Home /News /explained /

GOOD NEWS FOR TTD DEVOTEES DECIDED TO GIVE TWO GRAMS GOLD THALI BOTTU FOR KALYANAMASTU NGS

TTD: భక్తులకు మరో శుభవార్త చెప్పిన టీటీడీ: ఇకపై రెండు గ్రాముల బంగారం ఇవ్వాలని నిర్ణయం

టీటీడీ భక్తులకు మరో శుభవార్త, ఇకపై రెండు గ్రామాల బంగారం ఇవ్వాలని నిర్ణయం

టీటీడీ భక్తులకు మరో శుభవార్త, ఇకపై రెండు గ్రామాల బంగారం ఇవ్వాలని నిర్ణయం

భక్తులకు మరో శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఇకపై పేద దంపతులకు ఒక గ్రాము బంగారానికి బదులు రెండు గ్రాముల బంగారం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

    తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు మరో శుభవార్త చెప్పింది. తాళిబొట్టు బంగారాన్ని ఒక గ్రాము నుంచి రెండు గ్రాములకు పెంచాలని నిర్ణయించింది. అయితే ఎవరికి ఇస్తారు? ఎప్పుడిస్తారు అనుకుంటున్నారా? కళ్యాణమస్తు కార్యాక్రమంలో పాల్గొనే నిరుపేద జంటలకు ఈ కానుక అందించనుంది టీటీడీ. ఇప్పటికే ట్రేజరిలో వున్న 20 వేల బంగారు తాళిబొట్టు కళ్యాణమస్తు కార్యక్రమానికి టిటిడి వినియోగించుకోనుంది. టీటీడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించే కళ్యాణమస్తు కార్యక్రమానికి ముహుర్తాలు ఖరారు చేశారు పండితులు. కళ్యాణమస్తు లగ్నపత్రికని స్వామివారి పాదాల చెంత వుంచి పూజలు నిర్వహించారు అర్చకులు.

    పదేళ్ల క్రితం ఆపేసిన కళ్యాణమస్తు కార్యక్రమాన్ని టీటీడీ పున:ప్రారంభించింది. ఇందులో భాగంగా లబ్దిదారులకు మరో శుభవార్త చెప్పింది టీటీడీ. తాళిబొట్టు బంగారాన్ని ఒక గ్రాము నుంచి రెండు గ్రాములకు పెంచుతున్నట్లు వెల్లడించింది. పేద హిందువులు శ్రీవారి సమక్షంలో వివాహం చేసుకునే ఈ కార్యక్రమం ద్వారా కల్పించింది టీటీడీ. 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ కల్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉంటాయనే భావనతో వేలాది జంటలు ఈ కార్యక్రమంలో దాంపత్య జీవింతంలోకి అడుగుపెట్టేవి. కాగా కల్యాణమస్తులో పెళ్లి చేసుకున్న జంటకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున వధూవరులకు నూతన వస్త్రాలు, బంగారు తాళి బొట్టు ఇవ్వడంతోపాటు..వారి బంధువులు 50 మందికి ఉచితంగా భోజనాలు పెట్టేవారు.

    2007 నుంచి 2011 వరకు ఏటా రెండు విడతల్లో కల్యాణమస్తు కార్యక్రమాన్ని దేవస్థానం నిర్వహించింది. ఆ తర్వాతి కాలంలో ఆర్థిక భారం పెరగడం, సిబ్బంది చేతివాటం ప్రదర్శించడంతో ఈ కార్యక్రమాన్ని నిలిపివేశారు 2013లో కల్యాణమస్తును తిరిగి ప్రారంభించాలని ప్రయత్నించినప్పటికి.. అడుగులు ముందుకు పడలేదు. తాజాగా వైవీ సుబ్బారెడ్డి ఆలయ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నాక టీటీడీ ట్రస్టు బోర్డు ఈ కార్యక్రమాన్ని తిరిగి పున:ప్రారంభించాలని తీర్మానించింది.

    కల్యాణమస్తు కార్యక్రమంలో భాగంగా, పెళ్లి చేసుకునే జంటలకు 2 గ్రాముల బంగారంతో మంగళ సూత్రాలతో పాటు వస్త్రాలను ఉచితంగా అందజేస్తూ వచ్చింది టీటీడీ. వధూవరులు తో పాటు 50 మందికి ఉచితంగా భోజనం సరఫరా చేసింది టిటిడి. ఇలా ఒక్క జంట వివాహానికి 8 వేల రూపాయల వరకు ఖర్చు చేసేది టిటిడి. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రతి ధపా ఐదు వేల నుంచి 7 వేల వరకు జంటలు పాల్గొనేవి. 2011 మార్చిలో రద్దయిన ఈ పధకాన్ని ఇప్పటి పాలక మండలి తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.

    మే 28,అక్టోబర్ 30వ తేదీ, నవంబర్ 17వ తేదిలలో కళ్యాణమస్తు కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇప్పటికే ఈవో జవహర్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. కళ్యాణమస్తు నిర్వహించే ప్రాంతాలను పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. స్వామి వారికి ఏడాదికి 2 వేల కోట్ల రూపాయల వరకు కానుకలు వస్తుంటాయి. టీటీడీ ఏటా 200 కోట్ల రూపాయలు వెచ్చించి హిందూ ధార్మిక ప్రచారం నిర్వహిస్తోంది. అందులో భాగంగా దీన్ని పున: ప్రారంభించింది.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Gold, Tirumala, Tirupati, Ttd

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు