ ఔరంగజేబు హయాంలో కూల్చివేశారని.. ఇప్పుడు వాటన్నింటినీ యథాతధ రూపంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Gyanvapi Masjid case, Varanasi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు