Home /News /explained /

EXPLAINED WHY DOES FINLAND WANT TO JOIN NATO WHY IS PUTIN OPPOSED TO THIS PROPOSAL KNOW FULL DETAILS HERE GH VB

Explained: ఫిన్‌లాండ్‌ NATOలో ఎందుకు చేరాలనుకుంటోంది..? ఈ ప్రతిపాదనకు పుతిన్ ఎందుకు వ్యతిరేకం..?

ప్రెస్ కానిఫిడెన్స్ లో పాల్గొన్న ఫిన్లాండ్ ప్రెసిడెంట్ సౌలి నీనిస్టో

ప్రెస్ కానిఫిడెన్స్ లో పాల్గొన్న ఫిన్లాండ్ ప్రెసిడెంట్ సౌలి నీనిస్టో

ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో తమ దేశం నాటో(NATO) కూటమిలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుంటుందని ఫిన్‌లాండ్(Finland) అధ్యక్షుడు సౌలి నీనిస్టో ఆదివారం స్పష్టం చేశారు.

ఉక్రెయిన్ (Ukraine) యుద్ధం తర్వాత మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో తమ దేశం నాటో(NATO) కూటమిలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుంటుందని ఫిన్‌లాండ్(Finland) అధ్యక్షుడు సౌలి నీనిస్టో ఆదివారం స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై మాస్కో(Moscow) దాడి చేసినప్పటి నుంచి, రష్యా(Russia) పొరుగు దేశాలు ఈ సైనిక కూటమిలో సభ్యత్వం కోసం దరఖాస్తు(Application) చేసుకొనేందుకు యోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టర్కీ(Turkey) అభ్యంతరాలను నాటో(NATO) అధిగమించగలదని.. ఫిన్‌లాండ్‌(Finland), స్వీడన్‌లను(Sweden) త్వరగా కూటమిలోకి తీసుకొనే నమ్మకం ఉందని NATO డిప్యూటీ చీఫ్ చెప్పారు.

* ఫిన్‌లాండ్‌ NATOలో చేరడంలో ప్రాముఖ్యత
మాస్కో ఒక శతాబ్దానికి పైగా పాలన తర్వాత 1917లో ఫిన్‌లాండ్‌ను స్వతంత్రంగా ప్రకటించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో దాని సైన్యం రెండుసార్లు సోవియట్ దళాలతో పోరాడి 10 శాతం భూభాగాన్ని కోల్పోయింది. ఫిన్‌లాండ్‌ NATOలో చేరితే, అది కూటమికి త్వరిత విస్తరణలో ఒకటి అవుతుంది. ఇంకా రష్యా, ఫిన్‌లాండ్‌ 1,300 కి.మీ సరిహద్దును పంచుకుంటున్నాయి. ఫిన్‌లాండ్‌ చేరితే రష్యాతో నాటోకు ఉన్న సరిహద్దు పొడవు రెట్టింపు అవుతుంది. రష్యాలోని రెండవ అతిపెద్ద నగరం, సెయింట్ పీటర్స్‌బర్గ్, ఫిన్‌లాండ్ సరిహద్దు నుంచి 170 కి.మీ.ల దూరంలో ఉంది. ఫిన్‌లాండ్‌, స్వీడన్ NATOలో చేరడం తూర్పున యూరప్ భద్రతా మ్యాప్ పునర్నిర్మాణాన్ని సూచిస్తుంది.

* ఫిన్‌లాండ్, స్వీడన్‌ ప్రతిపాదించిన షరతులు
మొత్తం 30 NATO దేశాల పార్లమెంట్‌లు కొత్త సభ్యులను ఆమోదించాల్సిన అవసరం ఉందని.. ఫిన్‌లాండ్ , స్వీడన్‌ దరఖాస్తు ప్రక్రియ దాదాపు ఒక సంవత్సరం పట్టవచ్చని NATO దౌత్యవేత్తలు చెప్పారు. ఫిన్‌లాండ్, స్వీడన్ ఈ కాలంలో NATO సభ్య దేశాలు తమను రక్షించుకునే వరకు కొన్ని హామీలను కోరాయి. తమపై దాడి జరిగితే మద్దతు ఇవ్వాలని స్వీడన్, ఫిన్‌లాండ్‌ ఇప్పటికే యుఎస్, జర్మనీ, బ్రిటన్ నుంచి హామీ పొందాయి.

Explained: ప్రధానమంత్రి ఆవాస్ యోజన- అర్భన్ పథకం అంటే ఏంటి..? ఈ స్కీమ్‌ లబ్ధిదారులు ఎవరు..?


* ఫిన్‌లాండ్‌, NATO మధ్య ప్రస్తుత సంబంధం
ఫిన్‌లాండ్‌ , స్వీడన్ NATO సన్నిహిత భాగస్వాములు. ఈ దేశాలు కూటమి కార్యకలాపాలకు, ఎయిర్ పోలీసింగ్‌కు సహకరిస్తాయి. ఉక్రెయిన్‌లో రష్యా దండయాత్ర తర్వాత, అధికారికంగా NATOతో సమాచార మార్పిడిని పెంచాయి. యుద్ధ సమస్యలపై ప్రతి సమావేశంలో చర్చించాయి. స్థూల దేశీయోత్పత్తిలో 2 శాతంగా ఉన్న NATO రక్షణ వ్యయ మార్గదర్శకాన్ని ఇప్పటికే సాధించినట్లు ఫిన్‌లాండ్‌ పేర్కొంది. స్వీడన్ కూడా తన సైనిక బడ్జెట్‌ను పెంచుతోంది. 2028 నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశిస్తోంది.

* ఫిన్‌లాండ్‌కు పుతిన్ హెచ్చరిక
NATOలో చేరడం తప్పు అని, ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తుందని ఫిన్‌లాండ్ అధ్యక్షుడు సౌలి నీనిస్టోను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది. కూటమిలో చేరితే సైనిక, సాంకేతిక ప్రతిస్పందన ఉంటుందని పుతిన్ చెప్పారు.
Published by:Veera Babu
First published:

Tags: Explained, Finland, Nato, Russia, Ukraine

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు