రష్యా(Russia) దురాక్రమణకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ(Zelensky) తమ దేశం ఆత్మీయ రక్షణకు ముఖంగా మారారు. యుద్ధం జరుగుతున్న సమయంలో సెల్ఫీ వీడియోలతో ఉక్రెయిన్(Ukraine) ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. భయం గుప్పిట్లో ఉన్న దేశ ప్రజల్లో ధైర్యం నింపేందుకు, కష్టకాలంలో ఎదురొడ్డి నిలిచేందుకు కృషి చేశారు. యద్ధం మొదలైన రెండో రోజు శుక్రవారం వొలొదిమిర్ జెలెన్స్కీ ఓ వీడియో విడుదల చేశారు. అందులో..‘ ప్రపంచం మొత్తం చూసింది. ఉక్రెయిన్(Ukraine) ప్రజలు బలంగా ఉన్నారు. ఉక్రెయిన్ ప్రజలు చాలా ధైర్యవంతులు. ఉక్రేనియన్లు వారి మాతృభూమిలో ఉన్నారు, దాన్ని వాళ్లు ఎవ్వరికీ ఇవ్వరు’ అని చెప్పారు. ప్రస్తుత యుద్ధంలో ఇంత పోరాట పటిమ చూపిస్తున్న జెలెన్స్కీ ప్రస్థానం తెలుసుకుందాం.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎక్కడ ఉన్నారనే దానిపై చర్చలు జరుగుతున్న సమయంలో సీబీఎస్ న్యూస్ ఫారిన్ కరస్పాండెంట్ హోలీ విలియమ్స్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. జెలెన్స్కీ భద్రతపై తీవ్ర భయాలు ఉన్నాయని పేర్కొన్నారు. తాను, తన కుటుంబమే రష్యా ప్రధాన లక్ష్యమని జెలెన్స్కీ చెప్పిన మాటలను గుర్తు చేశారు. అయినప్పటికీ యుద్ధం మొదలైన తర్వాత అతన్ను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు యూఎస్ ముందుకురాగా.. తనకు ఆయుధాలు కావాలని, రైడ్ కాదని జెలెన్స్కీ స్పష్టం చేసినట్లు తెలిపారు. ‘ఐ నీడ్ అమ్యునేషన్, నాట్ ఎ రైడ్’ అని జెలెన్స్కీ చెప్పిన మాటలు ఉక్రెయిన్ అధ్యక్షుడికి ట్యాగ్‌లైన్‌లా మారింది.
రష్యా దురాక్రమణలపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. పుతిన్‌పై వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ జరుగుతున్న ర్యాలీలో ప్రతిఘటనకు సింబల్‌గా జెలెన్స్కీ మారాడు. అయితే రాజీయాల్లోకి రాకముందు జెలెన్స్కీ ఉక్రెయిన్‌లోని అన్ని ఇళ్లలో సుపరిచితుడు.
so apparently Zelenskyy won the Ukrainian version of Dancing with the Stars in 2006 and the tape is even better than whatever you're imagining pic.twitter.com/L1gnKD2ISr
— Kat Abu (@abughazalehkat) February 27, 2022
ఫ్రమ్ టీవీ ప్రెసిడెంట్ టూ రియల్ ప్రెసిడెంట్
44 మిలియన్ల జనాభా ఉన్న దేశానికి నాయకత్వం వహించే ముందు జెలెన్స్కీ ప్రముఖ హాస్యనటుడు. అతను టీవీ కామెడీ షో ‘సర్వెంట్ ఆఫ్ ది పీపుల్’ లోని పాత్రతో చక్కటి గుర్తింపు తెచ్చుకొన్నారు. అతను ప్రభుత్వంలో అవినీతికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత ఊహించని విధంగా జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు అయ్యారు. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సమయంలో కూడా కామెడీ షోను జెలెన్స్కీ కొనసాగించారు. ఆ షో పేరునే పార్టీ పేరుగా నిర్ణయించారు. 2019 ఎన్నికల్లో ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకోను 70 శాతం కంటే ఎక్కువ ఓట్లతో ఓడించారు.
