Home /News /explained /

EXPLAINSPEAKING UNION BUDGET 2022 INDIA ECONOMY DETAILS HERE GH VB

Explained: త్వరలో కేంద్ర బడ్జెట్.. పెట్టుబడులతో కూడిన ఎకనామిక్ రికవరీపైనే బడ్జెట్ ఆధారపడి ఉంటుందా..?

ప్రధాని మోదీ, ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ (ఫైల్)

ప్రధాని మోదీ, ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ (ఫైల్)

వచ్చేవారం పార్లమెంట్​లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది కేంద్రం. గతంలో మాదిరిగానే ఈ ఏడాది సైతం బడ్జెట్​పై అనేక అంచనాలు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా గత రెండేళ్లుగా అధిక ద్రవ్యోల్బణం(Inflation Rate) కారణంగా నిత్యావసరాల వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

ఇంకా చదవండి ...
వచ్చేవారం పార్లమెంట్​లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌(Budget)ను ప్రవేశపెట్టనుంది కేంద్రం. గతంలో మాదిరిగానే ఈ ఏడాది సైతం బడ్జెట్​పై అనేక అంచనాలు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా గత రెండేళ్లుగా అధిక ద్రవ్యోల్బణం(Inflation Rate) కారణంగా నిత్యావసరాల వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి బడ్జెట్​లో ధరలను తగ్గింపుపై ఏమైనా ప్రకటన ఉంటుందా? మంచి ఇల్లు కట్టుకోగలనా? ఆదాయపు పన్ను(Income Tax) తగ్గింపు ఉంటుందా? ఆదాయంపై మినహాయింపులు ఏమైనా పెరుగుతాయా? బడ్జెట్​లో ఉద్యోగ కల్పనపై ఏమైనా ప్రకటన ఉంటుందా? వంటి అనేక ప్రశ్నలు మీ మెదళ్లలో తలెత్తుతుండొచ్చు. ఇప్పటికే ఉత్పాదకత క్షీణించడం, నూతన ఉద్యోగాల సృష్టి మందగించడం వంటి సమస్యలతో అధిక ధరలు రాజ్యమేలుతున్నాయి. అయితే మరి వీటన్నింటినీ నివృత్తి చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి కీలక ప్రకటన ఉంటుందా?లేదా? అనేది వేచిచూడాలి.

కరోనా కారణంగా గత మూడేళ్లుగా భారత ఆర్థిక వృద్ధి(Economic Growth) మందగిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం వద్ద ఉన్న వ్యూహాలేంటి? అనేది అతి ముఖ్యమైన ప్రశ్న. నిజం చెప్పాలంటే ఈ సమయంలో కీలక నిర్ణయం తీసుకుంటే తప్ప రాబోయే దశాబ్దంలో భారత వృద్ధి సానుకూల దిశలో పయనించేందుకు ఆస్కారం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్​, ఆర్థికాంశాలపై విశ్లేషణను ఓసారి చూద్దాం..

Research on Ageing: మనిషి వృద్ధాప్యం సమస్యను అధిగమించే ప్రయోగం.. ఎలా సాధ్యం..? పూర్తి వివరాలిలా..


భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగమనం(Growth Decline) అనేది పెద్ద నోట్ల రద్దు నుంచి కొవిడ్ సంక్షోభం ప్రారంభమయ్యే వరకు ఒక దశ అని చెప్పవచ్చు. ఎందుకంటే.. GDP వృద్ధి రేటు 2016-17లో 8 శాతం ఉండగా.. 2019-20లో 4 శాతానికి పడిపోయింది. మిలియన్ల కొద్దీ కొత్త ఉద్యోగాలను సృష్టించాల్సిన తయారీ, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు భారీ పతనాన్ని చవిచూశాయి. ఫలితంగా 2021 నుంచి నిరుద్యోగులు అరకొర ఆదాయ రంగమైన వ్యవసాయ వైపు మళ్లారు. మొత్తంగా.. భారత్​లో ఉపాధి కల్పన రేటు ఘోరంగా పడిపోయింది. ఓవైపు నిరుద్యోగం, క్షీణిస్తున్న వృద్ధి కారణంగా అసమానతలు పెరిగిపోయాయి. పేదరిక నిర్మూలన అటుంచితే.. దారిద్ర్యం పెరిగిపోయిందని సర్వేలు ఘోషిస్తున్నాయి.

మరోవైపు.. కొవిడ్ సంక్షోభ సమయంలో ప్రభుత్వం అవలంబించిన విధానాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వృద్ధిలో క్షీణతను అంగీకరించేందుకు ప్రభుత్వం ఇష్టపడలేదు. పైగా.. ఆర్థిక వ్యవస్థలో(Indian Economy) సరఫరాను పెంచే లక్ష్యంతో కార్పొరేట్ ఆదాయపు పన్ను రేట్లలో కోత విధించింది. చివరిగా.. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్​ ఉన్నప్పటికీ సరఫరాలో లోపాలున్న అంశాన్ని కేంద్రం పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ఇక కొవిడ్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల తగ్గిన ఆదాయం వల్లే డిమాండ్ పెరిగిందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. పెట్టుబడుల ద్వారా సరఫరాను పెంచి ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆర్థికవేత్తలు వాదిస్తున్నారు.

గతేడాది రెండో త్రైమాసికంలో ప్రభుత్వం విడుదల చేసిన GDP గణాంకాల ప్రకారం.. ప్రైవేట్ వినియోగ డిమాండ్, ప్రభుత్వ వినియోగ డిమాండ్, నూతన పెట్టుబడుల ప్రణాళికను గమనిస్తే.. ఆశ్చర్యకరంగా డిమాండ్ తక్కువగా ఉన్న 2019-20 కంటే.. ప్రభుత్వ వ్యయం కనిష్ఠ స్థాయికి పడిపోయిన 2022 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అధిక పెట్టుబడులు వచ్చాయి. ఇది గత ఐదేళ్లలో అన్ని రెండో త్రైమాసికాల కంటే ఎక్కువ.

Zodiac Signs-Kindness: ఈ రాశుల వారు ఎంతో దయాగుణం కలిగి ఉంటారు.. అందులో మీరు కూడా ఉన్నారా..


ప్రభుత్వ ప్రాజెక్ట్‌లు-వివిధ దశలు..
2020-25 ఆర్థిక సంవత్సరం మధ్య 111 లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అప్పటి రుణ లభ్యతను బట్టి ఈ మొత్తంలో మూడింట రెండొంతులు మాత్రమే ఖర్చు చేయగలదని నోమురా అంచనా వేసింది. ఈ ప్రణాళికలో కేంద్రం 40% వాటాను అందించాల్సి ఉండగా.. వార్షిక ఖర్చు 9-10 లక్షల కోట్ల రూపాయలు. ఇది గత మూడేళ్లలో ఖర్చు చేసిన వేగం కంటే 60% ఎక్కువ. మరో 40% రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సి ఉంది. ఆదాయాల కొరత కారణగా ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు మూలధన వ్యయంలో రాజీ పడాల్సి వస్తోంది. చివరగా.. 111 లక్షల కోట్ల రూపాయ లక్ష్యంలో ప్రైవేట్ రంగం వాటా 21 శాతం. ఏదేమైనప్పటికీ.. బ్యాంకులు, ఆర్థిక సంస్థల సాయంతో మంజూరైన ప్రస్తుత ప్రాజెక్టులు ముందుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదని నోమురా విశ్లేషించింది.

కొత్త పెట్టుబడుల ఖర్చు తీరు..
మొత్తం కొత్త ప్రాజెక్ట్‌ల గ్రాఫ్‌ను గమనిస్తే.. "2022 ఆర్థిక సంవత్సరంలో కొనసాగుతున్న ప్రాజెక్ట్‌ల్లో దాదాపు రూ.1,075 బిలియన్లు ఖర్చయ్యాయి. కొత్త పెట్టుబడులు గణనీయంగా పుంజుకుంటే తప్ప ఇవి ముందుకు జరగని పరిస్థితి లేదు.

స్థూల ఆర్థిక వ్యవస్థపై(Indian Economic Growth) ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ.. 2000 సంవత్సరం ప్రారంభంలో తక్కువ ద్రవ్యోల్బణం, అధిక వృద్ధి ఉండేది. కానీ.. ప్రస్తుత ద్రవ్యోల్బణం 5 శాతం కంటే ఎక్కువగానే ఉంటోంది. అందువల్ల.. వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం ఆశిస్తోంది. మరో ముఖ్య విషయం గమనిస్తే.. అల్పాదాయ కుటుంబాల వినియోగ డిమాండ్ బలహీనంగా ఉంది. సామర్థ్య వినియోగ రేటు ఇప్పటికీ 70% కంటే తక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో "దీర్ఘకాలిక పెట్టుబడి సవాలు" భారత్​కు పెద్ద సమస్య అని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ పేర్కొంది.

మౌలిక సదుపాయాల కల్పనలో వృద్ధి..
దేశంలోని మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు నెమ్మదిగా పెరుగుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. గతేడాదితో పోలిస్తే 2022 ఆర్థిక సంవత్సర బడ్జెట్ నుంచి మూలధన వ్యయం కోసం 5.5లక్షల కోట్ల రూపాయలు కేటాయించినట్లు పేర్కొంది. ఇది గతేడాది కంటే 26% పెరుగుదల అని చెబుతోంది. దశాబ్దం క్రితమే జీడీపీలో వాటాను అత్యధిక స్థాయికి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనితో స్వల్పకాలిక పెట్టుబడులు పెరిగినప్పటికీ.. ఆర్థిక పరిమితులు, క్రెడిట్ రేటింగ్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.
Published by:Veera Babu
First published:

Tags: Budget, Nirmala sitharaman, Pm modi, Union Budget 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు