EXPLAINED WHY INDONESIA IS MOVING ITS CAPITAL FROM JAKARTA TO NUSANTARA GH VB
Explained: ఇండోనేషియా రాజధాని మార్చడానికి గల కారణం ఏంటి..? ఆ దేశంలో ప్రస్తుతం ఏ జరుగుతోంది..?
ప్రతీకాత్మక చిత్రం
ఇండోనేషియా రాజధానిని జకార్తా నుంచి నుసంతరాకు మార్చేందుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. రాజధాని మార్పు బిల్లును మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టగా మెజార్టీ సభ్యులు దీన్ని ఆమోదించినట్లు ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ప్రకటించారు. ఇండోనేషియా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నుసంతరను ఎంపిక చేసినట్లు తెలిపారు.
ఇండోనేషియా రాజధానిని జకార్తా(Jakarta) నుంచి నుసంతరాకు(Nusantara) మార్చేందుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. రాజధాని మార్పు బిల్లును మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టగా మెజార్టీ సభ్యులు దీన్ని ఆమోదించినట్లు ఇండోనేషియా(Indonesia) అధ్యక్షుడు జోకో విడోడో ప్రకటించారు. ఇండోనేషియా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నుసంతరను ఎంపిక చేసినట్లు తెలిపారు. కాగా, రాజధానిని మార్చే ప్రణాళికను 2019లోనే ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు. జకార్తా ఎదుర్కొంటున్న భారీ పర్యావరణ సవాళ్ల నుంచి ఉపశమనం పొందేందుకు, సంపదను పునఃపంపిణీ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే, 2019లోనే ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా(Corona) మహమ్మారి కారణంగా ఆలస్యమైంది. అందువల్ల, 2022 నుంచి 2024 మధ్యలో రాజధాని తరలింపు ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి వరకు జకర్తానే ఇండోనేషియా రాజధానిగా కొనసాగుతుంది.
రాజధానిగా మారబోతున్న నుసంతరా ప్రదేశం బోర్నియో(Bornia) ద్వీపంలోని తూర్పున గల కాలిమాంటన్ అటవీ ప్రాతంలో ఉంది. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ద్వీపమైన బోర్నియోలో ఎక్కువ భాగం ఇండోనేషియాలోనే ఉంది. ఈ భూభాగాన్ని ఇండోనేషియా, మలేషియా, బ్రూనై దేశాలు పంచుకున్నాయి. ఇండోనేషియా వాటాగా వచ్చిన తూర్పు కాలిమాంటస్ భూభాగంలోనే కొత్త రాజధాని ఏర్పాటు చేస్తున్నారు. నుసంతరా అంటే ద్వీప సమూహం అని అర్థం. ఈ ప్రాంతం జావా ద్వీపంలోని ప్రస్తుత రాజధాని జకార్తాకు 2 వేల కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.
Pada siang yang berbahagia ini, saya menyampaikan bahwa pemerintah telah melakukan kajian mendalam, terutama tiga tahun terakhir.
Hasilnya, lokasi ibu kota baru paling ideal adalah di Kalimantan Timur, sebagian di Kab. Penajam Paser Utara dan sebagian di Kab. Kutai Kartanegara. pic.twitter.com/CjxTz3joQ4
జకార్తా నుంచి రాజధాని తరలింపు ఎందుకు?
ప్రస్తుత రాజధాని జకార్తా నగరంలో వాతావరణ మార్పుల నేపథ్యంలో వేగంగా మునిగిపోతోందనే భయాందోళనలు వ్యక్తమవుతుండటంతో ఈ కొత్త రాజధాని నగరం అవవసరమైంది. కాగా, కొత్త రాజధాని నుంచి పరిపాలన ప్రారంభించినా జకర్తా నగరం ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా ఉంటుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. రాజధానిగా మారబోతున్న నుసంతారా ప్రాంతంలో ఖనిజాలు అధికంగా ఉన్నాయి. ఈ తూర్పు కాలిమంటన్లో ప్రాంతంలో కేవలం 3.7 మిలియన్ల (37 లక్షలు) మంది మాత్రమే నివసిస్తున్నారు.
నేషనల్ టౌన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ లెక్కల ప్రకారం, రాజధాని ప్రాజెక్ట్ కోసం 256,142 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు. కొత్త రాజధానిని స్మార్ట్ సిటీలను తలదన్నేలా దాదాపు 2,561 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఈ భూమిని అటవీ ప్రాంతం నుంచి సేకరిస్తారు. అయితే, రాజధాని నిర్మాణం కోసం 33 బిలియన్ డాటర్ల ఖర్చు చేయనున్నారు. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రపంచ దేశాలను ఆకర్షించేలా కొత్త స్మార్ట్ మెట్రోపాలిస్ను కూడా నిర్మించనున్నారు. కాగా, మొత్తం 80 నగరాల పేర్లతో కూడిన జాబితా నుండి నుసాంటారా ఎంపిక చేసినట్లు ఇండోనేషియా నేషనల్ డెవలప్మెంట్ ప్లానింగ్ శాఖ మంత్రి సుహార్సో మోనోర్ఫా తెలిపారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.