Instagram: టీనేజర్లకు ప్రమాదకరంగా మారుతున్న ఇన్‌స్టాగ్రామ్‌.. ఫేస్‌బుక్‌ డాక్యుమెంట్లలో ఏముందంటే.. 

Instagram

Instagram Latest News | ఇన్‌స్టాగ్రామ్‌ ఎక్స్‌ప్లోర్‌ పేజ్ ప్రమాదకరంగా మారిందని రీసెర్చర్లు గుర్తించినట్లు నివేదిక పేర్కొంది. అకౌంట్ల నుంచి కొన్ని పోస్టులను సేకరించి క్యూరేట్ చేసి ఈ ఫీచర్ యూజర్లకు చూపిస్తోంది. అయితే ఇందులో చోటు దక్కించుకోవాలనే ఆలోచనలో కొందరు టీనేజర్లు ప్రమాదకరమైన కంటెంట్ చేస్తున్నారని పేర్కొంది.

  • Share this:
Instagram effect on Teenagers | ఫేస్‌బుక్‌కు (Facebook) చెందిన ప్రముఖ ఫొటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దీన్ని వాడుతున్నారు. ముఖ్యంగా యువతను ఇన్‌స్టాగ్రామ్‌ చాలా ఆకర్షిస్తోంది. తమ ఫొటోలు, వీడియోలు షేర్ చేసేందుకు యూత్ ఈ యాప్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే కొందరు టీనేటర్లకు, ముఖ్యంగా యువతులకు ఇన్‌స్టాగ్రామ్‌ ప్రమాదకరంగా మారిందని ఫేస్‌బుక్‌ స్వయంగా సిద్ధం చేసిన నివేదిక (Facebook Report on Instagram) వెలువరించిందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్ (Wall street Journal) ఒక కథనం ప్రచురించింది. యువతపై ఇన్‌స్టాగ్రామ్‌ ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందన్న విషయంపై ఆ కథనం ఉంది. గత మూడేళ్ల డేటాను ఫేస్‌బుక్‌ అందులో పేర్కొంది.

ఇన్‌స్టాగ్రామ్‌ వల్ల కొందరు టీనేజర్లలో అత్మహత్య (Suicides in Teenagers) చేసుకోవాలన్న ఆలోచనలు వస్తున్నాయన్న సంచలన విషయాలను ఫేస్‌బుక్‌ పొందుపరిచిందని వాల్‌స్ట్రీట్‌ కథనంలో పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌ వాడుతున్న టీనేజర్లలో బ్రిటన్లో 13 శాతం, అమెరికాలో ఆరు శాతం మందిలో సూసైడికల్ ఆలోచనలు ఉన్నట్టు గుర్తించినట్టు ఫేస్‌బుక్‌ తెలిపిందట.

ఇన్‌స్టాగ్రామ్‌ వల్ల తమ శరీరాకృతి పట్ల 32 శాతం మంది టీనేజర్లు అసంతృప్తిగా మారారని, వారి పట్ల వారికి అయిష్టం కలిగేందుకు ఇన్‌స్టా కారణమవుతోందని చెప్పింది. ఇలా అయ్యేందుకు యాప్‌లో కొన్ని ఫీచర్లు కారణమని ఫేస్‌బుక్‌ పేర్కొందని ఆ కథనంలో ఉంది.


ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌ ఎక్స్‌ప్లోర్‌ పేజ్ ప్రమాదకరంగా మారిందని రీసెర్చర్లు గుర్తించినట్లు నివేదిక పేర్కొంది. అకౌంట్ల నుంచి కొన్ని పోస్టులను సేకరించి క్యూరేట్ చేసి ఈ ఫీచర్ యూజర్లకు చూపిస్తోంది. అయితే ఇందులో చోటు దక్కించుకోవాలనే ఆలోచనలో కొందరు టీనేజర్లు ప్రమాదకరమైన కంటెంట్ చేస్తున్నారని పేర్కొంది. అలాగే అత్యుత్తమైన ఫొటోలను, వీడియోలే ఎక్స్‌ప్లోర్‌లో వస్తుండటంతో చాలా మంది బాగా కనిపించాలనే తపనతో ఈ ప్లాట్‌ఫామ్‌కు బానిస అవుతున్నారని చెప్పింది.

Facebook Smart Glasses: క‌ళ్ల‌ద్దాల‌తో ఫోన్ మాట్లాడొచ్చు.. అదిరిపోయే ఫీచ‌ర్స్‌తో ఫేస్‌బుక్ స్మార్ట్ కళ్లజోడు



ఇన్‌స్టాగ్రామ్‌పై పరిశోధకులు తయారు చేసిన ఈ నివేదకను ఫేస్‌బుక్‌ ఉన్నతాధికారులు పరిశీలించారని, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు కూడా నివేదించారని సమాచారం. అయితే ఈ సమస్యకు ఫేస్‌బుక్‌ ఇంకా పరిష్కారం కనుగొనలేదట.

ఈ క్రమంలో 13 సంవత్సరాల లోపు పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక ఇన్‌స్టాగ్రామ్‌ వెర్షన్‌ను ఫేస్‌బుక్‌ తీసుకురానుంది. కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 22 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న యూజర్లు 40 శాతం మంది వరకు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్‌ వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నా టీనేజర్లు మాత్రం ఆ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించేందుకు మొగ్గుచూపుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఫేస్‌బుక్‌ సైతం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, వ్యాపారంపైనే దృష్టి పెడుతోందని కొందరు విమర్శలు చేస్తున్నారు. అలాగే పిల్లల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ను తీసుకురావడంపైనా కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Published by:Krishna Adithya
First published: