ఉక్రెయిన్‌పై(Ukraine) యుద్ధం ప్రారంభమైన రోజుల్లో క్రెమ్లిన్ అనుకూల ఛానెల్లో యాంటీ వార్ ప్రొటెస్ట్(Anti War Protest) చేసిన ఒక టీవీ నిర్మాత ఇప్పుడు రష్యా మోస్ట్ హేటెడ్ ఉమెన్ (Hated Women) గా మారింది. మెరీనా ఓవ్స్యానికోవా ధిక్కార చర్యలతో ఆమె వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి భారీ నష్టం కలిగింది. దేశద్రోహి, బ్రిటిష్ గూఢచారిగా మెరీనా ఓవ్స్యానికోవాపై మాజీ సహచరులు, క్రెమ్లిన్ అధికారులు ముద్ర వేశారు. అయినప్పటికీ మెరీనా ఓవ్స్యానికోవాకు రష్యాలో, వెలుపల అపనమ్మకంతో యుద్ధ వ్యతిరేక వ్యక్తులు స్వాగతం పలికారు. వ్యక్తిగత, వృత్తి రంగాలలో సవాళ్లు ఎదురైనప్పటికీ తన చర్యలకు ప్రముఖ టీవీ నిర్మాత కట్టుబడింది.
యుద్ధ వ్యతిరేక నిరసన..
మార్చి 14న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఖండిస్తూ ఛానల్ వన్‌లోకి మెరీనా ఓవ్స్యానికోవా దూసుకెళ్లింది. చాలా కాలంగా నమ్మకమైన ఉద్యోగి కావడంతో ఒక చిన్న పోస్టర్‌తో ప్రత్యక్ష ప్రసార సెట్లోకి ఓవ్స్యానికోవా ప్రవేశించగలిగింది. నో వార్, రష్యన్ భాషలో "యుద్ధం ఆపండి, ప్రచారాన్ని నమ్మవద్దు. వారు ఇక్కడ మీకు అబద్ధాలు చెబుతున్నారు" అని రాసి బ్యానర్ ప్రదర్శించారు. ఎక్కువ మంది వీక్షించిన ఫుటేజీలో వ్లాదిమిర్ పుతిన్‌కు 'ఇష్టమైన టీవీ యాంకర్' వెనుక నిలబడి ఓవ్స్యానికోవా(43) కనిపించింది.
Jio Offer: గుడ్ న్యూస్... ఈ స్మార్ట్‌ఫోన్ కొన్నవారికి రూ.7,200 విలువైన బెనిఫిట్స్
భావోద్వేగ ప్రకోపం..
టెలిగ్రాఫ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ రోజు భయాందోళనలకు గురికావడం లేదా పతనం గురించి ఆలోచించే తీరిక లేనంత ఒత్తిడిలో ఉన్నట్లు ఓవ్స్యానికోవా చెప్పింది. తన చర్యలను భావోద్వేగ ప్రకోపంగా టీవీ నిర్మాత అభివర్ణించారు. ఆలోచించడానికి ఎక్కువ సమయం లేదని, ఆ పని చేసిన తర్వాతనే భయం అనిపించిందని, గ్లాసు నీళ్ళు తాగలేక చేతులు వణుకుతున్నాయని ఇంటర్వ్యూలో మెరీనా ఓవ్స్యానికోవా చెప్పింది.
ఆమె ధిక్కరణ పరిణామాలు..
ప్రత్యక్ష ప్రసార టీవీ కార్యక్రమంలో నిరసన తర్వాత పోలీసు స్టేషన్లో ఒక రాత్రి ఓవ్స్యానికోవా గడిపింది. కొత్త యుద్ధ ప్రచార చట్టం ప్రకారం సోషల్ మీడియా పోస్ట్‌కు జరిమానాతో ఒక రోజు తర్వాత ఆమె విడుదలైనట్లు నివేదికలు వచ్చాయి. రష్యాలో యుద్ధ వ్యతిరేక నిరసనలలో పాల్గొనడం, సైన్యాన్ని అగౌరవపరిచేలా వ్యవహరించినందుకు 2,000 మందికి పైగా ప్రజలు జరిమానాలు చెల్లించారు. ఉద్యోగం కోల్పోయిన ఆమెను దేశద్రోహిగా మాజీ సహచరులు, క్రెమ్లిన్ అధికారులు పిలిచారు. ఆమెను ప్రత్యక్ష ప్రసారంలో ఖండించిన ఆమె మాజీ బాస్.. ఆమె దేశానికి ద్రోహం చేశారని, బ్రిటీష్ గూఢచారి అని ఆరోపణలు చేశాడు. ఆమె ఒక దశాబ్దం జైలు శిక్షను అనుభవించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం.. కానీ ఓవ్స్యానికోవాపై చార్జెస్ ఇంకా కార్యరూపం దాల్చలేదు.
Bank Holidays: ఖాతాదారులకు అలర్ట్... జూన్‌లో బ్యాంకులు ఈ రోజుల్లో తెరుచుకోవు
యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఓవ్స్యానికోవాను ఎందుకు నమ్మలేదు..
మాస్కో ప్రచార యంత్రంలో సుదీర్ఘకాలంగా పనిచేసిన ట్రాక్ రికార్డ్ కారణంగా ఆమెను యుద్ధ వ్యతిరేక వ్యక్తులు నమ్మలేదు. తన జీవితంలో ఎక్కువ భాగం స్టేట్ టెలివిజన్ కోసం పనిచేసి, మంచి జీతం తీసుకునే నిర్మాతగా ఓవ్స్యానికోవా ఎదిగింది. క్రెమ్లిన్‌కు ఆమె సంవత్సరాలపాటు సపోర్ట్ చేశారని, పౌర సమాజంపై అధ్వాన్నంగా అణిచివేసేందుకు పని చేశారని విమర్శకులు అంటున్నారు. జర్నలిస్ట్‌గా ఆమె ఆధారాలను ప్రశ్నించిన ఉక్రెయిన్ వాసులు, టర్న్‌కోట్, క్రెమ్లిన్ స్టూజ్గా తొలగించారు. కుటుంబంలో సమస్యలు ఎదుర్కొంటున్న ఓవ్స్యానికోవా.. కుటుంబ జీవితాన్ని నాశనం చేశావని ఆమెపై పిల్లలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోని RT ఛానెల్లో సీనియర్ ఉద్యోగి అయిన ఆమె భర్త, ఇద్దరు పిల్లలపై కస్టడీ పోరాటం జరుగుతోంది. ఆమె నిరసన పరిణామాలు ప్రతిరోజూ స్నోబాల్ అవుతున్నాయని, తన వద్దకు రావడానికి భర్తను ఉపయోగించుకుంటున్నారని ఓవ్స్యానికోవా చెప్పింది. సందిగ్ధంలో ఉన్నానని, జీవితం ఇలా మారుతుందని ఎప్పుడూ ఊహించలేదని మెరీనా ఓవ్స్యానికోవా చెప్పింది. మాస్కోలో కట్టుకున్న అందమైన ఇంట్లో శేష జీవితం గడపాలని కోరుకుంటున్నానన్నది.
New Rules: సామాన్యుల జేబులకు చిల్లు... రేపటి నుంచి అమలులోకి వచ్చే 7 కొత్త రూల్స్ ఇవే
ఇంటర్నేషనల్ అవార్డ్ ఫర్ క్రియేటివ్ డిసెంట్..
నార్వేలో క్రియేటివ్ డిసెంట్కు ఇటీవల ప్రతిష్టాత్మకమైన వాక్లావ్ హావెల్ ఇంటర్నేషనల్ అవార్డును ఆమె అందుకుంది. "శౌర్యం, చాతుర్యంతో, నియంతృత్వ అబద్ధాలను బట్టబయలు చేసేవారిని" గౌరవించడం కోసం అందించే అవార్డు ఇది. అయితే ఇంతకుముందు రష్యా మానవ హక్కుల ఉద్యమానికి చెందిన ప్రముఖులకు ఇచ్చే బహుమతిని ఆమెకు ఇవ్వాలనే నిర్ణయాన్ని కొన్ని వర్గాలు ప్రశ్నించాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Russia actress, Russia-Ukraine War, Ukraine