Home /News /explained /

GREEN FIXED DEPOSITS WHAT IS GREEN FIXED DEPOSIT FULL DETAILS ABOUT THE IMPORTANCE AND BENEFITS OF THESE GH VB

Green FDs: గ్రీన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు అంటే ఏంటి..? వీటి ప్రాధాన్యం, ప్రయోజనాల గురించి పూర్తి వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కార్బన్ ఉద్గారాల నివారణకు ఇప్పటికే అనేక పరిష్కారాలను నిపుణులు ప్రతిపాదించారు. వీటిలో ఒకటి గ్రీన్ డిపాజిట్ల రాక. ఇవి ఎకో-ఫ్రెండ్లీ ప్రాజెక్టుల్లో తమ డబ్బును పార్క్ చేయడానికి ఆసక్తి ఉన్న సంస్థలకు ఆర్థిక సంస్థలు, రుణదాతలు అందించే ఫిక్స్డ్ టర్మ్ డిపాజిట్లు.

ఇంకా చదవండి ...
ఆదిల్ శెట్టి, CEO, BANKBAZAAR.com

వాతావరణ మార్పులు(Climate Change) మానవ ఆరోగ్యంపై ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం చూపుతున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల ఫలితంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇది మానవాళికి, జీవావరణానికి తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తోంది. అందువల్ల వాతావరణం, పర్యావరణ పరిరక్షణ (Environmental Protection) కోసం మనం చేయగలిగినదంతా చేయాలి. ప్రపంచవ్యాప్తంగా అనేక వర్గాల పరిశ్రమలు(Industries) వ్యాపారాలను పర్యావరణ హితంగా మార్చుకోవడం మనం చూస్తున్నాం. నేడు యువ పెట్టుబడిదారులు(Investments) కూడా తక్కువ కార్బన్ ఫుట్‌ఫ్రింట్‌తో నడిచే వ్యాపారాలవైపు ఆసక్తి చూపుతున్నారు.

కార్బన్ ఉద్గారాల నివారణకు ఇప్పటికే అనేక పరిష్కారాలను నిపుణులు ప్రతిపాదించారు. వీటిలో ఒకటి గ్రీన్ డిపాజిట్ల రాక. ఇవి ఎకో-ఫ్రెండ్లీ ప్రాజెక్టుల్లో తమ డబ్బును పార్క్ చేయడానికి ఆసక్తి ఉన్న సంస్థలకు ఆర్థిక సంస్థలు, రుణదాతలు అందించే ఫిక్స్డ్ టర్మ్ డిపాజిట్లు. పునరుత్పాదక ఇంధనం, కాలుష్య నివారణ, సస్టైనబుల్ వాటర్ ప్రాజెక్టులు వంటి అనేక భారీ ప్రాజెక్టులు ఈ విభాగంలో ఉన్నాయి. గ్రీన్‌హౌస్ ఉద్గారాల వల్ల ఉష్ణోగ్రత పెరుగుదలను నియంత్రించడం ఈ గ్రీన్ ఎఫ్‌డీల లక్ష్యం.

గ్రీన్ డిపాజిట్లలో పెట్టుబడులు పర్యావరణ హితమైన ప్రాజెక్ట్‌లకు తోడ్పాటును అందిస్తాయి. పెట్టుబడిదారులు ఎకో ఫ్రెండ్లీ యాక్టివిటీస్‌లో పాల్గొనడంలో సహాయపడతాయి. లో-కార్బన్, క్లైమేట్ రెసీలియంట్ ప్రాజెక్ట్‌లకు సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే వ్యాపారాలకు ఫైనాన్సింగ్ చేయడం గ్రీన్ డిపాజిట్ల ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్ వంటి ఆర్థిక సంస్థలు గ్రీన్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ ఆఫర్‌లలో భాగంగా పెట్టుబడిదారుల కోసం గ్రీన్ డిపాజిట్‌లను అందిస్తున్నాయి. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (UNSDG)కి సపోర్ట్ చేసే ప్రాజెక్ట్‌లు, సంస్థలకు ఫైనాన్స్ చేయడానికి ఈ డిపాజిట్లను ఆర్థిక సంస్థలు ఉపయోగిస్తాయి.

Explained: ప్రభుత్వానికి RBI ట్రాన్స్‌ఫర్ చేసే డివిడెండ్‌లో భారీ తగ్గుదల.. ఈ డివిడెండ్ ఎందుకు తగ్గుతోంది..?


** గ్రీన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల గురించి తెలుసుకోవాల్సిన వివరాలు..

డిపాజిట్లను పెట్టుబడి పెట్టే రంగాలు
డిపాజిట్ చేసిన డబ్బును పెట్టుబడి పెట్టే రంగాలలో ఇంధన సామర్థ్యం, ​​పునరుత్పాదక శక్తి, హరిత రవాణా, సుస్థిరమైన ఆహారం, వ్యవసాయం, అటవీ రంగం, వ్యర్థాల నిర్వహణ, గ్రీన్‌హౌస్ వాయువుల నివారణ, హరిత భవనాలు వంటివి ఉన్నాయి.

* గ్రీన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల ఫీచర్లు

- ఎక్కువ వడ్డీ రేటు
గ్రీన్ డిపాజిట్లలో పెట్టుబడి పెడితే, డిపాజిటర్లు సంవత్సరానికి 6.55% వడ్డీ రేటును పొందవచ్చు. సాధారణంగా సాంప్రదాయ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లతో అందే వడ్డీకంటే ఈ వడ్డీరేటు కొంచెం ఎక్కువ.

- సీనియర్ సిటిజన్లకు అదనపు రాబడి
సీనియర్ సిటిజన్లు రూ.2 కోట్ల వరకు చేసే డిపాజిట్లపై సంవత్సరానికి 0.25% నుంచి 0.5% వరకు అదనపు వడ్డీ పొందవచ్చు. .

- ఆన్‌లైన్ పెట్టుబడులతో అదనపు రాబడి
పెట్టుబడిదారులు ఆన్‌లైన్ మోడ్‌లో రుణదాతల పోర్టల్స్ లేదా మొబైల్ అప్లికేషన్స్ ద్వారా గ్రీన్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ మార్గంలో రూ.50 లక్షల వరకు చేసే డిపాజిట్లపై 0.1% అదనపు రాబడిని పొందుతారు.

- ఇన్సూరెన్స్ సపోర్ట్
గ్రీన్ ఎఫ్‌డీల కింద చేసిన డిపాజిట్లకు రూ. 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ హామీ ఉంటుంది.

- కాలవ్యవధి (Tenure)
గ్రీన్ డిపాజిట్లలో పెట్టుబడికి కనీస కాలవ్యవధి 18 నెలలు. ఇది గరిష్టంగా 10 సంవత్సరాల వరకు ఉండవచ్చు.

ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు?
ఇండియాలో గ్రీన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడానికి భారత పౌరులు, NRIలతో పాటు కార్పొరేట్లు, ట్రస్ట్‌లకు అర్హత ఉంటుంది. మైనర్‌ల తరపున సంరక్షకులు, సోల్ ప్రొప్రైటరీషిప్ సంస్థలు, భాగస్వామ్య సంస్థలు, సొసైటీలు, క్లబ్‌లు, సంఘాలు కూడా ఈ జాబితాలో ఉంటాయి.

ప్రీ మెచూర్డ్ విత్‌డ్రాలపై జరిమానాలు
పెట్టుబడిదారుడు గ్రీన్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టిన మొదటి మూడు నెలల్లో డబ్బును విత్‌డ్రా చేసుకోలేరు. ఒక ఇన్వెస్టర్ డబ్బు డిపాజిట్ చేసిన మూడు నెలల తర్వాత, ఆరు నెలలలోపు డబ్బును విత్‌డ్రా చేస్తే.. గ్రీన్ ఎఫ్‌డీలకు వర్తించే వడ్డీ రేట్లతో సంబంధం లేకుండా కేవలం 3% ఫ్లాట్‌ వడ్డీ మాత్రమే అందిస్తారు. నాన్ ఇండివిడ్యువల్ పెట్టుబడిదారుల విషయంలో ప్రీ మెచూర్ విత్‌డ్రాలపై ఎలాంటి వడ్డీ అందించరు. అయితే ఆరు నెలల తర్వాత చేసే ప్రీ మెచూర్డ్ విత్‌డ్రాలపై 1% పెనాల్టీ విధిస్తారు. దీని అర్థం పెట్టుబడిదారులకు వర్తించే వడ్డీ రేటు కంటే 1% తక్కువ మొత్తాన్ని అందిస్తారు. అయితే ఇలాంటి విత్‌డ్రాలు పాక్షికంగా లేదా పూర్తిగా ఉంటే.. డిపాజిట్లు గ్రీన్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల హోదా కోల్పోతాయి. వీటిని సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లుగా మాత్రమే పరిగణిస్తారు.

ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ
ఇన్వెస్టర్లు గ్రీన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని పొందవచ్చు. అయితే ఈ సందర్భంలో డిపాజిట్ సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా మారుతుంది.

ఎలా పెట్టుబడి పెట్టాలి?
పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ వంటి అవసరమైన డాక్యుమెంట్‌లతో ఆన్‌లైన్‌లో మీ వివరాలను నింపండి. మీకు సౌకర్యంగా ఉండే కాల వ్యవధిని ఇక్కడ ఎంచుకోవచ్చు. గ్రీన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆప్షన్‌ను ఎంచుకుని, మీ సేవింగ్స్ అకౌంట్ నుంచి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయండి. లేదంటే ఫిజికల్ మోడ్‌లో గ్రీన్ డిపాజిట్లను అందించే బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి కూడా వీటిలో ఇన్వెస్ట్ చేయవచ్చు.

CM Jagan | Min KTR : ఇక్కడ కుస్తీ.. దావోస్‌‌లో దోస్తీ.. పెట్టుబడుల్లో మాత్రం పోటాపోటీ.. ఎవరికి ఎంతంటే..


వీటిలో పెట్టుబడి పెట్టవచ్చా?
మితమైన, ఎక్కువ రిస్క్ తీసుకోగలిగే పెట్టుబడిదారులకు గ్రీన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు మంచి ఆప్షన్ కాకపోవచ్చు. అయితే సంప్రదాయ పెట్టుబడిదారులు, సీనియర్ సిటిజన్లు ఈ ప్రొడక్ట్స్‌ను ఇన్వెస్ట్‌మెంట్‌గా పరిగణించవచ్చు. గ్రీన్ డిపాజిట్లతో రాబడుల కంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని గుర్తించాలి. సుస్థిరత, ప్లానెట్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్ లక్షణాల కారణంగా వీటికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇవి దీర్ఘకాలంలో మానవజాతిపై మంచి సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల పెట్టుబడిదారులు గ్రీన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌గా పరిగణించవచ్చు. భవిష్యత్తు తరాల సంరక్షణకు మొత్తం పోర్ట్‌ఫోలియోలో కనీసం 1% పెట్టుబడులను గ్రీన్‌ ఎఫ్‌డీకి కేటాయించడం మంచిది.
Published by:Veera Babu
First published:

Tags: Climate, Deposits, Fixed deposits, High interest rates

తదుపరి వార్తలు