హోమ్ /వార్తలు /Explained /

Germany-Ukraine: IRIS-T SLM అంటే ఏంటి..? ఉక్రెయిన్ కు ఈ IRIS-T SLMను అందించనున్న జర్మనీ..

Germany-Ukraine: IRIS-T SLM అంటే ఏంటి..? ఉక్రెయిన్ కు ఈ IRIS-T SLMను అందించనున్న జర్మనీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అడ్వాన్స్‌డ్‌ సర్ఫేస్‌ టూ ఎయిర్‌ మిసైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ IRIS-T SLMను ఉక్రెయిన్‌కు జర్మనీ అందిస్తోంది. రాబోయే వారాల్లో ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలను అందిస్తామని జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ పేర్కొన్నారు. Iris-T వ్యవస్థను పంపాలని ప్రభుత్వం నిర్ణయించిందని, రష్యా వైమానిక దాడుల నుంచి ఉక్రెయిన్‌ ప్రధాన నగరాలను రక్షిస్తుందని ఓలాఫ్‌ స్కోల్జ్‌ చెప్పారు.

ఇంకా చదవండి ...

అడ్వాన్స్‌డ్‌ సర్ఫేస్‌ టూ ఎయిర్‌ మిసైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ IRIS-T SLMను ఉక్రెయిన్‌కు జర్మనీ(Germany) అందిస్తోంది. రాబోయే వారాల్లో ఉక్రెయిన్‌కు(Ukraine) మరిన్ని ఆయుధాలను అందిస్తామని జర్మన్ ఛాన్సలర్(Germany Chancellor) ఓలాఫ్ స్కోల్జ్ పేర్కొన్నారు. Iris-T వ్యవస్థను పంపాలని ప్రభుత్వం (Government) నిర్ణయించిందని, రష్యా వైమానిక దాడుల నుంచి ఉక్రెయిన్‌ ప్రధాన నగరాలను రక్షిస్తుందని ఓలాఫ్‌ స్కోల్జ్‌ చెప్పారు. IRIS-T కాకుండా, ఎనిమీ హోవిట్జర్‌లు, మోర్టార్లు, ఫిరంగిని గుర్తించడానికి జర్మనీ రాకెట్ లాంచర్‌లు, ట్రాకింగ్ రేడార్‌లను పంపుతోంది. ఉక్రెయిన్‌కు అడ్వాన్స్‌డ్‌ రాకెట్ సిస్టమ్‌లను అందిస్తామని యూఎస్‌ చెప్పిన తర్వాత స్కోల్జ్ ఈ ప్రకటన చేశారు. రష్యా కార్పెట్-బాంబింగ్ దాడులను ఆపడానికి జర్మన్ వైమానిక రక్షణ వ్యవస్థ ఉక్రెయిన్‌కు ఉపయోగపడుతుందని నివేదికలు చెబుతున్నాయి.

FD Interest Rates Hike: గుడ్ న్యూస్.. ఆ బ్యాంక్ లో FDలపై అధిక వడ్డీ.. తాజా వడ్డీ రేట్లు ఇవే..


IRIS-T SLM అంటే ఏంటి..?

IRIS-T SLM అనేది జర్మన్ సంస్థ డీల్ డిఫెన్స్ తయారు చేసిన మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ టూ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌. అనేక ఎనిమిది-రౌండ్ లాంచర్‌లు, కమాండ్ పోస్ట్,రేడార్‌లతో IRIS-T SLM బ్యాటరీ, అన్నీ భారీ-డ్యూటీ ట్రక్కులపై అమర్చే వీలు ఉంటుంది.దీనికి యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, క్రూయిజ్ మిసైల్స్‌, రాకెట్ ఫిరంగి, డ్రోన్లు, యాంటీ- రేడార్‌ మిసైల్స్‌, బాంబులను ఎదుర్కొనే శక్తి కూడా ఉంటుంది. 12 మైళ్ల ఎత్తులో 25 మైళ్ల దూరంలో ఉన్న లక్ష్యాలను IRIS-T SLM చేధించగలదని డీహెల్ డిఫెన్స్ పేర్కొంది. IRIS-T SLM ఫీచర్ల విషయానికి వస్తే.. మల్టీఫంక్షన్ రేడార్‌, AESA టెక్నాలజీ, 360 డిగ్రీల ప్రొటెక్షన్‌, 250 కి.మీ. రేంజ్‌, 90 డిగ్రీల వరకు ఎలివేషన్ యాంగిల్‌, ఇంటిగ్రేటెడ్ IFF.. కమాండ్, కంట్రోల్ సిస్టమ్, గగనతలంపై నిఘా, థ్రెట్‌ ఎవాల్యువేషన్‌, వెపన్‌ అసైన్‌మెంట్‌, ఫైర్‌ కంట్రోల్‌, మిషన్ ప్లానింగ్, మల్టిపుల్‌ డేటా లింక్‌ కేపబులిటీ కలిగి ఉంటుంది. IRIS-T SLM లాంచర్ కూడా కలిగి ఉంటుంది. ఇది 40 కిమీ వరకు ఎఫెక్టివ్‌ రేంజ్‌, 20 కిమీ ఎత్తు వరకు కవరేజ్, హై ఫైరింగ్‌ పవర్‌, మల్టిపుల్‌ టార్గెట్‌ ఎంగేజ్‌మెంట్‌ కలిగి ఉంటుంది. IRIS-T SLM ఉక్రెయిన్‌కు అందనున్న అడ్వాన్స్‌డ్‌ వెస్ట్రెన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌, రేంజ్‌ పరంగా అత్యంత సామర్థ్యం గల వాటిలో ఇది ఒకటి.

ఉక్రెయిన్‌కు అడ్వాన్స్‌డ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ ఎందుకు అవసరం.. ?

రష్యన్ దళాల నుంచి రక్షణకు సోవియట్-యుగం నాటి సిస్టమ్‌లను ఉపయోగిస్తున్న కీవ్‌.. IRIS-T SLMతో ఉక్రెయిన్ ఎయిర్‌ డిఫెన్స్‌ సామర్థ్యం పెరగనుంది. సోవియట్ కాలం నాటి లాంగ్‌ రేంజ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ S-300పై ఉక్రెయిన్ ఆధారపడింది. S-300 లాంచర్ మోడల్‌ను బట్టి 125 మైళ్ల వరకు మిసైల్‌ను లాంచ్‌ చేసే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ ఉక్రెయిన్‌ వద్ద మందుగుండు సామగ్రి పరిమితం, రష్యన్ దాడుల్లో డజన్ల కొద్దీ లాంచర్లు, రాడార్‌లు నాశనం అయ్యాయి. ఉక్రెయిన్ అసలైన S-300 లాంచర్‌లను రష్యా రెండు డజన్‌లకు పైడా ధ్వంసం చేసినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. అందువల్ల ఉక్రెయిన్ ఎయిర్‌ డిఫెన్స్‌ను పెంచుకోకపోతే.. రష్యా తన బాంబు దాడులను తీవ్రం చేసే ప్రమాదం ఉంది. డాన్‌బాస్‌లో రష్యా ముందుకు వెళ్తుండటంతో.. లాంగ్‌ రేంజ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ల కోసం ఉక్రెయిన్‌ అభ్యర్థించింది. రష్యా దళాలతో పోరాడేందుకు గతంలో 10 మిడ్‌ రేంజ్‌IRIS-T SLM లాంచర్‌లను కీవ్‌ కోరింది.

Ukraine-Russia: ఉక్రెయిన్‌ యుద్ధంలో పుతిన్ తన లక్ష్యాలను సాధిస్తున్నారా..?యుద్ధం ముగినట్లేనా..?


ఎంత త్వరగా ఉక్రెయిన్ ఐరిస్-టి సిస్టమ్స్‌ను పొందుతుంది..?

ఉక్రెయిన్‌కు IRIS-T SL సిస్టమ్‌లను డీల్ డిఫెన్స్ ఎంత త్వరగా అందిస్తుందనే అంశంపై స్పష్టత కొరవడింది. జర్మనీ అందజేస్తున్న IRIS-T SLMలు తయారీదారు నుంచి నేరుగా ఉక్రెయిన్‌కు అందుతాయని నివేదికలు చెబుతున్నాయి. దీనిపై ఇరు దేశాలు అధికారిక ప్రకటన చేసిన తర్వాతే స్పష్టమైన సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌కు వెంటనే అందజేసేందుకు జర్మన్ సైన్యం వద్ద అదనంగా సిస్టమ్‌లు లేకపోవచ్చని విశ్లేషకులు తెలుపుతున్నారు. పంపడానికి ఎన్ని యూనిట్లు అందుబాటులో ఉన్నాయి, ఇప్పటికే ఉన్న కస్టమర్ ఆర్డర్ నుంచి యూనిట్లు మళ్లిస్తారా అనే అంశాలు అస్పష్టం. సహాయం అందడానికి కొన్ని నెలల సమయం పడుతుందన్న జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్‌బాక్ పేర్కొన్నారు. ఈ సిస్టమ్‌ వాస్తవానికి మరొక దేశాన్ని ఉద్దేశించి సిద్ధం చేసినట్లు చెప్పిన జర్మనీ విదేశాంగ మంత్రి అన్నారు.

కీవ్‌కు బయలుదేరిన ఇతర జర్మన్ ఆయుధాలు..

అమెరికాతో సన్నిహిత సమన్వయంతో ఉక్రెయిన్‌కు మల్టిపుల్‌ రాకెట్ లాంచర్‌లను కూడా పంపుతామన్న జర్మన్ ఛాన్సలర్ స్కోల్జ్ తెలిపారు. అందిస్తున్న సిస్టమ్‌ను స్కోల్జ్ స్పష్టం చేయకపోయినా నాలుగు MARS II మల్టిపుల్‌ రాకెట్ లాంచర్‌లను జర్మనీ పంపుతుందని నివేదికలు తెలుపుతున్నాయి.

MARS II అంటే ఏంటి..?

ట్రాక్‌డ్‌ రాకెట్ లాంచర్. ఒకేసారి 12 రాకెట్లను లోడ్‌ చేసే సదుపాయం. గరిష్ట పోరాట పరిధి - 43 మైళ్లు. వివిధ రకాల ప్రొజెక్టైల్స్‌ను పేల్చే శక్తి ఉంటుంది. శత్రువు మోర్టార్లు, ఫిరంగిని గుర్తించగల అత్యాధునిక రేడార్‌ సిస్టమ్‌లను అందజేస్తానని స్కోల్జ్ వాగ్దానం చేశారు.

జర్మనీ సేవింగ్‌ ఎక్సెర్‌సైజ్‌ను ఎదుర్కొంటోందా.. ?

ఉక్రెయిన్‌కు భారీ ఆయుధాలను అందించడంలో ప్రభుత్వం విఫలమైనందుకు స్వదేశంలో, విదేశాలలో స్కోల్జ్‌పై విమర్శలు పెరుగుతున్నాయి. జర్మనీ సొంత నిల్వలు చాలా క్షీణించాయని ట్యాంకులు, హోవిట్జర్ల వంటి భారీ యుద్ధభూమి ఆయుధాలను పంపలేమని స్కోల్జ్ చెప్పారు. తమ సోవియట్ ఆయుధాలను ఉక్రెయిన్‌కు పంపమని యూరోపియన్ మిత్రదేశాలను జర్మనీ కోరింది. కీవ్‌కు ఆయుధాలను అందించే మిత్రదేశాల స్టాక్‌లను తిరిగి నింపుతామని బెర్లిన్ చెప్పింది. మరికొన్ని రోజుల్లో ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Published by:Veera Babu
First published:

Tags: Explained, Germany, Russia-Ukraine War

ఉత్తమ కథలు