Home /News /explained /

EXPLAINED WHY INDIA WORLDS 2ND LARGEST PRODUCER OF WHEAT BANNED ITS EXPORT KNOW FULL DETAILS HERE GH VB

Explained: గోధుమల ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న భారత్.. ప్రస్తుతం ఎగుమతులను ఎందుకు నిషేధించింది..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారతదేశం గోధుమల ఎగుమతుల(Wheat Exports)పై నిషేధం విధించింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. ధరలు ఎక్కువగా పెరిగాయి. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో సరఫరా గొలుసు దెబ్బతినడంతో ప్రపంచదేశాల అవసరాలను తీరుస్తామని ప్రకటించింది భారత్.

ఇంకా చదవండి ...
భారతదేశం(India) గోధుమల ఎగుమతుల(Wheat Exports)పై నిషేధం విధించింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ద్రవ్యోల్బణం(Inflation) విపరీతంగా పెరిగింది. ధరలు(Rates) ఎక్కువగా పెరిగాయి. ఉక్రెయిన్‌ యుద్ధం(Ukraine War) నేపథ్యంలో సరఫరా గొలుసు దెబ్బతినడంతో ప్రపంచదేశాల అవసరాలను తీరుస్తామని ప్రకటించిన భారత్‌(Bharath).. ప్రస్తుతం గోధుమల ఎగుమతులను నిషేధించింది.

భారత్ ఏమని ప్రకటించింది?
ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోని రెండో అతిపెద్ద గోధుమల ఉత్పత్తిదారుగా ఉంది. వ్యాపారులు ప్రభుత్వ ఆమోదంతో మాత్రమే కొత్త ఎగుమతి(Exports) ఒప్పందాలు చేసుకోగలరని ప్రభుత్వం ప్రకటించింది. మే 13 నాటి ఉత్తర్వుల ప్రకారం..‘రికార్డు స్థాయిలో అధిక ధరలతో కొట్టుమిట్టాడుతున్న ఇతర ప్రభుత్వాలు తమ ఆహార భద్రత అవసరాలను తీర్చుకోవడానికి చేస్తున్న అభ్యర్థనలను ముందుగా న్యూఢిల్లీ ఆమోదించాలి’ అని పేర్కొంది.

ఇంతకు ముందు విధానం ఏమిటి?
ప్రపంచ ఎగుమతుల్లో 12 శాతం వాటా ఉన్న ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి దాడి కారణంగా ఏర్పడిన సరఫరా కొరతను పూరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని భారతదేశం గతంలో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులను ఏడు మిలియన్ టన్నుల నుంచి 10 మిలియన్ టన్నులకు పెంచాలని యోచిస్తోంది. ఏప్రిల్‌లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ..‘మా రైతులు భారతదేశం వరకు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం అవసరాలు తీర్చేలా శ్రద్ధ వహించారు.’ అని చెప్పారు. గోధుమల ఎగుమతులను పెంపొందించడంపై చర్చించేందుకు ఈజిప్ట్, టర్కీ తదితర ప్రాంతాలకు ప్రతినిధుల బృందాలను పంపుతామని భారత్ గత వారం తెలిపింది. ఈ సందర్శనలు ఇప్పుడు కొనసాగుతాయా లేదా అనేది అస్పష్టంగా ఉంది.

Explained: ఫిన్‌లాండ్‌ NATOలో ఎందుకు చేరాలనుకుంటోంది..? ఈ ప్రతిపాదనకు పుతిన్ ఎందుకు వ్యతిరేకం..?


