హోమ్ /వార్తలు /Explained /

Explainer: ఉప్పునీటితో జీరో కార్బన్ తాగు నీరును ఉత్పత్తి చేయగలమా? సౌదీ అరేబియాలో డీశాలినేషన్‌ ఎలా కొనసాగుతోంది?

Explainer: ఉప్పునీటితో జీరో కార్బన్ తాగు నీరును ఉత్పత్తి చేయగలమా? సౌదీ అరేబియాలో డీశాలినేషన్‌ ఎలా కొనసాగుతోంది?

ప్రతీకాత్మక చిత్రం(Getty Images)

ప్రతీకాత్మక చిత్రం(Getty Images)

Explainer: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో సంవత్సరానికి కేవలం 3 సెంటీమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదవుతుంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే కొన్ని దశాబ్దాలుగా వర్షాలే కురవలేదు.

అనేక దేశాల్లో మంచినీటి కష్టాలు తప్పడం లేదు. కొన్ని దేశాల చుట్టూ సముద్ర జలాలు ఉన్నా, అవి తాగడానికి ఉపయోగపడటం లేదు. అయితే డీశాలినేషన్‌ (Desalination) ప్రక్రియ ద్వారా తక్కువ ఇంధన వినియోగంతో ఉప్పునీటిని మంచినీటిగా మారుస్తూ సౌదీ అరేబియా పలు దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. సౌదీ అరేబియాకు తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో సముద్రం సరిహద్దుగా ఉంది. ఇది భూమిపై అత్యంత వేడి కలిగిన ప్రదేశం కూడా. మంచినీటి విలువ వారికి తెలిసినట్టుగా మరెవరికి తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇలా ఉపయోగపడని ఉప్పునీటిని డీశాలినేషన్‌ ప్రక్రియ ద్వారా మంచి నీటిగా మారుస్తూ ప్రజల అవసరాలు తీరుస్తున్నారు.

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో సంవత్సరానికి కేవలం 3 సెంటీమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదవుతుంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే కొన్ని దశాబ్దాలుగా వర్షాలే కురవలేదు. ఇక వేసవిలో ఇక్కడ 40 నుంచి 55 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. దేశంలో నదులు, సరస్సులు కూడా లేకపోవడంతో భూగర్భ జలాలు వేగంగా తరిగిపోతున్నాయి. సముద్రపు ఉప్పునీటిని డిశాలినేట్ చేసి వాడుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఉప్పు నీటిని డీశాలినేషన్‌ చేస్తున్న దేశాల్లో సౌదీ అగ్రగామిగా నిలిచింది.

* జీరో కార్బన్ డీశాలినేషన్‌

సహజంగా స్వేధనం ద్వారా డీశాలినేషన్‌ చేస్తారు. అయితే ఇక్కడ ఉప్పునీటి నుంచి లవణాలు వేరు చేసి, తాగడానికి అనువైన నీటిని వేరు చేసేందుకు సముద్రపు నీటిని వేడి చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఎంతో ఖర్చుతో కూడుకుంది. అయితే 2016లో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్.. విజన్- 2030 ప్రకటించారు. ఇందులో పునరుత్పాదక వనరుల నుంచి ఎనర్జీ తయారు చేయడం, కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ప్రాముఖ్యత నిచ్చారు. దీంతో ఇప్పుడు సౌదీలో కాలుష్య రహిత ఇంధనం ఉత్పత్తి చేసుకోవడం ఒక భాగంగా మారింది.

దేశంలో డిశాలినేటెడ్ నీటి ఉత్పత్తిలో సెలైన్ వాటర్ కన్వర్షన్ కార్పొరేషన్ ( SWCC) అగ్రగామిగా నిలిచింది. దేశంలో 70 శాతం ఈ సంస్థే డీశాలినేషన్‌ చేస్తోంది. డీశాలినేషన్‌ ప్రక్రియలో సెలైన్ వాటర్ కన్వర్షన్ కార్పొరేషన్ నాలుగోవంతుకు ఇంధన వినియోగం తగ్గించింది. ఫైన్ మెంబ్రయిన్ ఫిల్టర్ల ద్వారా ఉప్పునీటిని పంప్ చేయడం ద్వారా డీశాలినేషన్‌ చేస్తున్నారు. దీంతో ఇంధన వినియోగం నాలుగో వంతుకు తగ్గించగలిగారు.

డీశాలినేషన్‌ లో మెంబ్రేన్ ఫిల్ట్రేషన్ టెక్నాలజీ ద్వారా ఇంధన వినియోగం గణనీయంగా తగ్గించగలిగారు. డీశాలినేషన్‌ ప్రక్రియలో ఇంధన వినియోగం తగ్గించడంలో సౌదీ అరేబియా 2021 లో కొత్త గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. డీశాలినేట్ చేయడంలో ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించామని, అయినా ఇంకా మెరుగ్గా చేయాలనుకుంటున్నట్టు సెలైన్ వాటర్ కన్వర్షన్ కార్పొరేషన్ కన్సల్టింగ్ ఇంజనీర్ నికోలాయ్ వుచ్కోవ్ తెలిపారు.

2030 నాటికి డీశాలినేషన్‌ లో ఇంధన వినియోగాన్ని సగానికిపైగా తగ్గించడంతోపాటు, కార్బన్ రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాంకేతిక పరిజ్ఙానం మెరుగుపరచడం ద్వారా ఈ లక్ష్యం సాధించాలని నిర్ణయించుకున్నట్టు వుచ్కోవ్ తెలిపారు. వ్యర్థాలను జీరోకు తగ్గించేందుకు మెరుగైన పరికరాలు ఉపయోగించడం ద్వారా డీశాలినేషన్‌ లో శిలాజ ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గించనున్నారు.

ఇది కూడా చదవండి : కాలుష్య రహిత ఇంధన వినియోగంలో దూసుకుపోతున్న భారత్​.. కార్భన్​ ఫుట్​ ప్రింట్​ కట్టడిలో ముందంజ

కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను మరింత తగ్గించేందుకు డీశాలినేషన్‌ చేపట్టే పరిశ్రమల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచే కార్యక్రమం కూడా చేపట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకోవడం ద్వారా డీశాలినేషన్ పరిశ్రమలను మరింత స్మార్ట్ గా తయారు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో యంత్రాలు నీటిని ఉత్పత్తి చేసేప్పుడు వాటి శక్తిని, రసాయనాల వినియోగాన్ని తమంతట తామే నియంత్రించుకుంటాయి.

సోలార్ డోమ్ ఏర్పాటు చేయడం ద్వారా సముద్రపు నీటిని ఆవిరి చేసి మంచినీరు ఉత్పత్తి చేయాలని ప్రణాళికలు సిద్దం చేశారు. స్టీమ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిలో ఈ సాంకేతికత వినియోగిస్తున్నారు. అయితే డీశాలినేషన్‌ కోసం ఉపయోగించడం మాత్రం ఇదే తొలిసారి.

ఇది కూడా చదవండి : ఆంధ్రప్రదేశ్​తో పాటు ఈ రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తుల ముప్పు ఎక్కువే!..

సముద్రపు నీటిని ఆవిరి చేసి మంచినీరుగా మార్చుకునేందుకు ప్రోటోటైప్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా చదరపు మీటరు ప్యానెల్ ద్వారా గంటకు 1.641 లీటర్ల మంచి నీరు ఉత్పత్తి అవుతోంది. ఇలా ఉత్పత్తి చేసిన నీటిని ఇక శుద్ధి చేయాల్సిన అవసరం కూడా లేదు.

* ఉప్పునీటిని మంచినీరుగా మార్చడం

డీశాలినేషన్‌ ద్వారా ఉప్పునీటిని మంచినీరుగా మారుస్తారు. ఈ ప్రక్రియలో విడుదలైన ఉప్పు నీటిని మళ్లీ సముద్రంలోకి విడుదల చేస్తారు. సౌదీ అరేబియా డీశాలినేషన్‌ ప్రక్రియ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పునీరు విడుదల చేస్తున్న దేశంగా నిలిచింది. అయితే సముద్రంలో ఉప్పునీటిని కలపడం వల్ల ఏర్పడే పర్యావరణ ప్రభావాలను అంచనా వేయడానికి, వాటిని నియంత్రించడానికి సమగ్ర వ్యవస్థ కలిగి ఉన్నట్టు సౌదీ అరేబియా ప్రకటించింది.

డీశాలినేషన్‌ ప్రక్రియలో వస్తున్న వ్యర్థాలను కూడా శుద్ధి చేసి విడుదల చేస్తున్నారు. దీని వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదని చెబుతున్నారు. ఇలా వెలువడుతున్న వ్యర్థ జలాల్లో సోడియం క్లోరైడ్, మెగ్నీషియం, రుబిడియం పుష్కలంగా ఉన్నాయి. ఈ వనరుల వెలికితీత ద్వారా పారిశ్రామిక అవసరాలు తీర్చవచ్చని అంచనా వేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్లాంటు ద్వారా సోడియం క్లోరైడ్, క్లోరిన్, కాస్టిక్ సోడా ఉత్పత్తులను కూడా తయారు చేసి విక్రయించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ ఉత్పత్తులను విక్రయించేందుకు దేశంలోని అనేక కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్టు ఎస్‌డబ్యూ సీసీ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ డీశాలినేషన్‌ టెక్నాలజీస్ డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ అల్ అమౌదీ తెలిపారు.

First published:

Tags: Saudi Arabia, Save water, Water, Water problem

ఉత్తమ కథలు