హోమ్ /వార్తలు /Explained /

Global Hunger Index: ఏం తమాషాలు చేస్తున్నారా.. ఇండెక్స్‌లో ఎందుకు ఈ అవకతవకలంటూ..

Global Hunger Index: ఏం తమాషాలు చేస్తున్నారా.. ఇండెక్స్‌లో ఎందుకు ఈ అవకతవకలంటూ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Global Hunger Index: 2021 సంవత్సరానికి గాను గ్లోబల్​ హంగర్‌ ఇండెక్స్‌ ప్రచురణకర్తలను భారత్‌ తప్పుబట్టింది. వారు ఎంచుకున్న విధానాన్ని వారు తీసుకున్న డేటా సోర్సెస్‌ను ప్రశ్నించింది. ఈ అంతర్జాతీయ ఆకలి సూచిక ర్యాంకింగ్‌లో 2020లో భారత్‌ 94వ స్థానంలో నిలవగా 2021లో అది 101వ స్థానానికి పడిపోయింది.

ఇంకా చదవండి ...

2021 సంవత్సరానికి గాను గ్లోబల్​హంగర్‌ ఇండెక్స్‌ ప్రచురణకర్తలను భారత్‌ తప్పుబట్టింది. వారు ఎంచుకున్న విధానాన్ని వారు తీసుకున్న డేటా సోర్సెస్‌ను ప్రశ్నించింది. ఈ అంతర్జాతీయ ఆకలి సూచిక ర్యాంకింగ్‌లో 2020లో భారత్‌ 94వ స్థానంలో నిలవగా 2021లో అది 101వ స్థానానికి పడిపోయింది. శ్రీలంక, నేపాల్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ కన్నా కూడా భారత్‌ దిగువన ఉంది. స్కోర్‌ పరంగా భారత్‌ స్థిరరమైన మెరుగుదలను చూపినా, ప్రాతినిధ్య సూచికల్లో మాత్రం మిశ్రమ పనితీరు కనిపించింది.

పెళ్లయిన వెంటనే ఆట ఆడారు.. దానిలో వరుడికి తగలకూడని చోట దెబ్బతగిలింది.. గిలగిల కొట్టుకుంటూ.. వీడియో వైరల్..


2021 ర్యాంకింగ్‌పై భారత్‌ అభ్యంతరం ఎందుకు?

ఈ నివేదికను విడుదల చేయడానికి ముందు ప్రచురణకర్తలు సరైనపరిశీలన జరపలేదనికేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి (WCD) మంత్రిత్వ శాఖ తప్పుబట్టింది. “ పోషకాహారం అందని ప్రజలకు సంబంధించి FAO అంచనాల ఆధారంగా గ్లోబల్‌ హంగర్‌ రిపోర్టు 2021లో భారత్‌ స్థానాన్ని తగ్గించడం షాక్‌కు గురిచేసింది. ఆ సమాచారంలో క్షేత్రస్థాయి వాస్తవాలు లేవు, అంతే కాదు తీవ్రమైన మెథడాలజికల్‌ సమస్యలు ఉన్నాయి” అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. FAO మెథడాలజీ అశాస్త్రీయంగా ఉందని, పోషకాహార లోపమన్నది బరువు, ఎత్తు ఆధారంగా లెక్కించాలని, కాని ఈ మెథడాలజీలో టెలిఫోన్‌ అంచనాలను బట్టి జనాభా నిర్ణయం జరిగిందని తెలిపింది.

Kerala Floods: కేరళలో భారీ వరదలకు కారణం ఇదే.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే..


కొవిడ్‌ సమయంలో మొత్తం జనాభాకు ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టి తీవ్ర ప్రయత్నాలను ఈ నివేదిక ఏ మాత్రం గుర్తించలేదని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. FAO నివేదిక ‘ది స్టేట్‌ ఆఫ్‌ ఫుడ్‌ సెక్యూరిటీ అండ్‌ న్యూట్రిషన్‌ ఇన్ ది వల్డ్‌ 2021’ను ప్రస్తావిస్తూ ఈ ప్రాంతంలోని అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంకలో కొవిడ్‌-19 ప్రభావం ఏ మాత్రం లేనట్టుగా ఈ నివేదిక చూపించడం ఆశ్చర్యం కలిగించిందని భారత్‌ పేర్కొంది. మహమ్మారి కారణంగా ఉద్యోగ, వ్యాపార నష్టాలు పెరిగి ఆదాయ స్థాయిలు పడిపోతే ఆ దేశాలు మాత్రం తమ స్థితిని మెరుగుపరుచుకోవడం ఆశ్చర్యంగా ఉందని తెలిపింది. కాగా, GHI 2021 కు సంబంధించి భారత్‌ పేజీని ఎప్పుడు అప్‌డేట్‌ చేశారనే విషయంలో స్పష్టత లేదు.

Explained: ప్రేమ పెళ్లి కంటే.. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఎక్కువ కాలం నిలబడటానికి కారణం ఏంటి.. దీని వెనుక రహస్యం ఇదే..


కానీ నివేదిక ప్రచురణకర్తలు మాత్రం తాము FAOకు చెందిన గ్యాలప్‌ టెలిఫోన్‌ ఆధారిత అభిప్రాయాలను ఉపయోగించలేదని తెలిపారు. 2018-20 కి సంబంధించిన డేటాలో ఎటువంటి మార్పు లేదని 2021 సమాచారం ఇంకా అందుబాటులోకి రాలేదని వెల్లడించారు. కొవిడ్‌-19 ప్రభావం రానున్న సంవత్సరాల్లో వచ్చే GHI డేటాలో ఉంటుందని వివరించారు. 2000 సంవత్సరం నుంచి భారత్‌ గణనీయమైన పురోగతి సాధించినా పిల్లల పోషకాహారానికి సంబందించిన స్థితి ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉందని ప్రచురణకర్తలు తెలిపారు.

Tea Rs.1,000: కప్పు టీ రూ.1,000.. అది కూడా తెలంగాణలో.. ఎందుకు అంత ధర..? తెలిస్తే మీరు వదలరూ..


2000 సంవత్సరం భారత్‌ స్కోర్‌ 38.8 పాయింట్లు ఉండగా, 2021లో ఇది 27.5 పాయింట్ల అయిందని, ఐదేళ్లలోపు చిన్నారుల మరణ రేటు ఇప్పుడు చాలా తగ్గిందని నివేదిక విశ్లేషించింది. అయితే, సూచికల్లోని చైల్డ్‌ వేస్టింగ్‌, స్టంటింగ్‌ రెండు పెరుగుతూనే ఉన్నాయి. చైల్డ్‌ స్టంటింగ్‌ అంటే వయస్సుకు తగిన ఎత్తు పెరగకపోవడం.1999-99లో ఇది 54.2 శాతం ఉంటే.. 2016-2018లో ఇది 34.7 శాతానికి చేరిందని, అయినా ఇది చాలా ఎక్కువేనని తెలిపింది. చైల్డ్‌ వేస్టింగ్‌ అంటే ఎత్తుకు తగిన బరువులో 1998-99లో 17.1 శాతం ఉండగా ఇప్పుడు 17.3 శాతంగా ఉందని పేర్కొంది. GHI కవర్‌ చేసిన అన్ని దేశాల్లోకి భారత్‌లోనే చైల్డ్‌ వేస్టింగ్‌ అత్యధికంగా ఉందని ఈ నివేదిక తెలిపింది.

గ్లోబల్​ హంగర్​ ఇండెక్స్​ అంటే?

జర్మనీకి చెందిన అతి పెద్ద ప్రైవేట్‌ సహాయ సంస్థల్లో ఒకటి వెల్ట్‌హంగర్‌ లైఫ్‌ సంస్థ ఐర్లాండ్‌కు చెందిన అతిపెద్ద మానవతా సంస్థ కన్సర్‌ వల్డ్‌వైడ్‌ సంయుక్తంగా ప్రతీ సంవత్సరం గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ (GHI)ని ప్రచురిస్తాయి. ఈ GHI నివేదిక తొలిసారి 2006లో ప్రచురించారు. అంతర్జాతీయ, ప్రాంతీయ, జాతీయస్థాయిల్లో ఆకలిని గుర్తించేందుకు, దాన్ని సమగ్రంగా లెక్కించేందుకు రూపొందించిన సాధనంగా GHIని పేర్కొంటారు. ఆకలి స్వభావానికి సంబంధించి – పోషకాహారలోపం, ఎత్తుకు తగ్గ బరువు, వయస్సుకు తగ్గ ఎత్తు, అంటే శిశు మరణాలు అనే నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకొని స్కోర్‌ రూపొందిస్తారు. ఈ సూచికల్లో వచ్చే స్కోర్‌ను మూడు దశల ప్రక్రియలో ప్రామాణీకరించి ఆ దేశానికి సంబందించిన GHI స్కోర్‌ కేటాయిస్తారు.

ఈ ర్యాంకింగ్​కు తీసుకున్న కీలక అంశాలేంటి..?

GHIలోని అంశాలకు సంబంధించి డేటా, అంచనాలను ఐక్యరాజ్యసమితి, ఇతర బహుళ ఏజెన్సీల నుంచి సేకరించామని ప్రచురణకర్తలు తెలిపారు. మెథడాలజీలో ఏకరూపత, పోలికల కోసం అన్ని దేశాలకు ఇదే సమాచార వనరులు ఉపయోగించామని వెల్లడించారు. పిల్లల ఎత్తు, బరువుకు సంబంధించి UNICEF, WHO, వల్డ్ బ్యాంక్‌ జాయింట్‌ చైల్డ్‌ మాల్‌న్యూట్రిషన్‌ అంచనాల 2021 ఎడిషన్స్‌ ఉపయోగించామని ప్రచురణకర్తలు పేర్కొన్నారు. భారతదేశానికి సంబంధించి 2019లో ప్రచురితమైన 2016-2018 సమగ్ర జాతీయ పోషకాహార సర్వే 2016-2018లోని సమాచారాన్ని తీసుకున్నట్టు వెల్లడించారు.

Success Story: పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తి కూతురికి ఐఐటీలో సీటు.. వైరల్ అయిన ఇండియన్ ఆయిల్ చైర్మన్ ట్వీట్..


ఐదేళ్లలోపు శిశు మరణాల సమాచారాన్ని సెప్టెంబర్‌ 2020లో ప్రచురించిన UN IGME (ఇంటర్‌ ఏజెన్సీ గ్రూప్‌ ఫర్‌ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్‌) ఛైల్డ్‌ మోర్టాలిటీ ఎస్టిమేట్స్‌ నుంచి తీసుకున్నారు. GHI స్కోర్లు, సూచికల విలువలను ఒక సంవత్సరం నివేదికను మరో సంవత్సరంతో పోల్చరాదని ప్రచరుణకర్తలు తెలిపారు. ప్రతీ సంవత్సరం వేర్వేరు దేశాలను చేర్చి ర్యాంకులు కేటాయించడం జరుగుతుందని వివరించారు. GHI స్కోర్‌ లెక్కింపు విధానాన్ని గతంలో సమీక్షించడం జరిగిందని, భవిష్యత్తులోనూ సమీక్షించడం జరుగుతుందని తెలిపారు. ఒక దేశపు ర్యాంక్‌ ఒక సంవత్సరంలో ఉన్నది మరో సంవత్సరంలో మారినట్టు అయితే దానర్థం దాన్ని మరో భిన్నమైన దేశాల బృందంతో పోల్చడం జరుగుతుందని ప్రచురణకర్తలు పేర్కొన్నారు.

Published by:Veera Babu
First published:

Tags: Hungry people, Index, India

ఉత్తమ కథలు