Home /News /explained /

EXPLAINED WHY YEMENS WAR HAS SPILLED INTO THE UNITED ARAB EMIRATES GH VB

Explained: యూఏఈపై యెమెన్ యుద్ధం.. ఏడేళ్లుగా ముదురుతోన్న వివాదం.. సంఘర్షణ ఎప్పుడు, ఎలా మొదలైంది..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అరబ్ దేశాల్లోనే అతి పేదదేశమైన యెమెన్‌లో యుద్ధ వాతావరణం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. 7 సంవత్సరాలుగా కొనసాగుతున్న సంఘర్షణలు తాజాగా తీవ్రతరమయ్యాయి.

అరబ్ దేశాల్లోనే అతి పేదదేశమైన యెమెన్‌లో యుద్ధ వాతావరణం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. 7 సంవత్సరాలుగా కొనసాగుతున్న సంఘర్షణలు తాజాగా తీవ్రతరమయ్యాయి. గత వారంలో రెండు సార్లు యెమెన్(Yemen) తిరుగుబాటుదారులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)పై క్షిపణులు, డ్రోన్లతో దాడులను ప్రారభించారు. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘంగా కొనసాగుతున్న ఘర్షణల్లో ఇది కూడా ఒకటి. అరేబియా ద్వీపకల్పంలో ఓ మూలలో ఏడేళ్లుగా జరుగుతున్న యుద్ధం ప్రాంతీయ ప్రమాదంగా ఎలా మారుతున్నాయో ఈ దాడులు నొక్కి చెబుతున్నాయి. ఇటీవల జరిగిన తాజా దాడుల్లో బ్రిటీష్, అమెరికా దళాలకు ఆతిథ్యమిస్తున్న ఎమిరాటీ సైనిక స్థావరాన్ని తిరుగుబాటుదారులు(Rebels) లక్ష్యంగా చేసుకున్నారు.

North Korea: ఉత్తర కొరియా మరో క్రూయిజ్ క్షిపణి పరీక్ష.. ఈ సంవత్సరంలో ఇది ఐదోది.. టార్గెట్ ఆ దేశమేనా..?


యుద్ధం ఎలా ప్రారంభమైంది?
ఇప్పటికే ఈ సంఘర్షణలో వేల మంది యెమెన్ పౌరులు, సైనికులు చనిపోయారు. అరబ్ ప్రపంచంలోనే అత్యంత పేద దేశంలో ఏళ్ల తరబడి ప్రజలు ఈ పెనుగులాటలో అతలాకుతలమవుతున్నారు. ఇరాన్ మద్దతు ఇస్తున్న హౌతీ రెబల్స్‌కు.. సౌదీ అరేబియా, యూఏఈ సహా అంతర్జాతీయ గుర్తింపు పొందిన యెమెన్ సంకీర్ణ ప్రభుత్వానికి మధ్య ఈ చిచ్చు 2014లో ప్రారంభమైంది. ఆ ఏడాది సెప్టెంబరులో హౌతీలు రాజధాని సనా, ఉత్తర యెమెన్‌లోని చాలా భాగాన్ని స్వాధీనం చేసుకోవడం యుద్ధం మొదలైంది. అమెరికా మద్దతుతో సంక్షీర్ణ అధ్యక్షుడు మన్సూర్ హదీ 2015లో ఈ ఘర్షణలోకి ప్రవేశించారు.

తీవ్రరూపం ఎలా దాల్చింది?
యెమెన్‌లో ఇటీవల కాలంలో జరిగిన యుద్ధంలో హౌతీలు చాలా మంది సైనికులను కోల్పోయారు. ఆ నిందను ఎమిరేట్స్‌పై మోపారు. అంతేకాకుండా ఉత్తరాన పూర్తి నియంత్రణ తెచ్చుకునేందుకు వారి ప్రయత్నాలను ఈ యుద్ధం ముగించింది. ప్రధానంగా కీలకమై సెంట్రల్ యెమెన్ నగరమైన మారిబ్‌ను స్వాధీనం చేసుకోవాలనే వారి లక్ష్యాన్ని నిరోధించడంతో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారు. ఈ నగరాన్ని స్వాధీనం చేసుకోవాలని గతేడాది హౌతీలు దాడిని ప్రారంభించారు. అయితే సంక్షీర్ణ కూటమి వైమానిక దాడుల వల్ల వారికి భారీ ప్రాణ నష్టం జరిగింది. అప్పటికీ మారిబ్ నగరం వెలుపల వరకు వచ్చారు. అయితే కూటమి సైన్యం హౌతీలను తరిమి కొట్టి మారిబ్ ప్రావిన్సులోని హతీ సరఫరా మార్గాన్ని నిరోధించారు.

హౌతీల రియాక్షన్..
ఇందుకు పతీకారంగా హౌతీలు మొదట సౌదీ అరేబియాపై, ఇప్పుడు యూఏఈపై బాలిస్టిక్ క్షిపణులు, పేలుడు పదార్థాలతో కూడిన డ్రోనులతో దాడులతో సమాధానం చెప్పారు. సోమవారం యూఏఈ, యూఎస్ మిలిటరీలు అబుదాబి మీదుగా రెండు బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నట్లు తెలిపాయి. తిరుగుబాటుదారులు అమెరికా, బ్రిటిష్ దళాలకు ఆతిథ్యం ఇచ్చే అల్-దఫ్రా ఎయిర్ బేస్‌ను లక్ష్యంగా చేసుకున్నారని స్పష్టం చేశాయి. గత వారం హౌతీలు అబుదాబి విమానాశ్రయమే లక్ష్యంగా ఫ్యూయల్ డిపోపై మరో దాడి చేశారు.

ఇందులో ముగ్గురు చనిపోగా.. ఆరుగురు గాయపడ్డారు. ఈ దాడులు ఎమిరేట్స్ వ్యాపార, పర్యాటక సంబంధాలను దెబ్బతీస్తున్నాయి. తిరుగుబాటుదారులు యెమెన్‌లో ప్రభుత్వ స్థావరాలపై, సామాన్య ప్రజలుండే ప్రదేశాల్లో తరచూ మిసైల్స్, డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. ఇందుకు ప్రతీకారంగా సంకీర్ణ కూటమి సనా, ఇతర హౌతీ తిరుగుబాటు స్థావరాలపై వైమానిక దాడిని ప్రారంభించింది. ఇందులో డజన్ల కొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

OMG: కుక్కల పురుషాంగాలకు అక్కడ భలే డిమాండ్.. నూనెలో ఫ్రై చేసుకొని లాగిస్తారు..

నిలిచిపోయిన శాంతి ప్రయత్నాలు..
యెమెన్‌లో శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించిన పాశ్చాత్య దేశాల ప్రమేయాన్ని ఇరు పక్షాల ఖండించాయి. హౌతీలపై ఉగ్రవాద హోదాను ఎత్తివేసే అంశాన్ని పరిశీలిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. అదే జరిగితే సంకీర్ణ కూటమికి అగ్రరాజ్య మద్ధతు అధికారికంగా ముగిసినట్లే.

ఫలితంగా శాంతి ప్రయత్నాలను పెంచడంతో పాటు మానవతా అవసరాలను తీర్చవచ్చని యూఎస్ భావిస్తోంది. అయితే అమెరికా ఈ చర్యలు హతీలకు ధైర్యాన్ని మాత్రమే ఇచ్చాయని యెమెన్, సౌదీ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మారిబ్ దాడితో యూఎస్, యూఎన్ దౌత్య చర్యలు ఇరుపక్షాలను చర్చలకు తీసుకురావడంలో విఫలమయ్యాయి.
Published by:Veera Babu
First published:

Tags: Explained, Yemen

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు