హోమ్ /వార్తలు /Explained /

Explained: భారతదేశంలో వైవాహిక అత్యాచారం నేరం ఎందుకు కాదు..? దీని గురించి పూర్తి వివరాలు ఇలా..

Explained: భారతదేశంలో వైవాహిక అత్యాచారం నేరం ఎందుకు కాదు..? దీని గురించి పూర్తి వివరాలు ఇలా..

ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ హైకోర్టు

భార్య అంగీకారం లేకుండా భర్త సెక్స్‌ చేస్తే దాన్ని వైవాహిక అత్యాచారం(Marital Rape)గా పరిగణించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఏకాభిప్రాయంతో కూడిన తీర్పు ఇవ్వలేకపోయింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన ఇద్దరు న్యాయమూర్తులలో ఒకరు పిటిషనర్ల వాదనలతో ఏకీభవించగా, ?

ఇంకా చదవండి ...

భార్య(Wife) అంగీకారం లేకుండా భర్త శృంగారం  చేస్తే దాన్ని వైవాహిక అత్యాచారంగా పరిగణించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) ఏకాభిప్రాయంతో కూడిన తీర్పు ఇవ్వలేకపోయింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన ఇద్దరు న్యాయమూర్తులలో ఒకరు పిటిషనర్ల వాదనలతో ఏకీభవించగా, మరొకరు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో వైవాహిక అత్యాచారం అంటే ఏంటి, మన దేశంలో దీన్ని ఎందుకు నేరంగా పరిగణించట్లేదు వంటి విషయాలు తెలుసుకుందాం. పురుషుడు, స్త్రీ పెళ్లి(Marriage) సమయంలో అనేక సార్లు అగ్ని చుట్టూ తిరుగుతారు, ఇతర పురాతన ఆచారాలను పాటిస్తారు, లేదా నిర్దిష్ట కాగితంపై సంతకం చేస్తారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత స్త్రీ ఇప్పుడు భర్త కోరుకొన్నప్పుడు అతనితో సెక్స్ చేయడానికి అంగీకరించినట్లు పలువురు భావిస్తున్నారని, అది సమంజసం కాదని, నేరంగా పరిగణించాలని పిటిషన్లు పేర్కొంటున్నారు.

దీనిపై ఢిల్లీ హైకోర్టు మే 11 బుధవారం.. వైవాహిక అత్యాచారం మినహాయింపు రాజ్యాంగబద్ధతపై భిన్నఅభిప్రాయాలు వెల్లడించింది. సెక్షన్ 2 నుంచి సెక్షన్ 375 (వైవాహిక అత్యాచారం మినహాయింపును నిర్దేశిస్తుంది) .. రాజ్యాంగంలోని 14, 15, 21 ఆర్టికల్‌లను ఉల్లంఘించేది కాబట్టి దానిని కొట్టివేయాలని జస్టిస్ రాజీవ్ శక్ధర్ అభిప్రాయపడ్డారు. అయితే డివిజన్ బెంచ్‌లోని మరో న్యాయమూర్తి జస్టిస్ సి హరి శంకర్ ఈ వాదనతో ఏకీభవించలేదు. మినహాయింపును కొట్టివేయడానికి ఎటువంటి ఆధారాలు లేవని, ఇది ఆర్టికల్ 14 ప్రకారం సమర్థనీయమని తెలిపారు.

Viral Letter : ఓ విద్యార్థి టీచర్ కు సమర్పించిన అపాలజీ లెటర్ చూస్తే ఎవరికైనా కళ్లల్లో నీళ్లు రావాల్సిందే

భారతదేశంలోని ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు, 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు తమ జీవిత భాగస్వాముల నుండి ఏదో ఒక రకమైన హింసను అనుభవించినట్లు తాజా NHFS డేటా పేర్కొంది. దాదాపు 80 శాతం మంది మహిళలు తమ ప్రస్తుత భర్తను నేరస్థులుగా నివేదించారు. 9 శాతం మంది తమ మాజీ భర్తలను నేరస్థులుగా పేర్కొన్నారు.

ఈ మినహాయింపు ఏంటి?

IPC సెక్షన్ 375 నుంచి మినహాయింపు 2- అత్యాచారం నేరం ఏమిటో నిర్వచించే విభాగం. అందులో.. "పదిహేనేళ్లలోపు లేని భార్య, తన సొంత భర్తతో లైంగిక సంపర్కం లేదా లైంగిక చర్యలు అత్యాచారం కాదు." అని చెబుతుంది. స్వాతంత్య్రం రాక పూర్వం నుంచి భారతదేశంలో అత్యాచార చట్టాలు అనేక మార్పులకు లోనయ్యాయి. కానీ వైవాహిక అత్యాచారానికి మినహాయింపు ఎప్పుడూ ఉంటుంది. కేవలం ఐదేళ్ల క్రితం 2017లో.. పదిహేనేళ్ల లోపు వయసును 18 ఏళ్లు గా మార్చారు. 18 ఏళ్లలోపు లేని భార్యగా చదవాలని సుప్రీం కోర్టు తెలిపింది. వైవాహిక అత్యాచారం మినహాయింపు సమస్యను పరిష్కరించలేదు.

* వైవాహిక అత్యాచారం మినహాయింపుపై పార్లమెంటు నిర్ణయం తీసుకోలేదా?

2000లో లా కమిషన్ ఆఫ్ ఇండియా, లైంగిక హింసపై భారతదేశ చట్టాలను సంస్కరించే అనేక ప్రతిపాదనలను పరిశీలిస్తున్నప్పుడు, వైవాహిక అత్యాచారం మినహాయింపును తీసివేయవలసిన అవసరాన్ని తిరస్కరించింది. నిర్భయ గ్యాంగ్‌రేప్, హత్య తర్వాత భారతదేశంలోని రేప్ చట్టాలకు సవరణలు ప్రతిపాదించడానికి బాధ్యత వహించిన జస్టిస్ JS వర్మ కమిటీ, దాని సిఫార్సులలో ఒకటిగా వైవాహిక అత్యాచారం మినహాయింపును తొలగించడాన్ని చేర్చింది. అయితే ఈ సవరణను 2013లో పార్లమెంటరీ ప్యానెల్ ఆమోదించలేదు.

2015లో వైవాహిక అత్యాచారం గురించి పార్లమెంటులో ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు, అప్పటి హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ పరాతీభాయ్ చౌదరి ఇలా ప్రతిస్పందించారు.. "భారత సమాజంలో వివాహాన్ని పవిత్రంగా పరిగణిస్తారు. కాబట్టి దేశంలో వైవాహిక అత్యాచారం వర్తించదు." అన్నారు. 2017లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కృష్ణ రాజ్ మరోసారి మినహాయింపును తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ, 2013లో ఈ అంశంపై పార్లమెంటరీ ప్యానెల్ అభిప్రాయాలను చెప్పారు. వైవాహిక అత్యాచారాన్ని చట్టం పరిధిలోకి తీసుకువస్తే మొత్తం కుటుంబ వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురవుతుందని అభిప్రాయపడ్డారు.

Explained: శ్రీలంకలో కొనసాగుతున్న ప్రజల నిరసనలు.. లంక ఆర్థికంగా పతనం కావడానికి కారణాలు ఏంటి?


* కేసు ఏమిటి?

భారత శిక్షాస్మృతిలోని 375వ నిబంధన(అత్యాచారం) నుంచి వైవాహిక అత్యాచారాన్ని మినహాయించడంతో, దాన్ని రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. సెక్షన్‌ 375లోని మినహాయింపు ప్రకారం.. భార్య మైనర్‌ కానప్పుడు, ఆమెతో భర్త లైంగిక చర్యల్లో పాల్గొనడాన్ని అత్యాచారంగా పరిగణించరు. దీన్ని సవాలు చేస్తూ అఖిల భారత ప్రసాస్వామ్య మహిళా సంఘం, ఆర్‌ఐటీ ఫౌండేషన్‌ పిటిషన్‌లు వేశాయి. భార్య అంగీకారం లేకుండా భర్త సెక్స్‌ చేస్తే అది అత్యాచారం కిందకు వస్తుందని, నేరంగా పరిగణించాలని పిటిషన్‌లో కోరాయి. ఈ అంశంలో 2017లోనే అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం వైవాహిక అత్యాచారం నేరం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

First published:

Tags: After marriage, Delhi High Court, Explained, Ipc

ఉత్తమ కథలు