• HOME
  • »
  • NEWS
  • »
  • EXPLAINED
  • »
  • FULL DEMOED FOR MUNICIPAL ELECTION CANDIDATES IN ANDHRA PRADESH NGS

Andhra Pradesh: సీటుకు 20 నుంచి 30 లక్షల ఆఫర్.. ఈ బంపర్ ఆఫర్ ఎక్కడ?

Andhra Pradesh: సీటుకు 20 నుంచి 30 లక్షల ఆఫర్.. ఈ బంపర్ ఆఫర్ ఎక్కడ?

ప్రతీకాత్మకచిత్రం

మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేసిన అభ్యర్థులపై కాసుల వర్షం కురుస్తోందట.. నామినేషన్ విత్ డ్రా చేసుకుంటే ఒక రేటు.. వేరే పార్టీ లోకి చేరితో మరో రేటు నిర్ణయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

  • Share this:
    మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేసిన  వారికి ఇలాంటి ఆఫర్లు వచ్చి పడుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మున్సిపల్ పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండడంతో.. నామినేషన్ విత్ డ్రా చేసుకున్నా.. లేక పార్టీ మారినా వారికి అక్కడ డిమాండ్ ను బట్టి 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు ఆఫర్లు వస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక విశాఖలో అయితే ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు నామినేషన్ విత్ డ్రా చేసుకుంటే  కోటి వరకు ఆఫర్ చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.

    దాదాపు అన్ని పురపాలక ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం అధికార నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని విపక్షల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణల గడువు బుధవారం వరకు ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు తమ అభ్యర్థులపై ఒత్తిళ్లు తెచ్చి.. నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కుదిరితే భారీ ఎత్తున నగదును ఇచ్చి దారిలోకి తెచ్చుకుంటున్నారని.. ఎవరైనా కాస్త బలమైన అభ్యర్థి ఉండి మాట వినకపోతే.. వారిని కేసులతో బెదిరించి లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

    ఒకవేళ పోటీ నుంచి తప్పుకొంటే కార్పొరేషన్లలో అయితే 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయల వరకు.. మునిసిపాలిటీల్లో అయితే 10 నుంచి 20 లక్షల రూపాయల వరకు నగదు ఇచ్చేలా ఒత్తిడి తెస్తున్నారని విపక్షాల పార్టీలు ఆరోపిస్తున్నాయి. స్థానికంగా ఆ అభ్యర్థికి ఎంత బలం ఉంది.. గెలుపు ఛాన్స్ ఎంత ఉంది ఇలా అన్ని లెక్కలు వేసుకున్న తరువాత ఫైనల్ రేటు ఫిక్స్ చేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.

    చాలావరకు అభ్యర్థులను ఒప్పించడానికే ప్రయత్నిస్తున్నారని.. అప్పటికే అభ్యర్థులు లొంగకపోతే వారిని బెదిరిస్తున్నారని.. వారిపై ఏవైనా చిన్న కేసులు ఉంటే వారిటి తెరపైకి తెస్తున్నారని.. ఒకవేళ అలాంటి కేసులు కూడా లేకుంటే అక్రమ కేసులు పెట్టడానికి కూడా వెనుకాడడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో చాలా జిల్లాల్లో నామినేషన్ వేసిన అభ్యర్థులను కాపాడునుకునేందుకు క్యాంప్ రాజకీయాలకు తెరతీశారు కూడా.

    ఈ బెదిరింపులు, ఆరోపణల పర్వంపై ఇప్పటికే ఎస్ఈసీకి పలువురు నేతలు ఫిర్యాదు చేశారు. అయితే ఏవైనా ఆధారాలు చూపిస్తే మాత్రం కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటు అధికార పార్టీ నేతలు సైతం టీడీపీ ఆరోపణలపై మండిపడుతోంది. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను బలవంతంగా తమ పార్టీలోకి తీసుకోవాల్సిన అసవరం లేదంటున్నారు. చాలాచోట్ల ఓడిపోతామనే భయంతోనే విపక్షాలు కొత్త డ్రామాలకు తెరలేపుతున్నాయని విమర్శలను తిప్పి కొడుతున్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్ష అంటున్నారు. ప్రత్యర్థి పార్టీ ఆరోపణలతో తమకు సంబంధ లేదని .. పంచాయతీ ఎన్నికల ఫలితాల మాదిరి.. మున్సిపల్ ఎన్నికల్లో సైతం వైసీపీ ప్రభంజనం కనిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు