హోమ్ /వార్తలు /Explained /

Taliban- China Relations: ఆఫ్ఘనిస్థాన్‌ పునర్నిర్మాణం కోసం చైనా సాయం కోరుతున్న తాలిబన్లు.. ఎవరి వ్యూహం ఏమిటి ?

Taliban- China Relations: ఆఫ్ఘనిస్థాన్‌ పునర్నిర్మాణం కోసం చైనా సాయం కోరుతున్న తాలిబన్లు.. ఎవరి వ్యూహం ఏమిటి ?-  పాకిస్థాన్ రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డి పెడితే పౌర‌స‌త్వం ఇస్తామ‌ని చెబుతూ.. ఇటీవ‌ల పెట్టుబ‌డుల కోసం కొత్త ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టింది.(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

- పాకిస్థాన్ రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డి పెడితే పౌర‌స‌త్వం ఇస్తామ‌ని చెబుతూ.. ఇటీవ‌ల పెట్టుబ‌డుల కోసం కొత్త ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టింది.(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

తాలిబన్ల పాలనతో ఆ డబ్బు సరఫరాపై అనిశ్చితి ఏర్పడింది. పాశ్చాత్య దేశాలు అఫ్గాన్ విషయంలో తలదూర్చకుండా వేచి ఉండే విధానాన్ని అవలంభిస్తున్నాయి. దీనివల్ల కూడా నిధుల లేమితో ఆ దేశం విలవిల్లాడుతోంది.

అమెరికా తన బలగాలను అఫ్గానిస్థాన్‌ నుంచి ఉపసంహరించుకున్న తర్వాత తాలిబన్లు కాబూల్‌ను స్వాదీనం చేసుకున్నారు. కొద్ది రోజుల్లోనే ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఇదే అదునుగా భావించిన చైనా దృష్టి అఫ్గాన్‌పై పడింది. ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడమే కాకుండా తాలిబన్ పాలకులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. తాలిబన్లు కూడా డ్రాగన్ దేశంపై అభిమానం చూపుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో ఇరు దేశాల పాలకులు సంబంధాలు పెంపొందించుకోవాలని భావిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

* చైనాతో సంబంధాలను తాలిబన్లు ఎందుకు ఆశిస్తున్నారు?

ప్రజాస్వామ్య బద్ధంగా, అమెరికా మద్దతుతో ఎన్నికైన గత అఫ్గాన్ ప్రభుత్వాన్ని తాలిబన్లు కూలదోయడంతో అంతర్జాతీయ సమాజం నుంచి వారిపై వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా ప్రపంచ దేశాలు, సంస్థలు అఫ్గాన్‌కు నిధులను నిరాకరిస్తున్నాయి. అమెరికా ఇప్పటికే అఫ్గానిస్థాన్‌కు చెల్లించాల్సిన బిలియన్ డాలర్ల సొమ్మును స్తంభింపజేసింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్గాన్(డీఏబీ)కు యూఎస్ దాదాపు 9.5 బిలియన్ డాలర్లను నిలిపివేసినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.

అంతర్జాతీయ ద్రవ్య సంస్థ కూడా అఫ్గాన్‌కు మనీ యాక్సెస్‌ను నిరోధించింది. ఆ దేశ బడ్జెట్‌లో ఎక్కువ భాగం దాతల సహాయంతో సేకరించిన నిధులే ఉంటాయి. అయితే తాలిబన్ల పాలనతో ఆ డబ్బు సరఫరాపై అనిశ్చితి ఏర్పడింది. పాశ్చాత్య దేశాలు అఫ్గాన్ విషయంలో తలదూర్చకుండా వేచి ఉండే విధానాన్ని అవలంభిస్తున్నాయి. దీనివల్ల కూడా నిధుల లేమితో ఆ దేశం విలవిల్లాడుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో చైనా ముందుకు వచ్చింది. ఆఫ్గాన్‌ను తాలిబన్లు స్వాదీనం చేసుకోవడానికి ముందు ఆ గ్రూప్ ముఖ్యనేత ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్‌తో పాటు ఇతర ముఖ్య నాయకులకు డ్రాగన్ దేశం ఆతిథ్యమిచ్చింది. జులైలో టియాంజిన్‌లో పర్యటించిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సైతం అఫ్గాన్ లో తాలిబన్లను కీలక సైనిక, రాజకీయ శక్తిగా అభివర్ణించారు. అంతేకాకుండా చైనా తమకు ముఖ్యమైన భాగస్వామి అని, వ్యాపార, వాణిజ్య పెట్టుబడులకు మంచి అవకాశంగా భావిస్తున్నామని తాలిబన్ల ప్రతినిధి జబిబుల్లా ముజాహిద్ అన్నారు.

* ఇరుపక్షాలకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

గ్లోబల్ పవర్ గా ఎదగడానికి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(BRI) ప్రాజెక్టును చైనా అధ్యక్షుడు జీ జింగ్ పింగ్ ప్రారంభించారు. ఇది డ్రాగన్ దేశానికి ఎంతో కీలకమై ప్రాజెక్టు. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(CPEC)ను 40 నుంచి 60 బిలియన్ డాలర్లతో చైనా నిర్మిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులకు అఫ్గాన్‌ కీలక స్థావరంగా మారనుంది. దీంతో వీటికి తాలిబన్ల మద్దతు అవసరం. ఇప్పటికే సీపీఈసీ నిర్మాణ సమయంలో చైనా వర్కర్లపై పదే పదే స్థానికులు దాడులు చేస్తున్న నేపథ్యంలో వాటిని నివారించడానికి తాలిబన్లు గేమ్ ఛేంజర్ గా నిరూపించుకోవచ్చు.

బీఆర్ఐ ప్రాజెక్టును తాలిబన్లు కూడా స్వాగతించారని వస్తున్న వార్తలపై పాక్ మంత్రి రషీద్ స్పందించారు. ఇది మంచి పరిణామమని అన్నారు. సీపీఈసీలో అఫ్గానిస్థాన్ చేరికను ప్రోత్సహిస్తున్నామని, ఈ ఎకనామిక్ కారిడార్ పాకిస్థాన్ ఆర్థిక జీవనాడి అని అభివర్ణించారు. మౌలిక సదుపాయాలే కాకుండా దేశంలో పెద్ద మొత్తంలో రాగి గనులు ఉన్నాయని, ఇందుకు చైనాకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ముజాహిద్ పేర్కొన్నారు. వీటిని ఆధునీకరించి చైనా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తామని స్పష్టం చేశారు.

* అఫ్గాన్ లో అపారమైన ఖనిజ సంపద..

అఫ్గానిస్థాన్ లో లిథియం నిల్వలు అధిక మొత్తంలో ఉన్నాయని, అఫ్గాన్ ను 'సౌదీ అరేబియా ఆఫ్ లిథియం' అని అమెరికా డిఫెన్స్ విభాగం 2010లోనే వెల్లడించింది. బ్యాటరీలు, డిజిటల్ పరికరాలు, స్మార్ట్ ఫోన్ల తయారీలో లిథియం ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఇది మాత్రమే కాకుండా రాగి, బంగారం, ఆయిల్, నేచురల్ గ్యాస్, యురేనియం, బాక్సైట్, బొగ్గు, ఇనుము, క్రోమియం, సీసం, జింక్, జెమ్ స్టోన్, టాల్క్, సల్ఫర్ లాంటి ఇతర ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉన్నాయని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ పేర్కొంది.

దాదాపు 60 మిలియన్ టన్నుల రాగి నిక్షేపాలు ఉన్నాయని 2019లో అఫ్గాన్ ప్రభుత్వం అంచనా వేసింది. వీటి విలువ వందల మిలియన్ల డాలర్లు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే చైనా.. ఆఫ్గాన్ లో ఇప్పటికే కాపర్ ప్రాజెక్టును 30 ఏళ్ల లీజుకు తీసుకుంది. అయితే అమెరికా బలగాలు ఉండటం వల్ల ఇంతవరకు అక్కడ ఉత్పత్తి ప్రారంభం కాలేదు. ప్రస్తుతం అమెరికా సైన్యాన్ని వెనక్కి పిలవడంతో చైనా కాపర్ ప్రాజెక్టు పట్ల ఆత్రుతగా ఉంది. త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని భావిస్తోంది. ఇది మాత్రమే కాకుండా అఫ్గాన్‌లో మొత్తం ఒక ట్రిలియన్ డాలర్లు విలువ చేసే ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Harish Rao: టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్‌ హరీశ్‌రావుకు వింత పరిస్థితి.. ప్లస్సా ? మైనస్సా ?

Children Sleeping Hours: ఏ వయసు పిల్లలకు ఎంత నిద్ర అవసరమో తెలుసా ?.. కచ్చితంగా తెలుసుకోండి.. లేదంటే..

యూఎస్ బలగాల ఉపసంహరణతో బీజింగ్.. కాబూల్‌కు అవసరమైన వాటిని అందిస్తూ ఆ దేశానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా అఫ్గాన్ ఆర్థిక వ్యవస్థకు చైనా మూలస్తంభంగా మారేందుకు పావులు కదుపుతోంది. ఆ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది. అఫ్గాన్ పాలకమండలితో సఖ్యతగా ఉంటూ 1 ట్రిలియన్ డాలర్లకు పైగా విలువైన అక్కడి ఖనిజ నిక్షేపాలతో భారీ లాభాలు పొందాలని ఆశిస్తోంది.

First published:

Tags: Afghanistan, China, Taliban

ఉత్తమ కథలు