Home /News /explained /

FINANCIAL TIPS HOW TO SAVE TDS ON FIXED DEPOSITS INCOME BA GH

Fixed Deposits: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై టీడీఎస్ కట్ కాకుండా ఉండాలంటే.. ఇలా చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బ్యాంకుకు వెళ్లే బదులు మీరు పోస్టాఫీసు శాఖలో ఫిక్సెడ్ డిపాజిట్ చేయాలి. పోస్టాఫీసు ఫిక్సెడ్ డిపాజిట్లకు టీడీఎస్ ఉండదు. 5 ఏళ్ల టర్మ్ డిపాజిట్లలో జమ చేస్తే డిపాజిటర్లు ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80సీ కింద 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.

ఇంకా చదవండి ...
దీర్ఘకాలిక పెట్టుబడుల్లో మంచి రిటర్నులు కావాలంటే ఉత్తమమైన మార్గం ఫిక్సెడ్ డిపాజిట్లు(FD). ఇటీవల కాలంలో చాలా మంది ఔత్సాహికులు వీటిల్లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. బ్యాంకులు లేదా నాన్ బ్యాంకింగ్ పైనాన్షియల్ కంపెనీలు అందించే ఈ పెట్టుబడి మార్గంలో నిర్ణీత వడ్డీరేటు, నిర్ణీత కాలానికి వర్తిస్తుంది. పొదుపు ఖాతా కంటే అధిక వడ్డీరేట్లు ఈ ఫిక్సెడ్ డిపాజిట్లలో అందుకోవచ్చు. అయితే ఇదే సమయంలో వీటికి పూర్తిగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా ఇది మీ స్థూల ఆదాయానికి జోడించబడుతుంది. అంతేకాకుండా మొత్తం ఆదాయానికి సంబంధించిన స్లాబ్ రేట్లపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మీ ఐటీ రిటర్నులు దాఖలు చేసేటప్పుడు దీన్ని ఇన్ కం ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనే శీర్షిక కింద వీటిని పొందుపరచాలి . ఫిక్సెడ్ డిపాజిట్లకు సెక్షన్ 80సీ కింద పొందుపరిచిన విధంగా పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే ఇది 1.5 లక్షల వరకు మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్(టీడీఎస్)ను నివారించి పన్ను ప్రయోజనాలను పొందే కొన్ని మార్గాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఫిక్సెడ్ డిపాజిట్ల వడ్డీలపై ఎంతమేరకు ఆదాయంపై పూర్తి పన్ను చెల్లించాలి ?
ఫిక్సెడ్ డిపాజిట్ ఆదాయం పూర్తిగా ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది. దీన్ని మీ స్థూల ఆదాయానికి జోడిస్తారు. అంతేకాకుండా మీ ఆదాయం సంబంధించిన స్లాబ్ రేట్లపై పన్ను చెల్లించాలి. వడ్డీ ఆదాయాన్ని మీ ఖాతాకు జమ చేసినందున బ్యాంకు ఈ పన్నును తీసివేస్తుంది. మీకు మూడేళ్ల ఫిక్సెడ్ డిపాజిట్ ఉంటే ప్రతి ఏడాది చివర్లో టీడీఎస్ ను మినహాయిస్తుంది. ఆదాయపుపన్ను శాఖ మీ మొత్తం పన్నుకు టీడీఎస్ ను లెక్కిస్తుంది. టీడీఎస్ నిలిపివేయనప్పటికీ మీ మొత్తం ఆదాయంలో వడ్డీ రాబడిని చేరిస్తే దానిపై పన్ను చెల్లించాలి. ఎఫ్డీ కాలపరిమితి పూర్తయే లోపు మీరు తిరిగి తీసుకుంటే మీ మొత్తం వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. అంతేకాకుండా అదనపు ట్యాక్స్ చెల్లించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది 26ఏఎస్ ఫారం ఆధారంగా మీ ఆదాయాల నుంచి టీడీఎస్ ల గురించి తెలుసుకోవచ్చు. మీ నికర రాబడిలో వడ్డీని చేర్చిన తర్వాత ఏదైనా పన్నుల చెల్లించాల్సి ఉంటే మీరు దాన్ని ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు అంటే మార్చి 31లోపు సమర్పించాలి. ఒకవేళ పెద్ద మొత్తంలో డబ్బు అందుకుంటే మీరు త్రైమాసిక ప్రతిపాదికన అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.

ఫిక్సెడ్ డిపాజిట్లపై టీడీఎస్..
ఫిక్సెడ్ డిపాజిట్లపై టీడీఎస్ అనేది బ్యాంకు నుంచి వచ్చే మొత్తంపై ఆధారపడి ఉంటుంది. మీకు ఉన్న అన్ని ఎఫ్డీల నుంచి వచ్చే మొత్తం వడ్డీ రాబడి ఏడాదికి రూ.40000 కంటే తక్కువ ఉంటే ఎలాంటి టీడీఎస్ ఉండదు. 60 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వృద్ధులకు రూ.50 వేల వరకు ఈ మినహాయింపు ఉంది.
-మీ ఫిక్సెడ్ డిపాజిట్లపై బ్యాంకు మీ వార్షిక వడ్డీని నిర్ణయిస్తుంది. ఈ రాబడి 40 వేలకంటే(వృద్ధులకు 50 వేలు) మించి ఉంటే 10 శాతం టీడీఎస్ చెల్లించాలి. మీ పాన్ నెంబరును బ్యాంకుకు సమర్పించకపోతే వారు మీ డిపాజిట్ నుంచి 20 శాతం టీడీఎస్ ను తీసివేస్తారు. అందుకే బ్యాంకులో మీ పాన్ నెంబరు ఉందో లేదో తనిఖీ చేయాలి.
-మొత్తం ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే పరిమితి కంటే తక్కువ ఉన్నప్పుడు టీడీఎస్ తీసివేయబడదు. ఎవరైనా వ్యక్తులు పన్ను చెల్లించనట్లయితే వారిపై బ్యాంకు టీడీఎస్ కూడా తీసివేయదు. అయితే మీరు 15జీ ఫామ్, 15హెచ్ సమర్పించాల్సి ఉంటుంది.

బ్యాంకులు టీడీఎస్ ను తీసివేయకుండా చూసుకోవడానికి ఉత్తమ ప్రత్యామ్నాయం 15జీ ఫారం, 15హెచ్ ఫారాన్ని మీ సంబంధిత బ్యాంకుకు సమర్పించాలి. అదనపు టీడీఎస్ మినహాయింపు అసౌకర్యాన్ని నివారించడానికి, ఐటీ విభాగం నుంచి ఈ మొత్తాన్ని తిరిగి వాపసు పొందడానికి ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఈ ఫారాలను సమర్పించాలి.

ఫిక్సెడ్ డిపాజిట్లు, పొదుపు ఖాతాలు, ఇతర డిపాజిట్ల నుంచి పొందే వడ్డీ ఆదాయం ఉన్న సీనియర్ సిటిజన్లు ఏడాదికి రూ.50 వేల పరిమితి వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అందువల్ల బ్యాంకుతో ఉన్న ఎఫ్డీ ఖాతాల నుంచి వృద్ధులకు వడ్డీ ఆదాయం ఏడాదికి 50 వేల కంటే తక్కువ ఉంటే టీడీఎస్ ఉండదు.

ఫిక్సెడ్ డిపాజిట్లపై పన్ను ప్రయోజనాలు పొందే మార్గాలు..
పన్ను ఆదా చేసే స్థిర డిపాజిట్లలో పెట్టుబడి పెట్టండి. పన్ను ఆదా చేసుకోవాలంటే మీరు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయవచ్చు. ఓ వ్యక్తి పాత లేదా ప్రస్తుతమున్న ట్యాక్స్ పద్దతిని ఎంచుకుంటే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను-పొదుపు స్థిర డిపాజిట్లలో పాల్గొనడం ద్వారా మీరు ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందవచ్చు. నికర పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంలో స్థిరపడటానికి, ఈ విధంగా పెట్టుబడి పెట్టిన మొత్తం స్థూల పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి నిలిపివేయబడుతుంది. 5 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి ఉన్న ఈ డిపాజిట్లపై అకాల ఉపసంహరణలు అనుమతించబడవు.

