కేంద్ర ప్రభుత్వం (Central Government) డ్రోన్ల (Drones) వినియోగానికి (Usage) భారత భూభాగాన్ని అనుకూలంగా మార్చే లక్ష్యంతో నూతన డ్రోన్ పాలసీని (New Drone Policy) ప్రవేశపెట్టింది. పాత నిబంధనల్లో అనేక మార్పులు చేసింది. డ్రోన్ పాలసీ 2021 పేరుతో విడుదలైన ఈ నిబంధనలు డ్రోన్ల వినియోగానికి మార్గం సుగమనం చేసేలా ఉన్నాయి. ఒక డ్రోన్ సొంతం చేసుకోవాలంటే గతంలో ఫారమ్స్ అధికారులకు సమర్పించడంతో పాటు పలు అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది. ప్రభుత్వం చెప్పిన 25 నిబంధనలను పాటించిన వారికేడ్రోన్లను సొంతం చేసుకోవడానికి వీలు పడేది. కానీ డ్రోన్ పాలసీ 2021 ప్రకారం కేవలం ఫారమ్స్, అనుమతులు మొత్తం కలిపి ఐదు రూల్స్ పాటిస్తే సరిపోతుంది. అలాగే కేంద్రం డ్రోన్ల అనుమతుల కోసం చెల్లించే ఫీజును నామమాత్రం చేసింది. డ్రోన్లను సొంతం చేసుకోవడానికి.. ఆపరేట్ చేయడానికి పాటించాల్సిన విధానంలో అనేక సడలింపులు ప్రకటించింది. అవేంటో చూద్దాం.
సులభతరమైన అనుమతులు
డ్రోన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు గతంలో తప్పనిసరి చేసిన అనేక ఆమోదాలను పొందాల్సి వచ్చేది. డ్రోన్ రూల్స్ 2021 ప్రకారం డ్రోన్ లైసెన్స్ కోసం దరఖాస్తుదారుడు ఇకపై డ్రోన్ యూనిక్ ఆథరైజేషన్ నంబర్, యూనిక్ ప్రోటోటైప్ ఐడెంటిఫికేషన్ నంబర్, కన్ఫార్మన్స్ సర్టిఫికేట్, మెయింటెనెన్స్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదు. మరోవైపు, దరఖాస్తుదారులు ఇకపై ఆపరేటర్ పర్మిట్ ఆమోదం సమర్పించాల్సిన అవసరం ఉండదు. అలాగే సంబంధిత డ్రోన్ ఆర్&డి ఆర్గనైజేషన్ అనుమతుల కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి కాదు. స్టూడెంట్ రిమోట్ పైలట్ లైసెన్స్‌లు, రిమోట్ పైలట్ ఇన్స్ట్రక్టర్ ఆథరైజేషన్స్, డ్రోన్ పోర్ట్ అథారిటీస్, డ్రోన్ దిగుమతి అనుమతుల కోసం ఇతర డాక్యుమెంట్లు, పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు.దీంతో, సులభంగా అనుమతి లభించనుంది.
డ్రోన్ అప్లికేషన్ మరింత సులభం
సరికొత్త రూల్స్ డ్రోన్ అప్లికేషన్ ప్రక్రియను చాలా సులభతరం చేస్తాయి. భారతదేశంలో డ్రోన్ లైసెన్స్ పొందడానికి అవసరమైన ఫారమ్‌లు, అనుమతుల సంఖ్యను 25 నుండి 5కు తగ్గించడం జరుగుతుందని కొత్త నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. డ్రోన్ రిజిస్ట్రేషన్, డ్రోన్ పైలట్ లైసెన్స్ జారీ చేయడానికి ముందు దరఖాస్తుదారులు అదనపు భద్రతా అనుమతులను పొందవలసిన అవసరం లేదు. డ్రోన్ పర్మిషన్ ఫీజు "నామమాత్ర స్థాయిలకు" తగ్గిస్తున్నట్లు కొత్త నిబంధనలు పేర్కొన్నాయి.
డ్రోన్ టాక్సీలకు ప్రోత్సాహం
కొత్త రూల్ ప్రకారం డ్రోన్ పేలోడ్ కెపాసిటీ 500 కిలోలకు పెరిగింది. దీంతో కమర్షియల్ 'డ్రోన్ టాక్సీల' వినియోగాన్ని పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ-కామర్స్ డెలివరీలు మానవరహితంగా ఎగిరే డ్రోన్ ల ద్వారా జరిగిపోవాలని కేంద్రం బాగా ప్రోత్సహిస్తోంది. కార్గో డెలివరీల కోసం స్పెషల్ డ్రోన్ కారిడార్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా రూల్స్ స్పష్టంగా ప్రతిపాదించాయి.
డ్రోన్ పైలెట్లకు శిక్షణ
లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకునే పైలట్లకు డ్రోన్ స్కూల్ ద్వారా లైసెన్స్‌లు జారీ చేస్తారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్.. శిక్షణ అవసరాలను, డ్రోన్ స్కూల్స్ పనితీరును పర్యవేక్షిస్తుంది. ఆన్లైన్లో జారీ చేసే డ్రోన్ పైలట్ లైసెన్సులను అందించడం వంటి పనులు కూడా చేస్తుంది.
ప్రైవేట్ డ్రోన్ యూజర్లను ప్రోత్సహించడం:
కేంద్రం ఎక్కువమంది వ్యక్తులను డ్రోన్లు ఉపయోగించమని ప్రోత్సహిస్తోంది. ఇందుకుగాను కొత్త డ్రోన్ రూల్స్ 2021 ఏవైనా ఉల్లంఘించినందుకు గరిష్ట జరిమానా రూ.1 లక్షకు తగ్గించింది. భారతదేశంలో డ్రోన్లను బదిలీ చేయడం, రిజిస్ట్రేషన్ రద్దు చేసే విధానాలు కూడా సడలింపులు ప్రకటించింది. వినోద లేదా సాధారణ వినియోగదారులకు నానో/మైక్రో డ్రోన్లను కొనుగోలు చేయడానికి.. వినియోగించడానికి పైలట్ లైసెన్స్‌లు అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.