భారతదేశం ఎందుకు ఇలా చేసింది?
1.4 బిలియన్ల పేద దేశంలో రన్అవే ద్రవ్యోల్బణం, ఆహార భద్రత వంటి కారణాలు ఉన్నాయి. వాణిజ్య కార్యదర్శి బివిఆర్ సుబ్రహ్మణ్యం ఆదివారం మాట్లాడుతూ.. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో గోధుమలు, పిండి ధరలు ఇటీవలి వారాల్లో 20 నుంచి 40 శాతం పెరిగాయని చెప్పారు. అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరగడంతో కొందరు రైతులు ప్రభుత్వానికి కాకుండా వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీంతో దాదాపు 20 మిలియన్ టన్నుల బఫర్ స్టాక్ గురించి ప్రభుత్వం ఆందోళన చెందింది.

హీట్‌వేవ్ ప్రభావం చూపిందా?
భారతదేశం రికార్డు స్థాయిలో మార్చిలో అత్యధిక ఉష్ణోగ్రతను నమోదు చేసింది . వాతావరణ మార్పుల కారణంగా ఇటీవలి వారాల్లో 45 డిగ్రీల సెల్సియస్ (113 ఫారెన్‌హీట్) కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో మండుతున్న హీట్‌వేవ్‌ను చూసింది. ఇది గోధుమలను ఉత్పత్తి చేసే ఉత్తర భారతదేశంలోని రైతులను దెబ్బతీసింది. 2021లో ఉత్పత్తి 109 మిలియన్ టన్నుల నుండి ఈ సంవత్సరం కనీసం ఐదు శాతం తగ్గుతుందని అంచనా.

స్పందన ఏమిటి?
జర్మనీలో జరిగిన G7 వ్యవసాయ మంత్రుల సమావేశంలో జర్మన్ వ్యవసాయ మంత్రి సెమ్ ఓజ్డెమిర్ మాట్లాడుతూ, ఇటువంటి చర్యలు పెరుగుతున్న వస్తువుల ధరల సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ ఎగుమతి పరిమితులను విధించడం లేదా మార్కెట్లను మూసివేయడం ప్రారంభిస్తే, అది సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని చెప్పారు. యూరోపియన్ మార్కెట్ ప్రారంభమైనందున గోధుమ ధరలు సోమవారం కొత్త రికార్డు స్థాయికి.. టన్నుకు 435 యూరోలు (453 డాలర్లు) చేరుకున్నాయి.

భారతదేశం గోధుమల ఎగుమతిదారుగా ఉందా?
భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మార్జినల్ ప్లేయర్. దేశీయ వినియోగం కోసం ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. గత సంవత్సరం దేశ ఎగుమతులు దాదాపు సగం బంగ్లాదేశ్‌కు వెళ్లాయి. UN ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) ప్రకారం.. 2021లో రష్యా, ఉక్రెయిన్ ఎగుమతి చేసిన 53 మిలియన్ టన్నుల గోధుమలు, మెస్లిన్ (గోధుమ, రైస్ మిశ్రమం)తో పోలిస్తే భారతదేశం నుంచి 10 మిలియన్ టన్నుల ఎగుమతులు ఉన్నాయి.

Explained: ప్రధానమంత్రి ఆవాస్ యోజన- అర్భన్ పథకం అంటే ఏంటి..? ఈ స్కీమ్‌ లబ్ధిదారులు ఎవరు..?


అలాంటప్పుడు పెద్ద ప్రభావాన్ని ఎందుకు చూపింది?
పేద దేశాలలో కరవు, సామాజిక అశాంతి భయాలు పెంచడం, ఉక్రెయిన్‌లో సంఘర్షణ తర్వాత సరఫరా భయాల కారణంగా గ్లోబల్ కమోడిటీ ధరలు పెరిగాయి. భారతదేశం ఒక చిన్న భాగస్వామి అయినా దాని పెద్ద బఫర్ స్టాక్‌ల నుండి ఎగుమతులకు సంబంధించిన హామీలు ప్రపంచ ధరలకు కొంత మద్దతునిచ్చాయి. కొరత భయాలను తగ్గించాయి.
Published by:Veera Babu
First published:

Tags: Explained, Exports, Price, Wheat

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు