హోమ్ /వార్తలు /Explained /

Explained: బూస్టర్​ డోసులతో ఒమిక్రాన్​​పై విజయం సాధించగలమా? నిపుణుల మాటేంటి?

Explained: బూస్టర్​ డోసులతో ఒమిక్రాన్​​పై విజయం సాధించగలమా? నిపుణుల మాటేంటి?

బూస్టర్​ డోసులతో ఒమిక్రాన్​​పై విజయం సాధించగలమా? నిపుణుల మాటేంటి?

బూస్టర్​ డోసులతో ఒమిక్రాన్​​పై విజయం సాధించగలమా? నిపుణుల మాటేంటి?

బూస్టర్​ డోసులపై(corona vaccine booster dose) ఆధారపడటం ఎంతవరకు కరెక్ట్? ఇలా ఒకదాని తర్వాత మరో ఎక్స్​ట్రా డోస్ ఇచ్చుకుంటూ పోవడం మంచిదేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..

కరోనా వైరస్​కు టీకా(corona vaccine) వస్తే బాగుండు అనుకునే రోజుల నుంచి.. టీకా మూడో డోసు వేసుకుంటే బాగుండు అనుకునే దశకు చేరుకుంది ప్రపంచం. గతేడాది వరకు కేవలం రెండు డోస్‌ల కొవిడ్ వ్యాక్సిన్ కరోనావైరస్ నుంచి రక్షిస్తుందని భావించాం. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇటీవలే ఒమిక్రాన్ వేరియంట్‌ను అడ్డుకునేందుకు అంటూ.. ఇజ్రాయెల్ అనూహ్యంగా నాలుగో డోసును సైతం అందించడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అసలు బూస్టర్​ డోసులపై(corona vaccine booster dose) ఆధారపడటం ఎంతవరకు కరెక్ట్? ఇలా ఒకదాని తర్వాత మరో ఎక్స్​ట్రా డోస్ ఇచ్చుకుంటూ పోవడం మంచిదేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..

రెండు డోసులతో కరోనాను నిలువరించే పరిస్థితి లేకపోవడంతో.. "టీకా పూర్తి డోసు" తీసుకున్న వ్యక్తులు అని సంబోధించడం ఆపేసింది అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(us cdc booster). అంతేగాక.. దేశంలోని మరింత మంది టీనేజర్లు బూస్టర్‌ డోసు అందుకునేందుకు వీలు కల్పిస్తూ ఏజ్​ లిమిట్​ను సడలించింది. టీకాల విషయంలో ఈ అంశాలు ఆశ్చర్యపరిచేవేమీ కాదు. వాస్తవానికి.. ఈ ట్రెండ్ ఎక్కడ ముగుస్తుందో అర్థం కాని పరిస్థితి. ప్రతి కొన్ని నెలలకోసారి ‘టీకా డోస్​ పంపిణీ తెరపైకి వస్తోంది. భవిష్యత్తును అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాని అంశమే. అయినప్పటికీ.. ప్రతిసారీ మొత్తం జనాభాకు వ్యాక్సిన్ పంపిణీ అనేది వాస్తవికంగా లేదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

"కాలానుగుణంగా వ్యాక్సిన్‌లు ఇవ్వడం అసాధారణ విషయమేమీ కాదు. కానీ.. ఆరు నెలలకోసారి బూస్టర్‌ డోసులు అందివ్వడం కంటే మెరుగైన మార్గాలు(booster dose importance) ఉన్నాయని నేను భావిస్తున్నా" అని యేల్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త అకికో ఇవాసాకి అన్నారు. రోగనిరోధక శక్తిని పెంచే శాశ్వతంగా పెంచే మార్గాలే ఈ మహమ్మారుల నుంచి మానవాళిని బయట పడేయగలవని ఆమె అభిప్రాయపడ్డారు. బూస్టర్ డోసుల కోసం లైన్లలో నిలుచునేలా ప్రజలను ఒప్పించడం అంత సులువేం కాదు. 73% టీకాలు పూర్తైన అమెరికాలో ఇప్పటివరకు కేవలం మూడింట ఒక వంతు మంది మాత్రమే బూస్టర్‌ను ఎంచుకున్నారని ఆమె గుర్తుచేస్తున్నారు.

"బూస్టర్ డోసు పంపిణీ అనేది స్థిరమైన, దీర్ఘకాలిక వ్యూహంగా కనిపించడం లేదు" అని అరిజోనా విశ్వవిద్యాలయంలో రోగనిరోధక శాస్త్రవేత్త దీప్తా భట్టాచార్య అన్నారు. బూస్టర్ షాట్‌లు యాంటీబాడీలను పెంచుతాయనేది నిజమే. ఇన్‌ఫెక్షన్‌ను అడ్డుకోవడంలోనూ సహాయపడతాయి. దీనివల్ల వైరస్ వ్యాప్తిని తాత్కాలికంగా నిలిపేస్తూ.. ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించవచ్చు. కానీ ఇది తాత్కాలికమే. మూడో డోసు తీసుకున్న కొన్ని వారాల తర్వాత యాంటీబాడీ స్థాయులు క్షీణిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి.

గతంలో వచ్చిన కరోనా వేరియంట్ల ఆధారంగా బూస్టర్ డోసును రూపొందించడం సరైంది కాదని సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన ఇమ్యునాలజిస్ట్ అలీ ఎల్లెబెడీ తెలిపారు. మూడో డోసు తర్వాత మరో డోసు తీసుకోవాలని సూచిస్తే.. అది కచ్చితంగా ఒమిక్రాన్ ఆధారిత డోసే అయిఉండాలని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ లేదా భవిష్యత్ వేరియంట్‌లకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అసలు బూస్టర్​ డోసుల కంటే ఇతర వ్యూహాలే మెరుగ్గా పనిచేస్తాయని తెలిపారు. అంతేగాక.. టీకా డోసుల మధ్య సమయాన్ని పెంచడం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతం చేయవచ్చు అంటున్నారు. మన శరీరంలో పెద్దమొత్తంలో యాంటీబాడీలు(antibiotic resistance) ఉన్నప్పటికీ.. వైరస్‌ను చాలా కాలం పాటు ఆపలేమని కాలిఫోర్నియాలోని లా జోల్లా ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇమ్యునాలజీ అధ్యయనకర్త షేన్ క్రోటీ అంటున్నారు.

భిన్నాభిప్రాయాలు..

వాస్తవానికి బూస్టర్ షాట్ ఆలోచనను చాలా మంది నిపుణులు మొదట్లో వ్యతిరేకించారు. ఇన్​ఫెక్షన్​కు గురైన వారిని ఆసుపత్రి నుంచి దూరంగా ఉంచేందుకు మామూలు టీకా సరిపోతుందని భావించారు. అనేక దేశాల్లో ఎంతోమంది ప్రజలు మొదటి డోసు కూడా అందుకోలేదని. అటువంటప్పుడు సంపన్న దేశాలు బూస్టర్ షాట్‌ల కోసం వ్యాక్సిన్‌లను నిల్వ చేసుకోవడం అన్యాయమని వాందిచారు. అయితే.. ఒమిక్రాన్ విజృంభణతో బూస్టర్ డోసుపై తన ఆలోచనను మార్చుకున్నట్లు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ రోగనిరోధక శాస్త్రవేత్త స్కాట్ హెన్స్లీ అన్నారు. ఆసుపత్రిలో చేరకుండా ఉండే విషయంలో టీకాలు చాలా బాగా చేస్తున్నట్లు న్యూయార్క్‌లోని రాక్‌ఫెల్లర్ యూనివర్సిటీ ఇమ్యునాలజిస్ట్ మిచెల్ నస్సెన్‌జ్‌వీగ్ తెలిపారు.

పెరుగుతున్న కేసులను(omicron cases in india) నివారించేందుకు బూస్టర్ షాట్‌లతో పాటు.. కరోనా సామాజిక వ్యాప్తిని కచ్చితంగా నిలువరించాలని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ(anthony fauci) ఉద్ఘాటించారు. మూడో డోస్ పొందినప్పటికీ.. చలికాలంలో రోగనిరోధక శక్తి తగ్గిన వారు ఒమిక్రాన్‌ బారిన పడే అవకాశం ఉందన్నారు. ప్రతి సంవత్సరం చలికాలానికి ముందు బూస్టర్ డోసు అందిస్తున్నట్లు గుర్తుచేశారు.

50 కంటే ఎక్కువ ఉత్పరివర్తనాలున్న కరోనా వైరస్​ కుటుంబంలో ఒమిక్రాన్ ఇతర వేరియంట్‌ల కన్నా భిన్నంగా ఉందని, అందువల్ల.. పదేపదే కరోనా వ్యాక్సిన్‌లకు అందించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించడం మందగిస్తుందని దీప్తా భట్టాచార్య చెప్పారు. మరోవైపు.. కరోనాకు సంబంధించి ఏ వేరియంట్​నైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు పాన్-కరోనావైరస్​ పేరిట వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి కొన్ని పరిశోధనా బృందాలు. ఇది వైరస్​లోని భాగాలను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తుందని చెబుతున్నాయి.

Published by:Nikhil Kumar S
First published:

Tags: COVID-19 vaccine, Omicron corona variant, Second dose

ఉత్తమ కథలు