Ford exiting India: భారత్​లో కార్ల తయారీకీ ​ ఫోర్డ్ సంస్థ​ గుడ్​బై.. షాకింగ్ నిర్ణయానికి అసలు కారణాలివే..

ప్రతీకాత్మక చిత్రం

Ford exiting India: దేశీయ మార్కెట్​లోకి ఫోర్డ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి 12 మోడల్స్​ విడుదలయ్యాయి. వీటిలో 1999లో విడుదలైన ఫోర్డ్ ఐకాన్‌కు గణనీయమైన రెస్పాన్స్​ వచ్చింది.

  • Share this:
అమెరికాకు చెందిన ప్రీమియం కార్ల తయరీ సంస్థ ఫోర్డ్​ సంస్థ (American car brand Ford) సంచలన నిర్ణయం తీసుకుంది. భారత (Latest Telugu News) ఆటోమొబైల్ మార్కెట్​కు గుడ్​బై చెప్పింది. ఈ మేరకు భారత్​లోని ఫోర్డ్​ కంపెనీ కార్ల ప్లాంట్లను మూసివేస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో, సంసద్​(గుజరాత్​), చెన్నై (తమిళనాడు) నగరాల్లోని రెండు ప్లాంట్లను త్వరలోనే మూనివేయనుంది. ఇటీవల ఫోర్డ్​ కంపెనీకి భారత మార్కెట్​లో తీవ్ర నష్టాలు రావడం, బహిరంగ మార్కెట్​లో వృద్ధి లేకపోవడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, తమ ఫ్యాక్టరీలను మూసివేసినప్పటికీ.. వినియోగదారులకు సేవలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. అయితే, ఇతర దేశాల్లో గల ప్లాంట్ల నుంచి ఫోర్ట్​ కార్లను దిగుమతి చేసుకొని మన దేశంలో వాటిని విక్రయించనున్నారు. దీంతో దిగుమతి సుంకం కారణంగా ఫోర్డ్​ కార్ల ధరలు పెరిగే అవకాశం ఉందని ఆటోమొబైల్​ ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు. కాగా, ఇండియాలో నష్టాల కారణంగా ఇప్పటికే హార్లీ డేవిడ్​సన్​, జనరల్​ మోటార్స్​ కూడా తమ సంస్థ ప్లాంట్లను, డీలర్​షిప్​ సెంటర్లను మూసివేశాయి. ఇప్పుడు అదే బాటలో ఫోర్డ్​ కూడా పయనిస్తోంది. కాగా, ఫోర్డ్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సుమారు 4000 మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది.

భారత మార్కెట్​పై బలమైన ముద్ర..

దేశీయ మార్కెట్​లోకి ఫోర్డ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి 12 మోడల్స్​ విడుదలయ్యాయి. వీటిలో 1999లో విడుదలైన ఫోర్డ్ ఐకాన్‌కు గణనీయమైన రెస్పాన్స్​ వచ్చింది. ఇది ఫోర్డ్​ నుంచి దేశంలో విడుదలైన మొదటి మోడల్​ కావడం విశేషం. భారతీయ యువత అభిరుచుల మేరకు నూతన ఫీచర్లతో ఫోర్డ్​ ఇక్కడ బలమైన ముద్ర వేయగలిగింది.-

స్టైలిష్, డైనమిక్ లుక్​తో ఫోర్డ్​ వాహనాలు యూజర్లను అట్రాక్ట్​ చేయడంలో ముందుంటాయి. ఫోర్డ్​ నుంచి విడుదలైన ఎస్కార్ట్, మోండియో, ఫ్యూజన్- ఐకాన్, ఎండీవర్ లేదా ఎకోస్పోర్ట్ కార్లలో అద్భుతమైన ఫీచర్లు అందించినప్పటికీ పెద్దగా విజయవంతం కాలేదు.

అయితే, ఆ తర్వాత విడుదలైన ఫోర్డ్ ఫియస్టా, ఫిగో హ్యాచ్‌బ్యాక్​లు మాత్రం గణనీయమైన అమ్మకాలు ప్రదర్శించాయి. భారతీయ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దారు. అందుకే, ఫీగో ఇప్పటికీ ఆల్​ టైమ్​ ఫేవరెట్​ కారుగా రాణిస్తోంది.

ఎందుకు వైదొలుగుతోంది?

గత దశాబ్దంలో ఫోర్డ్ సుమారు $ 2 బిలియన్ డాలర్లకు పైగా నష్టాలను చవిచూసింది. ఫోర్డ్​ వాహనాలకు డిమాండ్ గణనీయంగా తగ్గడం, ఫోర్డ్ సనంద్ ప్లాంట్ నిర్వహనా ఖర్చులు పెరగడంతో ఇక భారత్​ నుంచి వైదొలగాని నిర్ణయించినట్లు ఫోర్డ్​ ప్రెసిడెంట్, సీఈఓ జిమ్ ఫార్లే చెప్పారు.

ఇది కూడా చదవండి : " విరాట్ కోహ్లీని పిచ్చిగా ప్రేమించాను.. అతడితో జ్ఞాపకాలు మర్చిపోలేను".. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

ఫోర్డ్ తాజా నిర్ణయం ప్రకారం, 2021 నాల్గవ త్రైమాసికం నాటికి సనంద్ ప్లాంట్ ఉత్పత్తి మూసివేస్తుంది. ఇక, 2022 రెండవ త్రైమాసికానికి తమిళనాడు ప్లాంట్​ను షట్​డౌన్​ చేయనుంది. దీంతో, 23 సంవత్సరాల తరువాత ఫోర్డ్ ఇండియా కథ ముగియనుంది.
Published by:Sridhar Reddy
First published: