హోమ్ /వార్తలు /Explained /

Explained: ఉత్తర కొరియా శాటిలైట్‌ ప్రయోగంపై దుమారం.. ఎందుకు ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదం అవుతోంది..?

Explained: ఉత్తర కొరియా శాటిలైట్‌ ప్రయోగంపై దుమారం.. ఎందుకు ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదం అవుతోంది..?

ఉత్తర కొరియా(North Korea) ఓ శాటిలైట్‌(Satellite)ను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. ఈ చర్య వివాదాస్పదం అయ్యే ఆస్కారం ఉంది. అణు బాంబులు కలిగిన ఉత్తర కొరియా, ఇప్పటికీ ఆయుధాల తయారీలో నిషేధిత బాలిస్టిక్‌ మిస్సైల్‌ టెక్నాలజీని వినియోగిస్తోందని కొందరు నిపుణులు చెబుతున్నారు.

ఉత్తర కొరియా(North Korea) ఓ శాటిలైట్‌(Satellite)ను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. ఈ చర్య వివాదాస్పదం అయ్యే ఆస్కారం ఉంది. అణు బాంబులు కలిగిన ఉత్తర కొరియా, ఇప్పటికీ ఆయుధాల తయారీలో నిషేధిత బాలిస్టిక్‌ మిస్సైల్‌ టెక్నాలజీని వినియోగిస్తోందని కొందరు నిపుణులు చెబుతున్నారు.

ఉత్తర కొరియా(North Korea) ఓ శాటిలైట్‌(Satellite)ను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. ఈ చర్య వివాదాస్పదం అయ్యే ఆస్కారం ఉంది. అణు బాంబులు కలిగిన ఉత్తర కొరియా, ఇప్పటికీ ఆయుధాల తయారీలో నిషేధిత బాలిస్టిక్‌ మిస్సైల్‌ టెక్నాలజీని వినియోగిస్తోందని కొందరు నిపుణులు చెబుతున్నారు.

ఇంకా చదవండి ...

  ఉత్తర కొరియా(North Korea) ఓ శాటిలైట్‌(Satellite)ను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. ఈ చర్య వివాదాస్పదం అయ్యే ఆస్కారం ఉంది. అణు బాంబులు కలిగిన ఉత్తర కొరియా, ఇప్పటికీ ఆయుధాల తయారీలో నిషేధిత బాలిస్టిక్‌ మిస్సైల్‌ టెక్నాలజీని(Technology) వినియోగిస్తోందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరిలో చాలా పెద్ద సంఖ్యలో మిసైల్స్‌ను ఉత్తర కొరియా పరీక్షించింది. 2017 తర్వాత మొదటిసారి అణు ఆయుధాలను, లాంగెస్ట్‌ రేంజ్‌ ఇంటర్‌కాంటినెంటల్‌ బాలిస్టిక్‌ మిసైల్స్‌(ICBMs)ను పరీక్షించనున్నట్లు సూచనలు చేసింది. ఆదివారం మిసైల్స్‌ లాంచ్‌ చేస్తున్న సమయంలో శాటిలైట్‌కు సంబంధించిన సిస్టమ్స్‌ను కూడా పర్యవేక్షించింది. వారంలోనే శాటిలైట్‌ సంబంధిత పరీక్షలను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. భూమి కక్ష్యలోకి ఉత్తర కొరియా శాటిలైట్‌ను ప్రవేశపెట్టడానికి పెద్ద సమయం కూడా అవసరం లేనట్లు కనిపిస్తోందని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

  ఉత్తర కొరియా ప్రయోగాల చరిత్ర

  1998 నుంచి ఉత్తర కొరియా ఐదు శాటిలైట్స్‌ను ప్రయోగించింది. అందులో 2016లో ప్రయోగించిన ఉపగ్రహంతో కలిపి రెండు విజయవంతంగా భూమి కక్ష్యలోకి చేరాయి. ఆ శాటిలైట్‌ నియంత్రణలోనే ఉందని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఏదైనా సమాచారాన్ని పంపుతోందా లేదా అనేది తెలియడం లేదని చెప్పారు. 2016లో శాటిలైట్‌ను ప్రయోగించేందుకు త్రీ స్టేజెస్‌ రాకెట్‌ బూస్టర్‌ లాంచ్‌ప్యాడ్‌ను ఉత్తర కొరియా వినియోగించింది. గతంలో శాటిలైట్‌ల ప్రయోగానికి Unha-3 లాంచ్‌ప్యాడ్‌ ఉపయోగించింది. కొత్తగా నిర్మించిన త్రీ స్టేజెస్‌ రాకెట్‌ బూస్టర్‌ లాంచ్‌ప్యాడ్‌ను భారీ శాటిలైట్‌ ప్రయోగాలకే ఉద్దేశించినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

  Explained: ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీపై భగ్గుమంటున్న వ్యాపారులు.. ఆందోళనకు కారణం ఏంటి..?


  2016 ప్రయోగం అనంతరం ఉత్తర కొరియా స్పేస్‌ ఎజన్సీకి చెందిన ఓ సీనియర్‌ అధికారి మాట్లాడుతూ.. ‘2020వ ఏడాదికి మరో అడ్వాన్స్డ్‌ శాటిలైన్‌ను ప్రయోగించే ప్రణాళికలో ఉన్నాం. చంద్రుడిపై కూడా ఉత్తర కొరియా జెండా నాటుతాం’ అని వివరించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రయోగమూ జరగలేదు. 2021 పార్టీ కాంగ్రెస్‌ సమావేశంలో కిమ్‌ జాంగ్‌ ఉన్‌ మిలిటరీకి సంబంధించిన శాటిలైట్‌ను అభివృద్ది చేయనున్నట్లు ప్రకటించారు.

  డ్యుయల్‌- యూజ్ టెక్నాలజీ

  ఉత్తర కొరియా ఎలాంటి బాలిస్టిక్‌ ఆయుధాలను తయారు చేయకూడదని, దానిపై నిషేధం ఉందని యునైటడ్‌ నేషన్స్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని అమెరికా, ఆదేశ మిత్రపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు ఉత్తర కొరియా ప్రయోగిస్తున్న శాటిలైట్‌కూ యూఎన్‌ నిబంధనలను అతిక్రమించే ప్రయోగిస్తున్నారని చెబుతున్నాయి. అయితే తమ పరీక్షలు, ప్రయోగాలు తమ స్వతంత్ర హక్కని ఉత్తర కొరియా స్పందించింది. 2016 శాటిలైట్‌ ప్రయోగం సమయానికి, ఉత్తర కొరియా ఐసీబీఎంను పరీక్షించలేదు. శాటిలైట్‌ ప్రయోగాన్ని అమెరికా ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. ఈ క్రమంలో ఉత్తరకొరియా బాలిస్టిక్‌ మిసైల్‌ పరీక్షలను పక్కనబెట్టింది. ఐసీబీఎం ద్వారా ఇతర ఖండంలోని దేశాలపై సైతం దాడులకు తెగబడవచ్చు.

  Work From Home: పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్‌కు పెరిగిన పాపులారిటీ.. రిమోట్ కల్చర్‌పై ఆసక్తి చూపుతున్న కంపెనీలు ఇవే..!


  యూఎస్‌ బేస్డ్‌ మానిటరింగ్‌ ప్రోగ్రామ్‌ 38 నార్త్‌ ఓ ప్రకటనలో.. ఉత్తర కొరియా ప్రధాన లక్ష్యం బాలిస్టిక్‌ మిసైల్స్‌ ప్రయోగమని చెప్పింది. అయితే శాటిలైట్‌ ప్రయోగాన్ని ముందు ఉంచి మిస్సైల్స్‌ను పరీక్షిస్తున్నారని ఆరోపించింది. 2017 నుంచి ఇప్పటి వరకు ఉత్తర కొరియా ఐసీబీఎంను పరీక్షించలేదని, ప్రస్తుత ప్రయోగంతో ఇంకా అలాంటి వాటిని తయారు చేసే అవకాశం ఉత్తర కొరియాకు దక్కుతుందని అమెరికా, సియోల్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కన్సెర్వేటివ్‌ పార్టీ నుంచి దక్షిణ కొరియా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న యూన్‌ సుక్‌-యోల్‌ మాట్లాడుతూ.. ‘శాటిలైట్‌ ప్రయోగాల పేరిట బాలిస్టిక్‌ మిస్సైల్స్‌ను ప్రయోగిస్తే ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి తప్పదు’ అని చెప్పారు.

  First published:

  Tags: Kim jong un, Satellite, South korea

  ఉత్తమ కథలు