హోమ్ /వార్తలు /Explained /

Explained: ఉక్రెయిన్ విషయంలో రష్యాపై అమెరికా ఆంక్షలు..? ఇందుకు అమెరికా ముందున్న ఆప్షన్లు ఏవి..?

Explained: ఉక్రెయిన్ విషయంలో రష్యాపై అమెరికా ఆంక్షలు..? ఇందుకు అమెరికా ముందున్న ఆప్షన్లు ఏవి..?

ఐరోపాలో యుద్ధవాతావరణం కనిపిస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తుందనే ఆరోపణలతో ఈ ప్రచారం ఊపందుకుంది. ఒకవేళ ఉక్రెయిన్‌పై దాడి చ?

ఐరోపాలో యుద్ధవాతావరణం కనిపిస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తుందనే ఆరోపణలతో ఈ ప్రచారం ఊపందుకుంది. ఒకవేళ ఉక్రెయిన్‌పై దాడి చ?

ఐరోపాలో యుద్ధవాతావరణం కనిపిస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తుందనే ఆరోపణలతో ఈ ప్రచారం ఊపందుకుంది. ఒకవేళ ఉక్రెయిన్‌పై దాడి చ?

  ఐరోపాలో యుద్ధవాతావరణం కనిపిస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తుందనే ఆరోపణలతో ఈ ప్రచారం ఊపందుకుంది. ఒకవేళ ఉక్రెయిన్‌పై దాడి చేస్తే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఆంక్షలు(Sanctions) విధిస్తామని అమెరికా హెచ్చరిస్తోంది. అంతర్జాతీయ బ్యాంకింగ్ లావాదేవీలు, డాలర్ల నియంత్రణ నుంచి పుతిన్ స్నేహితురాలిగా నివేదిస్తున్న మాజీ ఒలింపిక్ జిమ్నాస్ట్ అలినా కాబేవా వరకు వ్యక్తిగత ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేస్తోంది. బహిరంగంగా పుతిన తన సైన్యాన్ని ఉక్రెయిన్‌లోకి(Ukraine) పంపితే మునుపెన్నడూ లేని విధంగా రష్యాను(Russia) ఆర్థికంగా దెబ్బతీస్తామని అమెరికా, ఐరోపా మిత్రదేశాలు వాగ్ధానం చేశాయి. అయితే మరోపక్క రష్యా ఈ వార్తలను తోసిపుచ్చుతోంది. తమ దేశ భూభాగంలో ఎక్కడి నుంచైనా సైన్యాన్ని మార్చుకునే హక్కు తమకుందని వాదిస్తోంది.

  ఈ అంశంపై గత కొన్ని వారాలుగా చర్చలు జరుగుతున్నాయి. పుతిన్‌పై ఎలాంటి ఆంక్షలు విధిస్తారు? వాటిని ప్రేరేపించడానికి ఐరోపా దేశాలతో ఏకాభిప్రాయాన్ని కుదర్చడానికి అమెరికా ఎంతమేరకు విజయం సాధించింది? లాంటి విషయాలపై స్పష్టత లేదు. అయితే కొన్ని ఆర్థిక ఆంక్షలు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  North Korea: ఉత్తర కొరియా మరో క్రూయిజ్ క్షిపణి పరీక్ష.. ఈ సంవత్సరంలో ఇది ఐదోది.. టార్గెట్ ఆ దేశమేనా..?


  స్విఫ్ట్(SWIFT) చర్యలు..

  అమెరికా, తన ఐరోపా మిత్రదేశాల కోసం బ్యాంకు నుంచి బ్యాంకు డబ్బు మార్చే వ్యవస్థను రూపొందించిది. ఆ వ్యవస్థనే స్విఫ్ట్ అంటారు. ఉక్రెయిన్‌పై దాడి చేస్తే ఈ విధానం నుంచి రష్యాను తొలగించవచ్చు. ఫలితంగా రష్యా ఆర్థిక వ్యవస్థపై తక్షణమే దెబ్బపడుతుంది. ఎందుకంటే ఇది ఆ దేశ ఎకానమీని దీర్ఘకాలికంగా దెబ్బతీసే అత్యంత కఠినమైన ఆర్థిక చర్యల్లో ఒకటి. చమురు, గ్యాస్ ఉత్ప్తతి ద్వారా అంతర్జాతీయంగా లాభాలు, లావాదేవీల నుంచి ఈ చర్య రష్యాను కుంగదీయగలదు. ఎందుకంటే ఇది ఆ దేశ ఆదాయంలో 40 శాతం కంటే ఎక్కువ.

  2014లో ఉక్రెయిన్ నుంచి క్రిమియాను రష్యా ఆక్రమించినప్పుడు ఇరు వైపులా మిత్ర దేశాలు స్విఫ్ట్ ఆప్షన్‌ను పరిగణించాయి. స్విఫ్ట్‌ నుంచి తమను తొలగించడం యుద్ధ ప్రకటనతో సమానమని అప్పుడే రష్యా ప్రకటించింది. మిత్రపక్షాలు అప్పుడు ఆ ఆలోచనను విరమించుకున్నాయి. ఫలితంగా మిత్రపక్షాలు బలహీన స్పందనకు విమర్శలు ఎదురయ్యాయి. అప్పటి నుంచి రష్యా సొంత ఆర్థిక బదిలీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించింది.

  ఇదిలా ఉంటే ఇప్పటికే అణు అంశం ఎత్తి చూపి స్విఫ్ట్ నుంచి ఇరాన్‌ను తొలగించడంలో అమెరికా విజయం సాధించింది. అయితే రష్యాను తొలగిస్తే అగ్రరాజ్యానికి కీలక మిత్రదేశమైన జర్మనీ సహా ఇతర ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసే అవకాశముంది. ఇదే విషయంపై జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలేనా బేర్‌బాక్ సందేహాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కఠినమైన కర్ర ఎల్లప్పుడూ అత్యంత తెలివైన కత్తిగా ఉండదని ఆయన ఇటీవలే స్విఫ్ట్ ఆలోచన గురించి అభివర్ణించారు.

  డాలర్ క్లియరింగ్

  పుతిన్ ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తే అందుకు ప్రతిగా అమెరికా అత్యంత శక్తిమంతమైన ఆర్థిక ఆయుధాలను కలిగి ఉంది. అదే యూఎస్ డాలర్ నుంచి రష్యాను నిరోధించడం. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక లావాదేవీలు డాలర్ల రూపంలోనే జరుగుతున్నాయి. ప్రతిరోజూ ట్రిలియన్ల డాలర్లు చేతులు మారుతున్నాయి. అమెరికన్ కరెన్సీ ద్వారా అన్ని లావాదేవీలు జరుగుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ డాలర్‌ను క్లియర్ చేస్తుంది. ముఖ్యంగా పుతిన్‌కు డాలర్ లావాదేవీలను సెటిల్ చేయడానికి విదేశీ బ్యాంకులు అమెరికా ఆర్థిక వ్యవస్థను యాక్సెస్ చేయగలగాలి. ఆ యాక్సెస్‌ను నిరోధించే సామర్థ్యం అమెరికా చేతిలో ఉంది. కాబట్టి రష్యాకు ఈ చర్య గొడ్డలిపెట్టుగా మారవచ్చు. ఇప్పటికే ఇరాన్, సూడాన్ లాంటి తదితర దేశాలు ఆంక్షలను ఉల్లంఘించినందుకు డాలర్ క్లియరింగ్‌ను అమెరికా సస్పెండ్ చేసింది.

  ఎగుమతి నియంత్రణలు

  ఇదే కాకుండా ఎగుమతి నియంత్రణలను విధించడాన్ని కూడా వైట్ హౌస్ పరిశీలిస్తోందని శ్వేత సౌథం ప్రెస్ సెక్రటరీ జనరల్ ప్సాకీ ధ్రువీకరించారు. ఇప్పటికే క్యూబా, ఇరాన్, ఉత్తర కొరియా, సిరియాతో పాటు ఎగుమతి నియంత్రణ ప్రయోజనాల కోసం రష్యాను అత్యంత నిర్బంధిత దేశాల సమూహంలో చేర్చడం ఇందులో ఉండవచ్చని అధికారులు తెలిపారు. US సాఫ్ట్‌వేర్, సాంకేతికత పరికరాల ప్రపంచ ఆధిపత్యం కారణంగా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌లు కలిగి ఉన్న ఉత్పత్తులను పొందగల రష్యా సామర్థ్యం తీవ్రంగా పరిమితం అవుతుందని అర్థం చేసుకోవచ్చు. దీని ప్రభావం ఎయిర్‌క్రాఫ్ట్ ఏవియానిక్స్, మెషిన్ టూల్స్, స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్ కన్సోల్‌లు, టాబ్లెట్‌లు, టెలివిజన్‌లకు ఇవి విస్తరించవచ్చు. ఇలాంటి ఆంక్షలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా క్వాంటం కంప్యూటింగ్‌లో అయినా రష్యా హై-టెక్ ఆశయాలను దెబ్బతీసి దాని రక్షణ, పౌర విమానయాన రంగాలను లక్ష్యంగా చేయవచ్చు.

  బాండ్ మార్కెట్లు

  బైడెన్ అడ్మినిస్ట్రేషన్ గత సంవత్సరం దేశ సంస్థల నుంచి నేరుగా రష్యన్ ప్రభుత్వం బాండ్లను కొనుగోలు చేయకుండా డబ్బు తీసుకునే సామర్థ్యాన్ని పరిమితం చేసింది. అయితే ఈ ఆంక్షలు సెకండరీ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకోలేదు.

  Zodiac Signs-Kindness: ఈ రాశుల వారు ఎంతో దయాగుణం కలిగి ఉంటారు.. అందులో మీరు కూడా ఉన్నారా..


  నేచురల్ గ్యాస్ పైప్‌లైన్

  కాంగ్రెస్‌లోని రిపబ్లికన్లు, డెమోక్రాట్లు రష్యా నూతన నార్డ్ స్ట్రీమ్ 2 నేచురల్ గ్యాస్ పైప్‌లైన్‌ జర్మనీకి ఇవ్వడంపై ఏళ్ల తరబడి పోరాడారు. ఐరోపాలో తన లక్ష్య సాధనకు ఈ పైప్ లైన్‌ను రష్యా నియంత్రణ పరపతిగా ఉపయోగించుకుంటుందని వాదించారు. అయితే ఈ విషయంలో రిపబ్లికన్లు వెంటనే ఆంక్షలు విధించాలని కోరుకుంటుండగా.. డెమోక్రాట్లు కాస్త ఆలోచనలో ఉన్నారు. అయితే ఉక్రెయిన్‌పై దాడి చేస్తే డెమోక్రాట్లు కూడా ఈ అంశానికి మద్ధతు తెలపవచ్చు. మిత్రదేశమైన జర్మనీకి అవరోధం కాకూడదని బైడెన్ ప్రభుత్వం గతంలో ఆ స్థాయి ఆంక్షల వరకు వెళ్లలేదు. రష్యా ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తే పైప్‌లైన్ ఆంక్షలు వైట్ హౌస్ టేబుల్‌పై ఉంటుందని జర్మన్ అధికారులు అంటున్నారు.

  ఎవరిని లక్ష్యంగా చేసుకోవచ్చు?

  నాయకుల కుటుంబాలు, వ్యాపారాలపై ఆంక్షలు విధించడం అమెరికా ఎక్కువగా ఉపయోగించే వ్యూహాల్లో ఒకటి. ఇదే విధానం పుతిన్‌పైనా ఉండవచ్చు. రష్యా శక్తిమంతమైన వ్యాపారం ఒలిగార్చ్‌లు, దాని బ్యాంకులు. అంతేకాకుండా పుతిన్ స్నేహితులు, కుటుంబ సభ్యుల వీటిని ఎదుర్కోవచ్చు. ఆంక్షలతో రష్యా ఎగువ స్ధాయిలో అనేకమందిని లక్ష్యంగా చేసుకోవాలని కూడా వారు కోరుతున్నారు.

  First published:

  Tags: America, Explained, Russia

  ఉత్తమ కథలు