ఫిక్సెడ్ డిపాజిట్లకు వ్యతిరేకంగా రుణాన్ని దరఖాస్తు చేసుకోండి..
ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు రుణదాతల నుంచి రుణాలు పొందుతారు. బ్యాంకుల నుంచి ఎఫ్డీలపై రుణాలు పొందడం కూడా ఆ ఆప్షన్లలో ఒకటి. స్వల్పకాలిక రుణం పొందడానికి ఇది వేగవంతమైన, సరళమైన మార్గం. అనవసరంగా ఫిక్సెడ్ డిపాజిట్లు ఉపసంహరించుకునే బదులు డిపాజిటర్లు రుణం కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. సురక్షితమైన రుణం కోసం దీనిలో వినియోగదారులు ఫిక్సెడ్ డిపాజిట్లను రుణానికి బదులుగా తాకట్టు పెడతారు. బ్యాలెన్స్ ఎఫ్డీ మొత్తాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. పన్ను ఆదా చేసే స్థిర డిపాజిట్లను ఖాతాదారుడి ఎంపికను బట్టి ఒకే లేదా ఉమ్మడి ఖాతాలో ఉంచవచ్చు. ఉమ్మడి ఖాతా విషయంలో, అయితే పన్ను ప్రయోజనం మొదటి ఖాతాదారుడికి మాత్రమే లభిస్తుంది.

పోస్టాఫీసులో ఎఫ్డీల్లో పెట్టుబడి పెట్టండి..
బ్యాంకుకు వెళ్లే బదులు మీరు పోస్టాఫీసు శాఖలో ఫిక్సెడ్ డిపాజిట్ చేయాలి. పోస్టాఫీసు ఫిక్సెడ్ డిపాజిట్లకు టీడీఎస్ ఉండదు. 5 ఏళ్ల టర్మ్ డిపాజిట్లలో జమ చేస్తే డిపాజిటర్లు ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80సీ కింద 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. పోస్టాఫీసు ఎఫ్డీలపై వడ్డీరేట్లు మార్కెట్లో లభించే వాటి కంటే మెరుగ్గా ఉన్నాయి. ప్రస్తుత వడ్డీ రేటు ఒకటి నుంచి ఐదేళ్ల వరకు కాలపరిమితితో 5.5 శాతం నుంచి 6.7 శాతం వరకు ఉంది.

ఆన్ లైన్ లో 15జీ/15హెచ్ ను ఎలా ఫైల్ చేయాలి?
బ్యాంకులో ఈ ఫామ్స్ ఫైల్ చేసే బదులు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా 15జీ/హెచ్ ను ఆన్ లైన్ లో ఫైల్ చేయడానికి మీ బ్యాంకు మిమ్మల్ని అనుమతిస్తే ఈ విధంగా చేయవచ్చు.
-ముందుగా మీ బ్యాంకు నెట్ బ్యాంకింగ్ పోర్టల్ కు వెళ్లి మీ ఖాతా వివరాల ద్వారా లాగిన్ అవ్వండి.
-ట్యాక్స్ సెక్షన్ దగ్గరకు వెళ్లి ఫారం 15జీ/15హెచ్ పై క్లిక్ చేయండి.
-అనంతరం ఫారంలో తగిన వివరాలను పొందుపరిచి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి
-ఎక్ నాలెడ్జ్ మెంట్ స్లిప్ డౌన్ లోడ్ చేసుకొని సర్వీస్ రిక్వెస్ట్ నెంబరును నోట్ చేసుకోవాలి.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Money, Personal Finance, Save Money

తదుపరి వార్తలు