ఉక్రెయిన్ ‘డ్యాన్సింగ్ విత్ స్టార్స్’ విజేత
ఉక్రెయిన్ అధ్యక్షుడి హోదాలో జెలెన్స్కీ కూర్చోవడానికి దశాబ్దం కంటే ముందు.. 2006లో ఉక్రెయిన్‌లో పాపులర్ ప్రోగ్రామ్ ‘డ్యాన్సింగ్ విత్ ది స్టార్స్’ మొదటి సీజన్ విజేతగా నిలిచారు. అతి తక్కువ కాలంలోనే ప్రోగ్రామ్‌లో అతని విభిన్న నృత్యాల క్లిప్ ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.
జెలెన్స్కీ మూలాలు
ఉక్రెయిన్ సౌత్ఈస్ట్రెన్ ప్రాంతంలోని క్రీవ్రిహ్లో 44 ఏళ్ల తండ్రితో ఇద్దరు పిల్లలు పెరిగారు. ఆ ఇద్దరిలో జెలెన్స్కీ ఒకరు. వార్‌టైమ్ ప్రెసిడెంట్ అయిన ఆయన రష్కన్ అనర్గళంగా మాట్లాడుతారు. రష్యాతో శాంతి చర్చలు జరిపేందుకు కూడా ప్రయత్నించారు. ఆయన కూడా జ్యూయిష్ కుటుంబానికి చెందినవారు. అతని కుటుంబ సభ్యులు హోలోకాస్ట్‌లో ప్రాణాలు కోల్పోయారు. అతని గ్రాండ్ ఫాదర్ సోవియట్ యూనియన్ ఆర్మీలో నాజి జర్మనీపై పోరాడారు. ఉక్రెయిన్ ప్రభుత్వం నాజీలకు మద్దతు అని రష్యా అధ్యక్షుడు పుతిన్, పలువురు నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలు ఉక్రెయిన్‌పై దాడులను సమర్థించుకొనేందుకు పుతిన్ చేస్తున్నట్లు విశ్లేషణలు వినిపించాయి. అతని వ్యాఖ్యలను జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు.
"Strong...powerful...brave": In a video address on Saturday, Ukrainian President Volodymyr Zelensky reiterated that Ukraine's citizens will not back down from Russian aggression. https://t.co/PQqwJkzgsp pic.twitter.com/0ccj89uPfT
— CBS News (@CBSNews) February 27, 2022
Odisha news: వామ్మో.. ఇదేం పనిరా అయ్యా.. ఎన్నికలలో ఓడిపోయినందుకు ఎంత పనిచేశాడు..
గురువారం ఓ వీడియోలో జెలెన్స్కీ..‘వార్తల్లో ఉన్న ఉక్రెయిన్‌కి, నిజంగా ఉన్న ఉక్రెయిన్‌కి చాలా తేడా ఉంది. మేము నాజీలకు మద్దతు కాదు. నాజీల దాడులతో 8 మిలియన్ల మందిని పోగొట్టుకున్న ప్రజలు వారికి మద్దతుగా ఎలా ఉంటారు. నేను నాజి ఎలా అవుతాను. మా గ్రాండ్ ఫాదర్‌ను అడగండి, ఆయన సైన్యంలో ఉన్నంత కాలంలో సోవియట్ ఆర్మీలో నాజీలకు వ్యతిరేకంగా పోరాడారు. స్వతంత్ర ఉక్రెయిన్‌లో ఊపిరి వదిలారు’ అని చెప్పారు. ఉక్రెయిన్, రష్యా అధికారుల మధ్య చర్చలు విఫలమైన తర్వాత సోమవారం ఓ వీడియోలో యూరోపియన్ యూనియన్ తమను చేర్చుకోవాలని జెలెన్స్కీ కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Russia, Russia-Ukraine War, Ukraine, Zelensky